Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీటి పక్షులు ఎప్పుడూ నిరుత్సాహ పరచవు. ఈ రోజు కొన్ని పక్షుల్ని తీశాను. ఈ రోజు తీసిన పక్షుల్లో Purple Moorhen ఫోటోలు ఇవి. ఇవి పేరుకు తగ్గట్టు మన కోడి సైజ్లో ఉంటాయి. Common Moorhen కూడా ఉంటుంది, కానీ ఇదే అందంగా ఉంటుంది. పక్షి ఈకలు ముఖ్యంగా పర్పుల్ రంగులో కాస్త బూడిద రంగు, కాస్త నీలం కలగలిసిన వింత shining తో ఉంటాయి. ముక్కు మీద ఎర్రటి బుడిపే దీనికి ప్రధాన ఆకర్షణ. తోక కింద తెల్ల గా ఉంటుంది. కాళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి. ఇది నీటి పరిసరాల్లో ఉండే నాచు, గుర్రపు డెక్క ఆకు, గడ్డి లాంటి పచ్చని ఆకులలోనే ఉంటుంది. కొద్ది దూరం మాత్రమే ఎగర గలుగుతుంది. ఇది దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనపడుతుంది. సరే, వీటి ఫోటోలు కొన్ని మీకోసం...
- ఎస్.ఎస్.బి.గేరా
9492922492