Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టెలి కమ్యూనికేషన్స్ శాఖ, తెలంగాణ ఎల్‌ఎస్‌ఎ ఆధ్వర్యంలో ఇఎంఎఫ్ రేడియేషన్‌పై వెబినార్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 18,2021

టెలి కమ్యూనికేషన్స్ శాఖ, తెలంగాణ ఎల్‌ఎస్‌ఎ ఆధ్వర్యంలో ఇఎంఎఫ్ రేడియేషన్‌పై వెబినార్‌

నవతెలంగాణ హైదరాబాద్: టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT)తో కలిసి తెలంగాణ లైసెన్స్ సర్వీస్ ఏరియా (LSA) అక్టోబర్ 13, 2021న “ఇఎంఎఫ్ రేడియేషన్‌పై అవగాహన వెబినార్” నిర్వహించింది. సెప్టెంబరు  నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 81,882 బేస్ ట్రాన్స్‌సీవర్ యూనిట్లు/మొబైల్ టవర్లు (BTS), తెలంగాణాలో 87,960 బేస్ ట్రాన్స్‌సీవర్ యూనిట్లు/మొబైల్ టవర్లు (BTS) ఉన్నాయి. ఏపీ ఎల్‌ఎస్‌ఎ హైదరాబాద్, విజయవాడ యూనిట్లలో సెప్టెంబరు 2021 నాటికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSP) నిబంధనలకు లోబడి పని చేస్తున్న అంశాన్ని గుర్తించేందుకుమొత్తం 85,626 బేస్ ట్రాన్స్‌సీవర్ యూనిట్లు/మొబైల్ టవర్ల వద్ద ఇఎంఎఫ్ పరీక్షలు నిర్వహించింది.
      భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆజాది కా అమృత్ మహోత్సవ్‌గా నిర్వహించుకుంటోంది. ఈ స్మారక సందర్భాన్ని గుర్తు చేసుకునేందుకు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అలాగే సేవల నాణ్యతకు సంబంధించిన అత్యుత్తమమైన టెలికామ్ నెట్‌వర్క్‌ను నిర్ధారించడం ద్వారా సరికొత్త ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించేందుకు, టెలికమ్యూనికేషన్స్ శాఖ తన పబ్లిక్ అడ్వకేసీ కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సును నిర్వహించింది. మొబైల్ టవర్ల ఆవశ్యకత గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయపడేందుకు, విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలను సమర్పించడం ద్వారా పౌరుల అకారణ భయాలను పరిష్కరించేందుకు,మొబైల్ టవర్ల నుంచి హానికరమైన రేడియేషన్ చుట్టూ ఉన్న సిద్ధాంతాలను నిరూపించే దిశలో ఈ సదస్సు కొనసాగింది. మొబైల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌కు సంబంధించిన ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించిన అపోహలు, తప్పుడు సమాచారాన్ని తిరస్కరిస్తూ, పౌరుల్లో  కలిగే ఆందోళనలను పరిష్కరించే దిశలో వైద్యులతో సహా టెలికాం విభాగానికి చెందిన సీనియర్ అధికారులతో కూడిన నిపుణుల బృందం అనేక అంశాలను చర్చించారు.
        వెబినార్‌లో తెలంగాణ అదనపు కలెక్టర్‌లు, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ అధికారులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, సాధారణ ప్రజలు, కళాశాల అధ్యాపకులు &విద్యార్థులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, మౌలిక సదుపాయాల ప్రదాతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఐటిఎస్-డిజిసి-కాంప్లియెన్స్ తెలంగాణ, ఎపి ఎల్‌ఎస్‌ఎ, టెలికమ్యూనికేష్స్ శాఖ అధికారి జి.వి.రమణారావు అతిథులకు స్వాగతం పలికారు. నిజాముల్ హక్-ఐటిఎస్, టెలికమ్యూనికేషన్ శాఖసలహాదారు, ఏపీ ఎల్‌ఎస్‌ఎ, హైదరాబాద్, అశోక్ కుమార్- ఐటిఎస్, సీనియర్ డిడిజి, టెలికమ్యూనికేషన్స్ శాఖ, ఎపిఎల్‌ఎస్‌ఎ, రాబర్ట్ రవి-ఐటిఎస్, డిడిజి-కాంప్లియెన్స్, విజయవాడ, ఎపి ఎల్‌ఎస్‌ఎ, టెలికమ్యూనికేషన్స్ శాఖ, హైదరాబాద్, డా.వివేక్ టాండన్, న్యూరోసర్జన్, న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రొఫెసర్ డా.కిరణ్ కుమార్ కుచి డీన్-ఆర్ &డి- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ –ఐఐటి హైదరాబాద్, తెలంగాణ సదస్సులో పాల్గొన్నారు. వెబినార్‌లో నిజాముల్ హక్-ఐటిఎస్, టెలికమ్యూనికేషన్ శాఖ సలహాదారు, ఏపీ ఎల్‌ఎస్‌ఎ, హైదరాబాద్ మాట్లాడుతూ, ‘‘టెలికమ్యూనికేషన్ అనేది పౌరుల సాధికారతకు కీలక పరికరం, ఒక దేశానికి సంబంధించిన సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఒక ప్రభావవంతమైన సాధనం. ఇది వేగవంతమైన అభివృద్ధి, అనేక ఆర్థిక రంగాలు, ఆధునికీకరణకు కీలకమైన మౌలిక సదుపాయంగా అభివృద్ధి చెందింది. వినియోగదారులకు సాధ్యమైనంతమేర గొప్ప టెలికమ్యూనికేషన్ సేవలను అందించేందుకు టవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా మొబైల్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం అనివార్యమైన అంశం’’ అని స్పష్టం చేశారు. దీని గురించి నిజాముల్ హక్-ఐటిఎస్, టెలికమ్యూనికేషన్ శాఖ సలహాదారు, ఏపీ ఎల్‌ఎస్‌ఎ, హైదరాబాద్మరింతవివరిస్తూ,‘‘ఇఎంఎఫ్ రేడియేషన్లు, ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి నిర్వహిస్తున్న వెబినార్ అపోహలను తొలగిస్తుంది, మొబైల్ టవర్లు, టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉన్న అడ్డకుంలు ఏవైనా ఉంటే వాటిని తొలగించి, సేవలను, అందరికీ చక్కని నెట్‌వర్క్ కవరేజ్ అందిస్తుంది’’ అని వివరించారు.
    టెలికమ్యూనికేషన్ సేవల రూపురేఖలు, వాటాదారులు ఎదుర్కొంటున్న కీలక సమస్యల గురించి ప్రస్థావిస్తూ అశోక్ కుమార్-ఐటిఎస్, సీనియరు డిడిజి, టెలికమ్యూనికేషన్ శాఖ, ఎపిఎల్‌ఎస్‌ఎ మాట్లాడుతూ, “మృదువైన కనెక్టివిటీకీ మొబైల్ టవర్లు అవసరం. సెల్యులార్ టవర్‌ల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గురించి కచ్చితమైన వాస్తవాలను పంచుకునేందుకు మనం నేడు ఇక్కడ కలుసుకున్నాము. వాస్తవం ఏమిటంటే ఇఎంఎఫ్ రేడియేషన్ మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. ఇఎంఎఫ్ సిగ్నల్స్‌పై మేము నిర్వహించిన సమగ్ర పరిశోధన ఆధారంగా, సెల్ టవర్ రేడియేషన్ ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగించదని మేము గుర్తించాము’’ అని తెలిపారు.
      మన జీవితంలో మొబైల్ ఫోన్‌ల ఆవసరం మరియు దేశ అభివృద్ధి గురించి ఇఎంఎఫ్ రేడియేషన్‌పై తన ప్రజెంటేషన్ ఇచ్చిన రాబర్ట్ రవి ఐటిఎఫ్, డిడిజి, కాంప్లియెన్స్, విజయవాడ, ఎపిఎల్‌ఎస్‌ఎ, టెలికమ్యూనికేషన్స్ శాఖ హైదరాబాద్ విస్తృతంగా చర్చించారు. మొబైల్ టవర్ల నుంచి తక్కువ-స్థాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉద్గారాల గురించి చక్కని వివరణ ఇచ్చారు. తన ప్రజెంటేషన్‌లో భాగంగా మాట్లాడుతూ ‘‘ఇఎంఎఫ్ రేడియేషన్ అనేది మొబైల్ టవర్ యాంటెన్నాలు, మొబైల్ హ్యాండ్‌సెట్ల ద్వారా విడుదల చేయబడిన అయోనైజింగ్ లేని, తక్కువ శక్తి గల ఆర్‌ఎఫ్/విద్యుదయస్కాంత శక్తి. ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ సమాచారం, అధ్యయనాలు, ప్రచురణల ప్రకారం, మొబైల్ టవర్ల నుంచి వెలువడే ఇఎంఎఫ్ రేడియేషన్‌తో ముప్పు అని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మొబైల్ టవర్‌ల (BTS) నుంచి వచ్చే రేడియేషన్‌ను టెలికమ్యూనికేషన్ శాఖనిర్దేశించిన సురక్షిత పరిమితుల కన్నా తక్కువగా ఉండేలా చూసుకుంటారు. సంబంధిత టెలికమ్యూనికేషన్ శాఖకు స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తుంది. ఇంకా, మొబైల్ టవర్ల నుంచి ఇఎంఎఫ్ ఉద్గారాలు అంతర్జాతీయ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ (ICNIRP), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన సురక్షిత పరిమితుల కన్నా తక్కువగా ఉన్నాయి. అవి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు కారణమవుతాయని నమ్మదగిన శాస్త్రీయ ఆధారాలు లేవు’’ అని వివరించారు.
       ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో న్యూరోసర్జరీ డిపార్ట్‌మెంట్, న్యూరో సర్జన్ డా.వివేక్ టాండన్ మాట్లాడుతూ, ‘‘ఈ రేడియేషన్‌లు మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను చూపించవని శాస్త్రీయ పరిశోధన నిరూపించింది. ఈ రోజుల్లో మొబైల్ టవర్ ఇఎంఎఫ్ రేడియేషన్‌ను పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని పౌరులు అర్థం చేసుకోవాలి. విశ్వసనీయ మూలాల నుంచి రుజువులు కూడా ఇఎంఎఫ్ రేడియేషన్‌ల వల్ల ఆరోగ్య ప్రమాదాల వస్తాయన్న అంశాలను ఈ ఆధారాలు తోసిపుచ్చాయి’’ అని స్పష్టం చేశారు.
    రేడియేషన్‌పై సమగ్ర వివరాలను అందిస్తూ, ప్రొఫెసర్ డా.కిరణ్ కుమార్ కుచి  డీన్- ఆర్ & డి- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ –ఐఐటి హైదరాబాద్, తెలంగాణ మాట్లాడుతూ, “మొబైల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ అంశంపై భారతదేశంలోని వివిధ హైకోర్టుల తీర్పులు నిరూపించడానికి కచ్చితమైన డేటా లేదని పేర్కొన్నాయి. మొబైల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ఏ విధంగానైనా పౌరుల ఆరోగ్యానికి హానికరం లేదా ప్రమాదకరం కాదు’’ అని వివరించారు. మొబైల్ టవర్ ఇఎంఎఫ్ రేడియేషన్ కచ్చితంగా పర్యవేక్షించబడుతోందని, విశ్వసనీయ మూలాల నుంచి రుజువులు ఇఎంఎఫ్ రేడియేషన్ల నుంచి సంభవించే ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చాయని పౌరులు ఈరోజు అర్థం చేసుకోవడం చాలా అవసరం. భారతదేశంలోని ఎనిమిది హైకోర్టులు కూడా ఈ అభిప్రాయాన్ని సమర్థించాయి. అటువంటి అవాస్తవమైన అపోహలు, భయాలన్నింటినీ తొలగించేందుకు ప్రయత్నించే తీర్పులను అందించాయి. ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీ వృద్ధిలో ఇటువంటి తప్పుదారి పట్టించే కార్యాచరణ సవాళ్లను ఎదుర్కొంటోంది.
        అందువల్ల, ఇఎంఎఫ్ ఉద్గారాలతో ఆరోగ్య ప్రమాదాల గురించి తెలంగాణాలోని ఒక వర్గం ప్రజలలో ఉన్న అపోహను పరిగణనలోకి తీసుకోకూడదు. టవర్ల ఏర్పాటుకు అనుమతించాలి. అవసరం ఉన్న చోట్ల వాటి ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఐసిఎన్‌ఐఆర్‌పి (ICNIRP)సూచించిన,  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)సిఫార్సు చేసిన దాని కన్నా 10 రెట్లు కఠినమైన నిబంధనలను భారత ప్రభుత్వం అనుసరిస్తుంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లందరూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉన్నారో లేదో నిర్ధారించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయి. ఇఎంఎఫ్ ఎక్స్‌పోజర్ ప్రమాదం నుంచి ప్రియమైన పౌరులను రక్షించేందుకు రూపొందించబడిన మార్గదర్శకాల సమ్మతిని సులభతరం చేయడానికి టెలికమ్యూనికేషన్స్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉంది. మొబైల్ టవర్ల నుంచి వారి ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని ప్రజలకు తెలియజేయాలి, హామీ ఇవ్వాలి. ప్రశ్నోత్తరాల సెషన్‌లో, ప్యానలిస్టులు మొబైల్ కనెక్టివిటీ అనేది సమాజంలోని ప్రతి విభాగానికి అవసరమైన సమయం అని హైలైట్ చేసారు. అలాగే ‘డిజిటల్ ఇండియా’ కోసం ప్రభుత్వ దృష్టిలో ఇది ఒక అంతర్భాగం. ప్యానెల్ చర్చల్లో ఎపిఎల్‌ఎస్‌ఎ, హైదరాబాద్ డైరెక్టర్ (కంప్లైయన్స్) తరుపున ఎం.అరవింద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.