Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అందుబాటు ధరల గృహాల కోసం ఆఖరి దశలో పెట్టుబడులు పెట్టే సంస్థ స్పెషల్ విండో ఫర్ కంప్లీషన్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ అఫర్డబల్ అండ్ మిడ్ ఇన్‌కమ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ (స్వామిహ్) కొత్తగా జనప్రియ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టింది. హైదరాబాద్, సైనిక్‌పురిలో జనప్రియ నిర్మిస్తున్న సితార లేక్‌ఫ్రంట్‌లకు చెందిన భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో స్వామిహ్ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ రూ.136 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది.
ఈ ప్రాజెక్టును 8.212 ఎకరాల విస్తీర్ణంలో అభివద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మొత్తంగా రూ.149.62 కోట్ల నిధులు అవసరం అవుతాయని జనప్రియ ఇంజినీర్స్ సిండికేట్ ఛైర్మన్ కె రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. దీని నిర్మాణాన్ని 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో 2245 ఫ్లాట్లను అందుబాటు ధరల్లో అభివృద్థి చేస్తున్నామన్నారు.