Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం ఈ నెల 6న ప్రారంభమై శుక్రవారం ముగిసింది. ఆ వివరాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు. రెపో రేటును ఎప్పటిలాగే 4శాతం వద్దే కొనసాగించాలని ఆరుగురి సభ్యుల్లో ఐదుగురు బలపరిచారు. రివర్స్ రోపో రేటు 3.35 శాతంగానే ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. భారత జీడీపీ 9.5 శాతం పెరుగొచ్చని అంచనా వేసింది.
8.3 శాతమే వృద్థి : ప్రపంచ బ్యాంక్
దేశ జీడీపీ 9.5శాతం పెరుగొచ్చని ఆర్‌బీఐ అంచనా వేయగా.. మరోవైపు ప్రపంచబ్యాంక్ వృద్థి 8.3శాతం మాత్రమే ఉండొచ్చని విశ్లేషించింది. 2021-22లో ప్రభుత్వ పెట్టుబడుల పెంపు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు ఆర్థిక వ్యవస్థకు కొంత మద్దతును ఇవ్వొచ్చని పేర్కొంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి ముందు ప్రస్తావించిన వృద్ధి రేటు అంచనా కంటే ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో జీడీపీ అంచనాను తగ్గించింది. కరోనా సెకండ్ వేవ్‌తో ఆర్ధిక వ్యవస్ధలో రికవరీ మందగించిందని విశ్లేషించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి వద్ధి రేటు అంచనాను 8.3 శాతానికి కుదించామని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా రీజియన్) హాన్స్ టిమ్మర్ వెల్లడించారు.