టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మితిమీరిన అవసరాల కోసం ఒక పక్క అడవులను నరికివేస్తూనే, మరోపక్క టెక్నాలజీతో పాటు పచ్చదనంతో నిండిన ఆకర్షణీయ ప్రదేశాలను నిర్మిస్తున్నారు. అటువంటి ఆకర్షణీయ నిర్మాణాలలో ఒకటే సింగపూర్‌లోని 18 మెరీనా గార్డెన్ థీమ్ పార్క్... ఇందులో 18 పెద్ద చెట్లు ఉన్నాయి. చుట్టు పక్కల ప్రదేశాలను చల్లగా ఉంచడానికి, వర్షపు నీటిని నిల్వ చేసేందుకు నిర్మించారు. అంతేకాదు ఇక్కడ స్కై వాక్ కూడా ఉంది. ఈ ప్రాంతంలోని ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటిగా పేరుగాంచింది.