Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జెన్‌ జెడ్‌ను వ్యక్తిత్వం కోసం తపించేలా చేసిన మహమ్మారి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 21,2021

జెన్‌ జెడ్‌ను వ్యక్తిత్వం కోసం తపించేలా చేసిన మహమ్మారి

- నూతన వెస్ట్రన్‌ యూనియన్‌ అధ్యయనంలో వెల్లడి
- కెరీర్‌ కన్నా కూడా సంస్కృతికి ప్రాధాన్యతనిస్తున్న విద్యార్థులు
ముంబై: క్రాస్‌బోర్డర్‌, క్రాస్‌ కరెన్సీ నగదు ప్రవాహం, చెల్లింపుల పరంగా అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న వెస్ట్రన్‌ యూనియన్‌, నేడు నూతన బహుళ తరపు అధ్యయనంను ‘విదేశాలలో విద్య– అభివృద్ధి చెందుతున్న ప్రయాణం’(ఎడ్యుకేషన్‌ ఓవర్‌సీస్‌– యాన్‌ ఇవాల్వింగ్‌ జర్నీ) శీర్షికన విడుదల చేసింది. దీనిద్వారా భారతీయ కుటుంబాలు తమ పిల్లల అంతర్జాతీయ విద్య, వారి భవిష్యత్‌ దిశగా ప్రయత్నిస్తున్నప్పుడు వారి సామూహిక ప్రయాణాన్ని అర్ధం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ అధ్యయనాన్ని చేయాల్సిందిగా నీల్సన్‌ ఐక్యుకు వెస్ట్రన్‌ యూనియన్‌ కోరింది. అత్యంత వేగంగా మారుతున్న వాతావరణం, మారుతున్న ప్రాధాన్యతలు, కీలక అవరోధాలు, విదేశాలలో విద్యనభ్యసించాలని కోరుకుంటున్న  విద్యార్థుల నిర్ణయాధికారంపై ప్రభావం చూపే మారుతున్న ధోరణులు గురించి సమగ్ర అవగాహనను అందిస్తుంది. ఈ అధ్యయనంలో తమ పిల్లలను విదేశాలకు పంపించాలని కోరుకుంటున్న కుటుంబాలలో వైరుధ్యాలు, విభేదాలు, సాంస్కృతిక ఆందోళనలను సైతం వెల్లడించింది.
         ఈ అధ్యయనంలో, విదేశాలలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆలోచనలలో వచ్చిన గణనీయమైన మార్పులను వెల్లడించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వద్ద లభ్యమైన సమాచారం ప్రకారం, 2021 సంవత్సరం తొలి రెండు నెలల్లో 70వేల కుటుంబాలకు చెందిన విద్యార్థులు విదేశాలలో  విద్యనభ్యసించడం కోసం వెళ్లారు. మహమ్మారి సైతం వారి  ఆసక్తికి ఆటంకం కలిగించలేదు. అధిక శాతం మంది విద్యార్థులు విదేశాలలో విద్యనభ్యసించేందుకు వెళ్లడానికి తమ  వ్యక్తిగత అభివృద్ధి అత్యంత కీలకమైన తోడ్పాటునందించిందని  వెల్లడిస్తున్నారు. విదేశాలలో ఉండటం వల్ల స్వతంత్య్రంగా తాము ఉండగలమని, తగిన స్వేచ్ఛనూ తాము అనుభవించగలమని వారు నమ్ముతున్నారు.  దీనిని అనుసరిస్తూ, సాంస్కృతిక అన్వేషణ, అంతర్జాతీయ ఎక్స్‌పోజర్‌ వంటివి వారి నిర్ణయాధికార ప్రక్రియలో తోడ్పడుతున్నాయి. మరోవైపు, మెరుగైన ఉద్యోగావకాశాలు లభించడం, అంతర్జాతీయ విద్య తరువాత నాణ్యమైన జీవితం వంటివి ఇటీవలి కాలం వరకూ కూడా అతి ప్రధాన కారణాలలో కనిపించేవి కానీ ఇప్పుడు ఇవి ప్రాధాన్యతల జాబితాలో అట్టడుగు స్ధానానికి చేరుకున్నాయి.
‘‘మేము ప్రతి భారతీయ యువ విద్యార్థి ప్రయాణంలోనూ భాగం కావాలనుకుంటున్నాము.  మరీ ముఖ్యంగా వారు హద్దులు లేని ప్రపంచంలో అభ్యాస అవకాశాలను అన్వేషించాలనుకున్నప్పుడు  చేయూతనందించాలనుకుంటున్నాం’’అని సోహిని  రజోలా, హెడ్‌ ఆఫ్‌మిడిల్‌ ఈస్ట్‌ అండ్‌ ఆసియా ఫసిఫిక్‌, వెస్ట్రన్‌ యూనియన్‌ అన్నారు. ‘‘ఓ నమ్మకమైన బ్రాండ్‌గా, అత్యుత్తమ ప్రపంచం కోసం మా దేశీయ, విదేశీ క్రాస్‌ బోర్డర్‌ నగదు బదిలీ సామర్ధ్యంలు నగదు ప్రవాహానికి తోడ్పాటునందిస్తుంది. మేము ఈ పరిశోధనను  తమ కుటుంబంతో పాటుగా తమ ప్రయాణాన్ని అన్వేషిస్తున్నప్పుడు విద్యార్థుల లక్ష్యాలను, కోరికలను అత్యుత్తమంగా అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది’’ అని అన్నారు. ఈ అధ్యయనంలో కనుగొనబడిన కొన్ని ఆసక్తికరమైన ధోరణులు, జెన్‌జెడ్‌ కోసం మారుతున్న ప్రాధాన్యతలను ఇవి ప్రదర్శిస్తాయి :
·       ప్రాధాన్యతా దేశాల పరంగా చూసినప్పుడు యుఎస్‌, యుకె , కెనడా, ఆస్ట్రేలియాలు  అత్యుత్తమమైన నాలుగు లక్ష్యిత కేంద్రాలుగా నిలుస్తున్నాయి. నూతన డెస్టినేషన్స్‌గా  జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్‌, టర్కీ, రష్యా మరియు చైనా నిలుస్తున్నాయి.  గతంలో విద్యార్థుల ప్రాధాన్యతల జాబితాలో ఇవి కనిపించేవి కాదు కానీ ఇప్పుడు మాత్రం వారు ఈ దేశాలలో విద్యనభ్యసించడానికి ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు, జనవరి 2021 నాటికి విదేశాలలో  10.9 లక్షల మంది విద్యార్ధులు  ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో విద్యనభ్యసిస్తున్నారని  ఎంఈఏ సమాచారం వెల్లడిస్తుంది. చైనా (29,600 విద్యార్థులు), జర్మనీ మరియు ఫ్రాన్స్‌ (రెండు దేశాల్లోనూ కలిపి 10వేల మంది విద్యార్థులు)లలో సైతం చెప్పుకోతగ్గ సంఖ్యలో విద్యార్ధులు ఉన్నారు.
·       మరో ఆసక్తికరమైన ధోరణి ఏమిటంటే,  విదేశాలలో విద్యనభ్యసించాలనుకుంటున్న విద్యార్థులు ఇప్పుడు  ప్రత్యేకమైన కోర్సులు (52%) కోరుకుంటున్నారు. యూనివర్శిటీ యొక్క పేరు కన్నా కూడా కోర్సు పరంగా వైవిధ్యతకే అవకాశం ఉంటే ప్రాధాన్యతనిస్తున్నారు.  వారు ప్రస్తుతం ప్రాచుర్యంలో లేకపోయినా నెమ్మదిగా ప్రాముఖ్యంగా మారే కోర్సులను ఇష్టపడుతున్నారు. ఐవీ లీగ్‌  యూనివర్శిటీలకుఆవల వీరు ఈ తరహా అవకాశాల కోసం చూడటం పెరిగింది.
·       విద్యార్థులకు అతి పెద్ద అవరోధంగా ఇప్పటికీ క్వాలిఫయింగ్‌  పరీక్షలు(64%) నిలుస్తున్నాయి. ఈ కారణం చేతనే ఏవైతే  దేశాలలో ఈ అర్హత పరీక్షలు లేవో లేదంటే  ఆంగ్లభాష బాగా మాట్లాడుతున్నారా లేదా అంటూ నిర్వహించే పరీక్షలకు ప్రాధాన్యత కలిగిన దేశాలకు వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
·       విద్యార్థుల ఋణాల పట్ల ఆందోళన చెందుతున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. చాలామంది ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులలో ఋణాలను తిరిగి చెల్లించడం పట్ల ఆందోళన కనబరుస్తున్నారు.  నగదు పరంగా ఆందోళనలు, మరీముఖ్యంగా బడ్జెటింగ్‌,  ఆర్థిక ప్రణాళిక వంటివి ప్రధానమైన అవరోధంగా తల్లిదండ్రులతో పాటుగా విద్యార్థులకు సైతం ఈ మొత్తం ప్రక్రియలో నిర్ణయాత్మక అంశంగా నిలుస్తుంది. దాదాపు  సగానికి పైగా (54%) ఆర్థిక పరమైన అంశాలు అత్యున్నత ఆందోళనగా నిలుస్తుంటే, విదేశాల్లో విద్యనెంచుకోవడమే కష్టంగా ఉందని కొంతమంది అంటున్నారు. ఇది  స్వల్పకాలిక వ్యవధి (47% మంది  విద్యార్థులు వీటికి ప్రాధాన్యతనిస్తున్నారు)తో కూడిన కోర్సుల ఎంపికకు ప్రాధాన్యతనిచ్చేలా చేస్తుంది. మరీముఖ్యంగా విదేశాలలో విద్యనభ్యసించడం వల్ల ఎదురయ్యే అత్యధిక ఖర్చును పరిగణలోకి తీసుకుంటున్న వేళ ఇది కనిపిస్తుంది.
·       అధ్యయనంలో పాల్గొన్న ప్రతి నలుగురు విద్యార్థులలో ముగ్గురు కోర్సు ఎంపిక మయంలో స్కాలర్‌షిప్‌ల కోసం చూస్తున్నారు. అధికంగాఉన్న ట్యూషన్‌ ఫీజులు కూడా దీనికి ఓ కారణం.
‘‘వెస్ట్రన్‌ యూనియన్‌ వద్ద, మా వ్యూహం ఎప్పుడూ కూడా క్రాస్‌ బోర్డర్‌ నగదు ప్రవాహం మీదనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాలలోనూ విద్యార్థులు మా  విశ్వసనీయ, సౌకర్యవంతమైన మద్దతును మా అంతర్జాతీయ ఆర్ధిక నెట్‌వర్క్‌ నుంచి పొందగలరు. మా నెట్‌వర్క్‌ 200కు పైగా దేశాలు మరియు ప్రాంతాల వ్యాప్తంగా విస్తరించి ఉంది. ఇది పరిగణలోకి తీసుకున్నప్పుడు, విద్య కోసం నూతన ప్రాంతాలను అన్వేషిస్తున్నప్పుడు, ఆర్థికంగా వారికి పూర్తి మద్దతు లభించడంతో పాటుగా ఎల్లవేళలా అనుసంధానించబడి ఉంటారనే భరోసా కలుగుతుంది’’ అని రజోలా అన్నారు.
అక్టోబర్‌ 2020 నాటి నుంచి ఔట్‌వార్డ్‌ రెమిటెన్స్‌లు భారత దేశీయుల నుంచి 34% వృద్ధి చెందాయి. గత త్రైమాసంలో విద్య కోసం ఔట్‌ఫ్లో పెరగడం కనిపిస్తుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ఔట్‌వార్డ్‌ రెమిటెన్స్‌లలో 30% కు పైగా విద్య సంబంధిత రెమిటెన్స్‌లు ఉంటున్నాయి. విద్యకోసం ఔట్‌వార్డ్‌ రెమిటెన్స్‌లలో 64% ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ వృద్ధి కనిపిస్తుంది. ఏప్రిల్‌ –జూన్‌2021 మధ్యకాలంలో 1.2 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌లు జరిగాయి. జనవరి–మార్చి 2021తో పోలిస్తే ఇది  5.3% వృద్ధి నమోదు చేసింది.
వెస్ట్రన్‌ యునియన్‌, భారతదేశంలో 1993 నుంచి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అతి పెద్ద మనీ మూవ్‌మెంట్‌ నెట్‌వర్క్స్‌లలో ఒక  దానిని సృష్టించిన చరిత్ర దీనికి ఉంది. వెస్ట్రన్‌యూనియన్‌ యొక్క ప్లాట్‌ఫామ్‌, సౌకర్యవంతమైన  రీతిలో నగదు బదిలీ సాధ్యం చేస్తుంది. దీని నెట్‌వర్క్‌ 200కు పైగా దేశాలలో 130కు పైగా కరెీన్సీలలో  విస్తరించి ఉంది. దీనియొక్క ఔట్‌బౌండ్‌ రెమిటెన్స్‌ సేవలు డబ్ల్యుయు డాట్‌ కామ్‌ ద్వారా, ఎస్‌ బ్యాంక్‌ మద్దతుతో అందిస్తుంది. వెస్ట్రన్‌ యునియన్‌ ఇప్పుడు అదే  తరహా సౌకర్యాన్ని ఉత్తర అమెరికా, యూరోప్‌, లాటిన్‌ అమెరికా, మిడిల్‌ ఈస్ట్‌, ఆసియా ఫసిఫిక్‌ సహా విదేశాలకు నగదు బదిలీ చేసేటప్పుడు కూడా  అందించాలనుకుంటుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.