Sun 13 Jun 10:53:03.033586 2021
Authorization
- తిరునగరి శరత్ చంద్ర
6309873682
ప్రేయసీప్రియుల మధ్యన ఎన్నెన్నో అలకలు అల్లర్లు చేస్తుంటాయి. వలపులు సందళ్ళు చేస్తుంటాయి. అప్పుడే ముసిముసి నవ్వులతో కిలకిలలాడుకుంటారు. అప్పుడే అలకల్లో మునిగి రుసరుసలు రువ్వుకుంటూ ఉంటారు. ఒకరిని మించి ఒకరు బెట్టు చేస్తుంటారు. ఏది ఏమైనా వారి హదయాల నిండా మాత్రం ప్రేమను నింపుకుంటారు. ఇలాంటి గిలిగింతలు రేపే
ప్రేమపాటను 'భీష్మ' (2020) సినిమాలో కష్ణచైతన్య రాశాడు. దోబూచులాడే రెండు హదయాల వలపుగాథను ఎంతో చక్కగా వివరించాడీపాటలో కష్ణచైతన్య.
ప్రేమ మొదలయ్యేది చూపులతోనే. మాటలతో కాదు. చూపులతో మొదలైన ఈ తీయని కథ ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో మనకే తెలియదు. ఉరకలేసే వయసులో చూపులు కొంటె బాటలో కొత్త తీరాన్ని చేరుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రేయసి చూపు ప్రియున్ని తనివితీరా చూసింది. అది కూడా ప్రియుడు తనను చూడనంతసేపే. ఈ దోబూచులాటలో ఉన్న తీయందనం ప్రేమికుల మనసులకే తెలుసు కదా! ఆ ఆనందాన్ని, తీయందనాన్ని తాను పొందుతున్నానని ప్రేమికురాలు చెబుతుందిక్కడ. తన ఇష్టాన్ని చూపుల ద్వారా తెలుపుతుంది. కాసేపు మాత్రమే పైపైకి కోపంగా నటిస్తుంది. ఈ కోపం అనే తెరవెనుక అంతులేని ఆశ, నిండైన ప్రేమ దాగుందన్న విషయాన్ని ప్రేమికునికి తెలియజేస్తుంది ప్రేయసి. ఏదైనా అడిగినా,అలిగినా నీ దానినేనని, సంతోషంతో మురిసినా, ప్రేమగా మెరిసినా అది నీ వల్లెనేనని, తలచినా లేక తరిమినా నీ ధ్యాసలోనే అది జరుగుతుందని, ఆ ప్రేయసి ప్రేమికునికి తెలుపుతుంది. ఆమె గుప్పెడు మనసులో చెలరేగే తొందరకు కారణం తన ప్రియుడే. ఆ తొందరయే ప్రేమ. అద్భుతమనేది తన ముందు తన ప్రియుడిలా నిలబడి ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తుందామె.
తను ప్రాణంగా ప్రేమించే ప్రియుడు తనను కూడా ప్రాణంగా భావిస్తున్నాడని, తన కోసమే ఆరాటపడుతున్నాడని తెలుసుకున్న ప్రేయసికి ఎక్కడాలేని ఆనందం కలుగుతుంది. అప్పుడు కొంగ్రొత్త మొహమాటంతో ఆ ప్రేయసి మనసు వయసు ఉరకలేస్తుంది. ఆ ప్రేమికుడు ప్రేయసి ఎదలో రేపిన గిలిగింతలే, పులకింతలే ఆ మొహమాటానికి కారణమని చెప్పాలి. ప్రేమ వయసును బట్టి చిగురు తొడిగినా, దానికి మనసు తోడై పరుగులు తీసినా ప్రేయసీప్రియులు ఆటల్లో,పాటల్లో మునిగినప్పుడు ఒక్కోసారి వయసును గుర్తించరు. చిన్నపిల్లలైపోతారు. నిర్మలమైన మనసుల్లోనే ప్రేమ పుడుతుంది కదా! ప్రేమకు కల్మషమెరుగని మనసే చిరునామా కదా! అందుకే పసిమనసులతో ఒకరినొకరు వెంటపడి తరుముకోవడం, వెంటపడినా కంటపడకుండా తప్పించుకోవడం ఇలాంటి చిత్ర విచిత్రమైన ఆటలు, అల్లర్లు ఎన్నో ప్రేమ ప్రయాణంలో. అయినా మన సొంత వాళ్ళనుకున్నప్పుడు వారితో చేసే ప్రయాణం ఎంతో వింత వింతగా కవ్వింతగా ఉంటుంది కదా మరి.
మనవాళ్ళు అనుకున్నప్పుడు వారితో చేసే ప్రయాణం సుదీర్ఘమైనా, క్షణకాలమైనా మధురంగా ఉంటుంది. అది ప్రేమలో అయితే మధురాతిమధురంగా ఉంటుంది. ఈ పాట ద్వారా ప్రేమికులు సాగించే ఎంతో అందమైన ప్రయాణాన్ని అంతే అందంగా వివరించాడు కష్ణచైతన్య.
పాట :-
హే చూశా నేను నీ వైపు
నువ్వు నన్నే చూడనంత సేపు
దోబూచులాటేదో నీతో బాగుందిరా
నా ఇష్టం దాచుకుంది చూపు
నా కోపం పైకి కాసేపు
అంతులేని ఆశేదో ఎదలో దాగుందిరా
అలిగిన అడిగినా నీ దానినే
మురిసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే.. ఓహౌ.. ఓహౌ.
గుప్పెడు గుండెలో ఓ తొందరే
నువ్వనే అద్భుతం నా ముందరే
అందుకే ఇంతగా ఈ అల్లరి.. ఓహౌ.. ఓహౌ..
హా.. నా కోసం ఆరాటం
ముద్దుగానే ఉంది చాలా..
ఓ కొత్త మొహమాటం వేళ కాని ఈ వేళ
హా.. వెంటపడి మరి కంటపడనుగా..
విచిత్రమో వింత వైఖరి..
సొంతవారితో ప్రయాణము
అలిగినా అడిగినా నీ దానినే
మురిసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే .. ఓహౌ.. ఓహౌ
గుప్పెడు గుండెలో ఓ తొందరే
నువ్వనే అద్భుతం నా ముందరే
అందుకే ఇంతగా ఈ అల్లరే ..
ఓహౌ.. ఓహౌ..