Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగ్నేసియాలోని నిరుపేద దేశమైన మయన్మార్ మరోసారి సైనిక పాలనలోకి పోవడం ఆందోళన కలిగిస్తోంది. అయిదు కోట్ల జనాభా కలిగిన మయన్మార్‌లో సైనిక కుట్రలు కొత్తేమీ కాదు. 1948లో స్వాతంత్య్రం సాధించిన తరువాత మొదటి పద్నాలుగేండ్లు ప్రజాస్వామ్య పాలన కింద ఉన్న మయన్మార్‌లో 1962లో సైన్యం ఒక్కసారిగా తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం తమ చేతుల్లోంచి జారిపోకుండా యత్నిస్తున్న సైనిక నియంతలకు 1988లో మొదటిసారి ప్రతిఘటన ఎదురైంది. బ్రిటన్ నుంచి మయన్మార్‌కు తిరిగి వచ్చిన ఆంగ్‌సాన్ సూకీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డి)ని స్థాపించి మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించారు. 1990లో జరిగిన ఎన్నికల్లో సూకీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల్లో 58 శాతం ఓట్లతో, పార్లమెంటులో 492 స్థానాలకు గాను 382 స్థానాలు గెలుచుకున్నారు. మిలిటరీ అనుకూల పార్టీకి కేవలం పది సీట్లుమాత్రమే వచ్చాయి. సూకీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని తిరిగి తన గుప్పెట్లో పెట్టుకుంది. సూకీని గహ నిర్బంధంలో ఉంచింది. ఇప్పుడు కూడా సరిగ్గా అదే పరిస్థితి పునరావతమైంది.
గత ఏడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో సూకీ పార్టీకి పార్లమెంటులో 440 స్థానాలకు గాను 315 స్థానాలు లభించాయి. 224 స్థానాలు ఉన్న ఎగువ సభలో 161 స్థానాలు గెలుచుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది. సూకీ బలపడడం తమ ప్రయోజనాలకు ముప్పుగా భావించింది. ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందు మిలిటరీ తిరుగుబాటు చేసి నిర్బంధించింది. సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవడంపై ఐక్యరాజ్యసమితితో సహా పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. నిర్బంధంలో ఉన్న ఆంగ్‌సాన్ సూకీని, ఇతర అగ్ర నేతలను విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని యాంగాన్ వీధుల్లోకి వచ్చి డిమాండ్ చేస్తున్న నిరసనకారుల పైకి సైన్యం యుద్ధ ట్యాంకులను ఎక్కుపెట్టింది. మీడియా, సామాజిక ప్రచార మాధ్యమాలపై ఆంక్షలు విధించింది. మానవ హక్కులను బాహాటంగా కాలరాస్తున్నది. సైనికలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగాచ మృతి చెందారు.
మయన్మార్‌లో దశాబ్దాల సైనిక పాలనకు తెరదించిన నేత మళ్లీ సైనిక దిగ్బంధంలో...
మయన్మార్‌ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన కఠినమైన సైనికాధికారులను సవాలు చేసేందుకు తన వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని కూడా వదులుకున్నారు ఆంగ్ సాన్ సూకీ...
ఆమెను ఒక నియమబద్ధమైన ఉద్యమకారిణిగా, మానవ హక్కుల మార్గదర్శిగా అందరూ చూసేవారు. సూకీ 1989 - 2010 వరకు నిర్బంధంలోనే గడిపారు. సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆమె చేసిన వ్యక్తిగత పోరాటం ఆమెకు, అణచివేత ముంగిట శాంతియుతంగా పోరాడుతున్న అంతర్జాతీయ వ్యక్తిగా గుర్తింపు తెచ్చి పెట్టింది. 2015లో ఎన్ఎల్డి భారీ విజయం సాధించినప్పటికీ ఆమె అధ్యక్షురాలు కాలేకపోవడానికి విదేశీ నిబంధన అడ్డం వచ్చింది. దీంతో ఆమె కోసం స్టేట్ కౌన్సిలర్ అన్న పదవిని సష్టించారు. అంతే తప్ప సైన్యం తన అధికారాలను వదులుకోవడానికి సిద్ధం కాలేదు. దీంతో సైన్యానికీ, సూకీకి మధ్య వైరుధ్యం అలాగే కొనసాగుతోంది. ప్రజాస్వామ్య పునాదులపై నవ మయన్మార్ నిర్మించాలన్న లక్ష్యం నెరవేరలేదు. జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పుతామని హామీ ఇచ్చిన సూకీ 2017లో రఖేన్ రాష్ట్రంలో రోహింగ్యాలపై సైన్యం సాగించిన ఊచకోతను బహిరంగంగా సమర్థించారు. ఇది అంతర్జాతీయంగా ఆమె ప్రతిష్టను మసకబారేలా చేసింది. సైన్యానికి దాసోహమయ్యారన్న అపఖ్యాతిని ఆమె మూటగట్టుకున్నారు. ఇటువంటి ఒకటి రెండు తప్పిదాలు ఉన్నప్పటికీ సూకీ మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం సాగిస్తున్న పోరాటం మహత్తరమైనది. ఆమెకు సంఘీభావంగా అంతర్జాతీయ సమాజం నిలవాల్సిన అసవరముంది.
రాజకీయ వారసత్వం
సూకీ మయన్మార్ స్వతంత్రం కోసం పోరాడిన జనరల్ ఆంగ్ సాన్ కూతురు. ఆమెకు రెండేళ్ల వయసు ఉండగానే ఆయన హత్యకు గురయ్యారు. మయన్మార్ బ్రిటిష్ పాలన నుంచి 1948లో స్వతంత్రం పొందింది. 1960లో ఆమె తల్లి డా ఖిన్ కీతో కలిసి భారతదేశం వచ్చారు. అప్పుడామె తల్లి మయన్మార్ దౌత్యవేత్తగా ఢిల్లీకి వచ్చారు.