Sun 03 Oct 00:22:51.00733 2021
Authorization
లక్ష్మీదేవిపల్లి మారుమూల అందమైన పల్లెటూరు. ఎక్కడ చూసినా పచ్చటి పంట పొలాలతో, నీటి కాలువలతో గలగల పారుతూ ,అందంగా కాన వచ్చేది. చిన్న ఊరైనా అంతా ఎలాంటి కల్మషం లేకుండా కలిసిమెలిసి జీవించేవారు. ఊరి చివరన ప్రభుత్వ పాఠశాల ఉండేది. పెద్ద వాళ్లంతా పనికి , పిల్లలంతా బడికి వెళ్లి చదువుకునే వారు.
ప్రతి సంవత్సరం పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చింది. ప్రభుత్వం తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేయాలనే నిర్ణయానికి వచ్చింది. పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణం ప్రైవేటు పాఠశాలలో కి పిల్లలు వెళ్లడమే. మరి ఈ గ్రామంలో పాఠశాల విద్యార్థులు లేక మూతపడే అవకాశం ఉందని ప్రధానోపాధ్యాయులు కలవరం చెందాడు. వెంటనే గ్రామ కచేరి వద్ద పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, మీ పిల్లలను మ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకు పంపించకుండా వేల రూపాయలు చెల్లించి ప్రైవేటు పాఠశాలకు పంపితే, ఇక్కడ పాఠశాల మూతపడే అవకాశం ఉంది .ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ మంచి అనుభవం ఉన్నటువంటి వారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చినట్లయితే ఉచితంగా పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం ,వారానికి మూడుసార్లు కోడిగుడ్లు, స్కాలర్షిప్పులు, రవాణా చార్జీలు సైతం ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు.మీ పిల్లల చదువు గురించి కూడా మీరు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి తెలుసుకోవచ్చు .ఇంత చక్కటి అవకాశం ఉన్న పాఠశాలకు పంపించకుండా, ప్రైవేటు బడికి పంపడం మంచిది కాదని చెప్పాడు.మీకు అందరికీ వారం రోజులు ఆలోచించడానికి సమయం ఇస్తున్నాను ఆలోచించి చెప్పండి అని ప్రధానోపాధ్యాయులు సమావేశం ముగించాడు.
ప్రధానోపాధ్యాయులు వెళ్లిపోయిన తర్వాత గ్రామస్తులు అందరూ కలిసి మూకుమ్మడిగా ఆలోచించారు. గ్రామంలో ఉన్న పాఠశాలలోకే తమ పిల్లలను పంపించాలని ,ఇదే న్యాయ మనినిర్ణయించుకున్నారు.
అందరూ కలిసి కట్టుగా, రేపటి నుంచి పిల్లలందరూ గ్రామంలోని పాఠశాలకు వస్తారని ప్రైవేట్ స్కూలుకి పంపమని ప్రతినబూనారు.
మరుసటి రోజు గ్రామస్తులు తమ తమ పిల్లల్ని తీసుకొని అందరూ కలిసి పాఠశాలకు వచ్చారు. వారందరినీ ప్రధానోపాధ్యాయులు ఆహ్వానించాడు.
గ్రామస్తులందరూ ఒక్కసారిగా సార్ మా పిల్లలు ఇదే పాఠశాలకు రోజు వస్తారని ,ప్రైవేట్ స్కూల్ కు పంపమని మాటిచ్చారు. ఇదిగో మా పిల్లల ను మీ చేతుల్లో పెడుతున్నాం మీరే వారిని తీర్చిదిద్దాలి అన్నారు. వారి మాటలు విన్న ప్రధానోపాధ్యాయులు చాలా సంతోషపడ్డాడు. గ్రామస్తులు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బతికించి%శీ%దని వారికి కతజ్ఞతలు తెలియజేశాడు.
నీతి: కలిసికట్టుగా తీసుకొన్న
నిర్ణయం భవిష్యత్తుని మార్చేస్తు
- యాడవర చంద్రకాంత్ గౌడ్
పెద్ద గుండవెళ్లి, సిద్దిపేట జిల్లా, 9441762105