Sat 06 Nov 23:46:51.890939 2021
Authorization
అదొక వింత గ్రామం. ఆ గ్రామంలో ఆడవారు ఒక భాష.. మగవారు మరో భాష మాట్లాడతారు. 10 ఏండ్లు దాటిని పిల్లలు కూడా అలాగే మాట్లాడాలి. భిన్నమతాలు... విభిన్నమైన భాషల మేలు కలయిక... పలు భాషలు.. యాసలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఓ రాష్ట్రంలో ఉన్నవారు ఒకే భాష మాట్లాడతారు. ఆయా ప్రాంతాలను బట్టి భాష యాస మారుతుందేమో గానీ భాష మాత్రం అదే ఉంటుంది. కానీ ఈ గ్రామంలో మాత్రం ఎక్కడా లేని విధంగా మహిళలకు ఒక భాష... పురుషులకు మరో భాష ఉంది. ఇంతకి ఈ వింత గ్రామం ఆఫ్రికా దేశాల్లో ఒకటైన నైజీరియాలోని ఉబాంగ్ గ్రామం ఉంది. బహుశా ఇటువంటి వింత గ్రామం ప్రపంచ వ్యాప్తంగా ఇదే అయి ఉంటుందేమో. ఈ గ్రామంలో ఉబాంగ్ అనే తెగ వాళ్లు ఎక్కువగా ఉంటారు. దీంతో ఆ గ్రామానికి కూడా అదే పేరు వచ్చింది. వాళ్లు మాట్లాడే రెండు భాషలు మహిళలు, పురుషులకు అర్థం అవుతాయి కానీ.. ఎవరు మాట్లాడే భాష వాళ్లే మాట్లాడుతారు. ఒకరి భాష మరొకరికి వచ్చినా మాట్లాడకపోవటం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఆ గ్రామంలో పిల్లలు అంతా అటు మహిళలు మాట్లాడే భాష అయినా ఇటు పురుషులు మాట్లాడే భాష మాట్లాడినా పట్టించుకోరు. అలా 10ఏండ్ల వయసు వరకు మాత్రమే వారు ఏ భాష మాట్లాడినా ఫరవాలేదు. కానీ 10ఏండ్లు దాటితే మాత్రం ఆడపిల్లు ఆడవారు మాట్లాడే భాష.. మగపిల్లలు మగవారు మాట్లాడే భాషే మాట్లాడాలి.