చుట్టుపక్కల పచ్చని పరిసరాలు... పెద్ద రాళ్ల మీద నుంచి పారే జలపాతం... ఎత్తు నుంచి పడటం వల్ల రాతిని తాకకుండా నీరు వాలుగా పడటం వల్ల ఎగిసిపడే నీటి తుంపర్లు... ఈ సుందర నేపథ్యాన్ని చూడాలంటే కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్లలో ఒకటైన జోగ్ జలపాతం వద్దకు వెళ్లాల్సిందే. దీనిని గెర్సోప్ప జలపాతం అని కూడా పిలుస్తారు. దీని ఎత్తు 253 మీటర్లు. అంటే 830 అడుగులు. ఈ జలపాతం అరేబియా సముద్ర సమీపంలో శరావతి నది ముఖద్వారం వద్ద హోనావర్ నుంచి 29 కి.మీ. ల ఎగువన ఉంది.