Authorization
Fri April 04, 2025 06:08:18 am
పల్లవి : తెస్తాడు నా మొగుడు ఈ రోజు,
తీసుకొస్తాడు నెకిలేసు ఈ రోజు
చెన్నై షాపింగు మాలులోన,
లేకుంటే తనిష్కా గోల్డులోన
చెన్నై షాపింగు మాలులోన,
లేకుంటే తనిష్కా గోల్డులోన
కొని తెస్తాడు నా మొగుడు ఈ రోజు.
చరణం : కోటి ఆశల వలయాలలో నా మనసంతా తిరిగొచ్చేను
కోటి ఆశల వలయాలలో నా మనసంతా తిరిగొచ్చేను
అతని బైకు హారను సౌండు నిద్రలో కూడా వినిపించేను
అతని జీవన ప్రాణసఖికై
తలతాకట్టైనా పెట్టుకుంటాడు
అతని రాకకై అంతరంగమే
ఎంతో ఇదిగా ఎదురుచూసేను
ఎంతో ఇదిగా ఎదురుచూసేను
తెస్తాడు నా మొగుడు ఈ రోజు,
తీసుకొస్తాడు నెకిలేసు ఈ రోజు
చరణం : పిండిని ఏంతగా రుబ్బినగాని రోలును దాటీ పోలేదు
బట్టలనెంతగా బాదినగాని మురికిని విడిపోలేవు
భార్యాభర్తల చదరంగంలో భార్యలే ఎపుడూ గెలిచేనులే
టార్గెట్ ఏదైనా, టార్చర్ నాదైనా
టార్గెట్ ఏదైనా, టార్చర్ నాదైనా
నా మాటొకటే నెగ్గెనులే
అల్లూరి సీతారామరాజు చిత్రంలోని
''వస్తాడు నారాజు'' పాటకు పేరడి.
రచన సి. నారాయణరెడ్డి
- డా. బి.బాలకష్ణ
సెల్: 9948997983