మన దేశంలో గుహలు చిన్నవో పెద్దవో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలోవే కన్హరీ గుహలు. ఇవి ముంబయి నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో దాదాపు 108 గుహలున్నాయి. వీటిని క్రీ.పూ. 100 సంవత్సరాల కాలం నాటివని అంచనా. ఇందులో బ్రాహ్మీ లిపితో కొన్ని శాసనాలున్నాయి. ఇక్కడ ప్రతి నిర్మాణం ముందు నీటి వసతి ఏర్పాటు ఉంది. ఇక్కడ ఆంధ్ర శాతకర్ణి రాజుల చరిత్ర శాసనాల రూపంలో ఉన్నదని పండితుల అభిప్రాయం.