Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో క్రిప్టో కరెన్సీని అనుమతించాలా వద్దా అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం వరుస సమీక్షలు నిర్వహిస్తుంది. క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ పరంగా నిర్ణయం ప్రకటించే ముందు ఇందులో భాగస్వాములుగా ఉన్న అన్ని పక్షాలతో చర్చలు జరపాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా క్రిప్టో ఎక్సేంజీ ప్రతినిధులు, బ్లాక్ చెయిన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ (బీఏసీసీ), పరిశ్రమ అసోసియేషన్లతో పాటు ఈ లావాదేవీలతో సంబంధం ఉండే ఇతరవర్గాలతో పార్లమెంటరీ ప్యానెల్ సోమవారం సమావేశం అయ్యిందని సమాచారం. ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై మరోసారి ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (అహ్మదాబాద్) కమిటీ సమీక్షించనున్నది. అనంతరం క్రిప్టోకి సంబంధించిన అంశం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు వెళ్లనుంది. అనంతరం అనుమతులు, షరతులపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం.