కేరళ అనగానే నీరు, పచ్చని ప్రకృతి, పడవలు బాగా గుర్తుకు వస్తాయి. వీటితో పాటు కొన్ని కట్టడాలు కూడా చారిత్రకత కలిగి ఉన్నాయి. అక్కడి కోటలలోని ఒకటే పాలక్కడ్ కోట. పురాతన కాలం నుంచి ఈ కోట ఉన్నప్పటికీ అందుకు సంబంధించి ఆధారాలు లేవు. కానీ క్రీ.శ. 1766 నుంచి ఈ కోట నిర్మించినట్లు ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారు. దీనికి రాజు పాలక్కడ్ అచ్చన్. 1790 తర్వాత ఈ కోట మైసూరు సుల్తాన్, బ్రిటీష్ వారి చేతుల్లో ఉండేది. 1900 తర్వాత ఈ కోటను స్థానిక కార్యాలయంగా ఉపయోగించారు. ఆ తర్వాత అనేక మార్పులు చోటుచేసుకోగా ప్రస్తుతం ఈ కోటలో పాలక్కడ్ సబ్ జైలు ఉంది.