Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా పక్షులకు, మొక్కలకు అవినాభావ సంబంధం ఉంటుంది. చెట్టు పక్షులకు నీడనిస్తే.. పక్షులు చెట్లు పెరగడానికి తోడ్పడతాయి... అంటే... పక్షులు చెట్లపై వాలినపుడు ఆ చెట్టు కాయలను తినడం లేదా నోటితో పట్టుకుపోతూ జారవిడవడం ద్వారా ఆ చెట్ల సంతతి అభివృద్ధి చెందుతుంటుంది. అయితే పక్షులను చంపే చెట్లు కూడా ఉన్నాయి. పక్షులను చెట్లు చంపడమేంటి అని ఆశ్చర్య పడనవసరం లేదు.. అంతటి విషం కలిగిన చెట్లు ఉంటాయా అని సందేహం అక్కర్లేదు. చెట్లు కావాలనేమీ చంపవు.. కానీ అలా జరుగుతోంది.. ఇంతకు విషయం ఏంటంటే... పిసోనియా అనే చెట్లు అన్ని చెట్ల మాదిరిగానే ఉంటాయి.. అన్ని చెట్ల మీద వాలినట్లే పక్షులు ఈ చెట్ల మీద కూడా వాలుతుంటాయి. కానీ ఆ తర్వాత ప్రాణాలతో ఉంటాయనే నమ్మకం చెప్పలేము. అందుకు ఒకే ఒక్క కారణం ఉంది. అది ఈ చెట్టు విత్తనాలు.. అవును!! ఈ జాతి చెట్ల విత్తనాలు జిగురుతో ఉంటాయి. పక్షులు చెట్టు మీద వాలినపుడు విత్తనాలు పక్షుల రెక్కల మీద పడుతుంటాయి. ఈ విత్తనాల జిగురు వల్ల పక్షుల రెక్కలు అంటుకుపోతాయి. ఎగరలేవు. పక్షుల ఒకచోట నుండి మరో చోటుకు ఎగర గలిగితేనే వాటికి ఆహారం నీరు లభించేది. అలా ఎగరలేనివి ఆకలి దప్పికలతో చనిపోతుంటాయి. అందువల్ల పక్షుల చావుకు ఈ చెట్లు కారకాలవుతున్నాయి. ఈ చెట్లు ఎక్కువగా కరేబియన్‌లోని ఐస్లాండ్లలో, ఇండో పసిఫిక్ ప్రాంతాలలో ఉన్నాయి.