చెట్లు చిరుగాలి వీస్తే వయ్యారంగా ఊగుతాయి... అదే బలంగా గాలి వీస్తే.... నేలకు ఒరిగిపోతాయన్నట్టు భయం గొల్పిస్తాయి... కాని సంతోషంగా గంతులు వేసే చెట్ల గురించి తెలుసా... ఇండోనేషియాలోని సుంబా ద్వీపంలో ఉన్న, ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి వాలకిరి బీచ్లో తెల్లని ఇసుక, 'డాన్సింగ్ ట్రీస్' పర్యాటకులకు కనువిందు చేస్తాయి... ప్రశాంతమైన సముద్ర తీరంలో ఇసుక తిన్నెల మీద వయ్యారంగా సాల్సా డ్యాన్స్ చేస్తుంటే చూపరులు కనులు తిప్పుకోలేరట. సముద్ర తీరంలో ఉండే ఈ చెట్లు అలల తాకిడికి ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణం చేస్తాయి. పొట్టిగా రెండు మూడు కొమ్మలతో చిన్న చిన్న ఆకులతో మనిషి రూపంలో దర్శనమిచ్చే ఈ చెట్లను తదేకంగా చూస్తే డ్యాన్స్ చేస్తున్నాయన్నట్టు భ్రమ కలుగుతుందట. చెట్లు డ్యాన్స్ చేస్తున్నట్టు ఉండే దృశ్యం సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో చూడాలని పర్యాటకులు చెబుతున్నారు. సుంబా ద్వీపంలో ఉన్న ఈ మొక్కల చేసే సాల్సా డ్యాన్స్ చూడడనికి పర్యాటకులు ప్రకతి ప్రేమికులు క్యూ కడతారట.