భూమి సహజ వనరులలో గాలి, ఖనిజాలు, మొక్కలు, నేల, నీరు, వన్యప్రాణులు ఉన్నాయి. ఆరోగ్యకరమైన వాతావరణం స్థిరమైన, ఆరోగ్యకరమైన సమాజానికి పునాది.. ప్రస్తుతం ఆరోగ్యకరమైన వాతావరణం భూమి మీద లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకు అనేక కారణాలున్నాయి. పెరుగుతున్న జనాభా, నీటి వృథా, అనేక రకాల కాలుష్య కారకాలు ఒక్కటేమిటీ చాలానే పర్యావరణాన్ని అసమతుల్యం చేసేవి చాలానే ఉన్నాయి. ఫలితంగా ఎన్నో రకాల జీవజాతులు అంతరించిపోతున్నాయి. వీటన్నింటినీ సమతుల్యం చేసేందుకు నీటి వృథా అరికట్టడం, కాలుష్య నివారణ, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, భూమిలో కరగని వ్యర్థాల వాడకం తగ్గించడం ఇలా అనేకం ఉన్నాయి. ప్రతి యేటా జులై 28ని ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంగా నిర్వహించుకునేందుకు కేటాయించుకోవడంతో పాటు, ఏడాదికొక థీమ్‌ను నిర్ణయించుకుని దానికనుగుణంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.