Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: ఐక్యతను వేడుకగా నిర్వహించుకునేందుకు కారణాలను వివరిస్తూ, ఈ పండుగ సీజన్‌లో సన్‌హైజర్ ఆడియో తన అంబియో (AMBEO)సౌండ్‌బార్‌తో అద్భుతంగా లీనమయ్యే 3డి ధ్వనిలో మమేకమయ్యేలా అభిమానులను ప్రోత్సహిస్తోంది. అంబియో (AMBEO) సౌండ్‌బార్ శక్తివంతమైన పంచ్‌ను అందిస్తుండగా, లీనమయ్యే స్టూడియో గ్రేడ్-5.1.4 సౌండ్, డీప్ బాస్ పనితీరును అందిస్తుండడంతో ఇది స్టీరియో, టీవీ సౌండ్‌కు జీవాన్ని అందిస్తోంది. పూర్తిసినిమాటిక్ వీక్షణ అనుభవంతో అంబియో (AMBEO)సౌండ్‌బార్ వర్చ్యువలైజేషన్ శక్తిని ఇచ్చే హైపర్ రియలిస్టిక్ త్రీ-డైమెన్షనల్ సౌండ్ అందించడం ద్వారా థియేటర్ అనుభవాన్ని అందిస్తుంది.
అంబియో (AMBEO)సౌండ్‌బార్ డాల్బీ అట్మోస్‌కి అనుకూలంగా ఉంటూ, అప్‌మిక్స్ టెక్నాలజీని కలిగి ఉండడంతో, ఇది స్టీరియో లేదా 5.1 ఆడియోని 3డిధ్వని అనుభవంగా మారుస్తుంది మరియు ఒకే ఆల్-ఇన్-వన్ పరికరం నుంచి ప్లే బ్యాక్, రియాలిటీ మధ్య హద్దును తొలగిస్తుంది. పరిపూర్ణతతో రూపొందించి, బ్రష్ చేసిన అల్యూమినియం డిజైన్, కొద్దిపాటి డిటెయిల్స్ ఒక అందమైన బార్‌లో డిజైన్ మరియు పనితీరును కోరుకునే వారికి ఇది అత్యుత్తమ ఎంపికగా ఉంటుంది. ఇది కాలిబ్రేషన్ మైక్రోఫోన్‌తో గదిలోని ధ్వనిని మరింతగా ట్యూన్ చేస్తుంది. సాధ్యమైనంత మేర ఉత్తమమైన ధ్వనిని నాణ్యతతో డీప్ బాస్‌ని పునరుత్పత్తి చేసేందుకు వెంటనే స్వీకరిస్తుంది. ఇది ఇంట్లో పూర్తిగా చిరస్మరణీయమైన 3డి అనుభవాన్ని ఆస్వాదించేందుకు ఆడియోఫిల్‌లను ఆన్-స్క్రీన్ చర్యలో పూర్తిగా లీనం చేసేందుకు అవకాశం ఇస్తుంది. దాని లక్క, బ్రష్డ్ అల్యూమినియం ఉపరితలం దిగువ, అంబియో (AMBEO) సౌండ్‌బార్ 13 డ్రైవర్లు మరియు తాజా వర్చువలైజేషన్ సాంకేతికతను ఫ్రన్‌హాఫర్ ఐఎఫ్‌ఎస్‌తో సంయుక్తంగా అభివృద్ధి చేశారు.
సెన్‌హైసర్ తన సౌండ్‌బార్‌నుతన సెన్‌హైసర్ అంబియో (AMBEO) ట్రేడ్‌మార్క్ కింద అభివృద్ధి చేసింది. అంబియో (AMBEO)3డిఆడియో టెక్నాలజీ ప్రోగ్రామ్ వినియోగదారులు తమ కంటెంట్‌ను ఆస్వాదించే విధానాన్ని మార్చేందుకు ఆడియో క్యాప్చర్, ధ్వని పునరుత్పత్తిలో అంతిమంగా, లీనమయ్యే ఆడియో పరిష్కారాలను రూపొందించేందుకు అంకితం చేశారు. శ్రోతలను కొత్త దృక్పథాలు, ధ్వని వాస్తవాన్ని ఆస్వాదించేందుకు, రూపొందించుకునేందుకు అంబియో (AMBEO)సౌండ్‌బార్ ప్రతి క్షణాన్ని అతీంద్రియ ఆడియోగా మారుస్తుంది. హోమ్ థియేటర్ నిర్మాణంలో పెట్టుబడులు పెట్టవలసిన అవసరాన్ని గుర్తించి, ఆడియోఫైల్స్ కోసం ఎండ్-టు-ఎండ్ 3డి ఆడియో టెక్నాలజీలు, పరిష్కరణలను ఆస్వాదించేందుకు సెన్‌హైసర్ ఒక ప్రత్యేక కేటగిరీని నిర్మిస్తోంది. నూతన ఉత్పత్తి గురించి సెన్‌హైసర్ వినియోగదారుల విభాగం డైరెక్టర్ కపిల్ గులాటి మాట్లాడుతూ, ‘‘ఇప్పటి మహమ్మారి వినియోగదారుల పోకడలను పూర్తిగా మార్చివేసింది. వినియోగదారులు తమ నివాసాల్లో వినోదం కోసం స్మార్ట్ ఆడియో పరిష్కరణల్లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఈ మార్పుతో ప్రజలు హోమ్ థియేటర్‌ను లగ్జరీ కన్నా, అవసరమని భావించడానికి దారితీసింది. ఇప్పుడు, కొనసాగుతున్న ఉత్సవాలు, ఓటీటీ ప్లాట్‌ఫారాల్లో కొత్త సినిమాలు విడుదల కావడం, కొన్ని భారీ క్రీడా కార్యక్రమాలు జరుగుతుండటంతో, ప్రజలు ఇంట్లోనే ఒక మరపురాని 3డి, ‘తాము అక్కడే ఉండి వీక్షిస్తున్న’ అనుభూతిని అందించే సౌండ్‌బార్‌లో పెట్టుబడి పెట్టవలసిన అవసరాన్ని గుర్తించారు. అంబియో (AMBEO)సౌండ్‌బార్ ప్రతి గదికి కచ్చితంగా సరిపోతుంది, ఎందుకంటే ఇది ఆలకించే వారిని వినోద అనుభవం మధ్యలో ఉంచేందుకు ధ్వనిని ఆప్టిమైజ్ చేస్తుంది. మేము ముత్యాల నగరికి మా సమర్పణలను ఆస్వాదించేలా చేయడం, మా ప్రీమియం ఛానెల్ భాగస్వాములకు మా ఆఫరింగ్‌లను అందించడంపై దృష్టి సారించాము’’ అని వివరించారు. మరింత వాస్తవికమైన హెచ్చు తగ్గులు, పరిమాణం, సూక్ష్మమైన డిటెయిల్స్ అందించేలా రూపొందించబడిన, సెన్‌హైజర్ అంబియో (AMBEO) సౌండ్‌బార్ మా ఎంపిక ప్రీమియం ఛానెల్ భాగస్వామి మహావీర్ సౌండ్ రూమ్, మాదాపూర్, హైదరాబాద్ వద్ద రూ.199,990 ధరలో విక్రయానికి అందుబాటులో ఉంది.