Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : విదేశీల్లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్‌కు చేయాలనుకుంటే డబుల్ ఇంటర్న్‌షిప్‌లు అవసరం కానున్నాయి. ఒకటి వారు చదివిన దేశంలోనూ, రెండోది భారత్‌లోనూ చేయవల్సి ఉంటుంది. ఈ మేరకు నూతన నిబంధనలను త్వరలో విడుదల చేయనున్నారు. దేశంలో ప్రతీ ఏటా 10 వేల నుంచి 12 వేల విద్యార్థులు విదేశాలకు వైద్య వృత్తిని అభ్యసించడానికి వెళుతుంటారు. ఇప్పటి వరకూ ఈ మెడికల్ గ్రాడ్యుయేట్లుల్లో అమెరికా, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో డిగ్రీలు పొందిన వారు మినహా, మిగిలిన వారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత చెంది, గుర్తింపు పొందిన భారతీయ వైద్య కళాశాలలో ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేస్తే వారు దేశంలో ప్రాక్టీస్‌కు తమ రిజిస్ట్రేషన్ పొందవచ్చు. ఇప్పటి వరకూ వీరిలో ఎక్కువ మంది విదేశాల్లో ఇంటర్న్‌షిప్ చేయకుండా, 4.5 ఏళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసి దేశానికి తిరిగివస్తున్నారు. అయితే వీరిలో మరి కొంత మంది విదేశాల్లోని అనేక సబ్‌స్టాండర్డ్ కాలేజీల్లో 3, 3.5 ఏళ్ల వైద్య విద్యను పూర్తి చేసిన కూడా దేశానికి తిరిగి వస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో కొత్త నిబంధనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నిబంధనలను ఫైనల్ నోటిఫికేషన్‌కు ముందు పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ కోసం ఈ వారంలో మార్గదర్శకాలు విడుదల చేస్తారని భావిస్తున్నారు.