Sat 11 Dec 23:51:35.997905 2021
Authorization
భారతదేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్ స్టేషన్లను కలిగిన ప్రాంతం కూర్గ్. ఇది భారతదేశ స్కాట్లాండ్‌గా ప్రసిద్ధి. కూర్గ్‌గా పిలువబడే కొడగు ప్రాంతం ఇది. దక్షిణ కర్ణాటకలోని సుందరమైన, ఆకర్షణీయమైన పర్వత ప్రాంతం ఇది. ఇక్కడి పచ్చని వాతావరణం, కాఫీ తోటలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది.
అబ్బే జలపాతం: కూర్గ్ సందర్శనకు ఉత్తమమైన ప్రదేశాలలో అబ్బే జలపాతం ఒకటి. ఈ జలపాతాలు మడికెరి పట్టణానికి 7-8 కి.మీ.ల దూరంలో కలవు. కూర్గ్‌లో అబ్బే ఫాల్స్ అధికంగా చూసే ఆకర్షణలలో ఒకటి. ఈ జలపాతాలు కాఫీ తోటల, సుగంధ ద్రవ్యాల తోటల మధ్యగా దట్టమైన పొందలలో ప్రవహించి కొండలలో చిన్న ధారగా మొదలై పర్యాటకులు చూడదగ్గ ఎత్తు నుంచి ఎంతో ఆకర్షణీయంగా క్రిందకు ప్రవహిస్తాయి. జలపాతాల హోరు పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆ ప్రాంత ప్రశాంతతనే మార్చి వేస్తుంది. బ్రిటీష్ వారు ఈ జలపాతాలకు జెస్సి వాటర్ ఫాల్స్ అని పేరు పెట్టారు. మడికెరికి వారి మొదటి పాలకుడి కుమార్తె గుర్తుగా ఆ పేరుతో పిలిచేవారు. అయితే, తర్వాతి కాలంలో వీటికి అబ్బే లేదా అబ్బి జలపాతాలని పేరు వచ్చింది. కూర్గు భాషలో అబ్బే అంటే జలపాతం అని అర్ధం.
నాగర్హొళె జాతీయ ఉద్యానవనం: ఈ ఉద్యానవనం అనేక జాతి రకాలకు చెందిన వక్షాలను జంతుజాలాన్ని కలిగి ఉంటుంది. ఆ కారణంగా నాగర్హొళె జాతీయ ఉద్యానవనంగా దేశంలోని అత్యుత్తమ వైల్డ్ లైఫ్ రిజర్వులలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ప్రాంతాన్ని సందర్శించిన మనకు అనేక జాతుల వక్షాలతో పాటు 270 జాతుల పక్షులు దర్శనమిస్తాయి.
నామ్‌డ్రోలింగ్ ఆరామం: నామ్‌డ్రోలింగ్ ఆరామం గోల్డెన్ టెంపుల్‌గా ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రసిద్ధి గాంచిన మఠం గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో అలంకరించబడి సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశంగా ఉంది.
ఓంకారేశ్వర ఆలయం: ఈ ఆలయాన్ని 1820లో లింగ రాజేంద్ర నిర్మించారు. ఈ ఆలయం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని శివ భగవానుడికి అంకితం చేస్తూ లింగ రాజేంద్ర నిర్మించారని కథనం. ఈ ఆలయంలో ఒక చిన్న నీటి కొలను ఉంది. ఇందులోని చేపలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
మడికెరి కోట: చరిత్ర ప్రకారం ఈ కోట 17వ శతాబ్దానికి చెందినది. బురద ఉపయోగించి ముద్దు రాజుచే నిర్మించబడింది. 1812-1814ల మధ్య కాలంలో ఇటుక, మోర్టార్లలో దీన్ని తిరిగి నిర్మించారు. ఈ కోట ప్రవేశద్వారం చుట్టుపక్కల ఉన్న ఏనుగులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
సోమవారపేట్: ఇక్కడి ప్రధాన పంటలు కాఫీ, అల్లం, యాలకులు, మిరియాలు తోటలు ఉన్నాయి. ఈ తోటల అందాలు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగిస్తాయి.
పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యం: ప్రకతిని అన్వేషించటం లేదా వన్యప్రాణులను చూడాలని మీరు కోరుకుంటే.. కూర్గ్‌లో ఉన్నపుడు పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యం తప్పక సందర్శించాల్సిందే. ఇది కర్ణాటకలో అత్యంత ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యాలలో ఒకటి.
భగమండదాల: కావేరి, కన్నికే, సుజ్యోతి నదుల ఉప భూభాగం సంగమంలో ఉన్న భగమండల ఒక యాత్రా స్థలం. త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు.
మల్లాల్లి జలపాతం: కూర్గ్ ఉత్తర దిశలో ఉన్న ఈ ప్రాంతంలో అద్భుత జలపాతాలు కనిపిస్తాయి. కాలానుగుణంగా ప్రవాహం తగ్గినపుడు.. సన్నటి ధారగా మారిపోయే ఈ జలపాతం 60 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోతున్నప్పుడు గాలిలో అదశ్యమవుతుంది.
కోపట్టి కొండలు: తక్కువగా ప్రఖ్యాతి చెందిన గమ్యస్థానాలలో ఒకటి కోపట్టి హిల్స్. నిశ్శబ్దం, విస్తారమైన కాఫీ తోటలు, గడ్డిభూములు, దట్టమైన అడవులు, ప్రవాహాలతో కలిసి ఉంటుంది.
చెట్టుపై పక్షిగూడులో హోటల్...
చెట్టెక్కి కూర్చొనే సరదాల నుంచి చెట్లపైనా రెస్టారెంట్ కట్టేంత రేంజ్‌కి వెళ్లిపోయింది మన క్రియేటివిటీ. క్యూబాలోని దట్టమైన అడవుల్లో ఎత్తైన చెట్లపై ట్రీ టాప్ హోటల్ని నిర్మించారు. ఎత్తైన చెట్లపైన పక్షులు కట్టిన గూళ్ల తరహాలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి గదులు, లాంజ్‌లు నిర్మించారు. వేర్వేరు చెట్ల మీద ఉండే గూళ్ల తరహాలోని ఈ గదులను చేరుకునేందుకు వెళ్లే మార్గం కూడా ప్రత్యేకమే. చెట్లపైనే వేలాడే వుడెన్ బ్రిడ్జీలను ఏర్పాటు చేసి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ హోటళ్లను డిజైన్ చేసిన వ్యక్తి.. వెలిజ్ ఆర్కిటెక్టో. చెట్లపై ఉండే ఈ హోటల్స్‌ను, వేలాడే బ్రిడ్జిలను స్థానికంగా స్వర్గధామంగా పిలుస్తారు.