Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హాంగ్‌కాంగ్ టూరిజం బోర్డ్ (హెచ్‌కెటీబీ)కు చెందిన వెస్ట్ కోలూన్ కల్చరల్ డిస్ట్రిక్ట్ (డబ్ల్యుకెసీడీ) తమ సిగ్నేచర్ హై రైజ్ క్రిస్మస్ ట్రీ మరియు క్రిస్మస్ టౌన్‌ను డబ్ల్యుకెసీడీ ఆర్ట్ పార్క్‌కు మొట్టమొదటిసారిగా తీసుకువచ్చింది. హాంగ్‌కాంగ్ నెయిబర్‌హుడ్-వెస్ట్‌కోలూన్ ప్రచారంలో ఇది ఓ భాగం. ఈ 20 మీటర్ల క్రిస్మస్ ట్రీ ని నవంబర్ 26వ తేదీ అమర్చారు. ఈ రొమాంటిక్ ఫోటో స్పాట్ మరియు జీవితపు తరహా డెకరేషన్స్ వద్దకు చేరుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకోండి. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
హెచ్‌కెటీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ డేన్ చెంగ్ మాట్లాడుతూ 'ప్రతి సంవత్సరం తమ శీతాకాలపు సెలవులను ఆస్వాదించడానికి హాంగ్‌కాంగ్‌ను అత్యున్నత కేంద్రంగా ఎంతోమంది సందర్శకులు ఎన్నుకుంటుంటారు. ప్రతి సంవత్సరం, హెచ్‌కెటీబీ మహోన్నతమైన క్రిస్మస్ ట్రీ స్థానికులతో పాటుగా విదేశీయులకు సైతం ఫోటో హాట్‌స్పాట్‌గావెలుగొందుతుంది. ఈ సంవత్సరం హెచ్‌కెటీబీ తమ ప్రతిష్టాత్మక క్రిస్మస్ ట్రీను డబ్ల్యుకెసీడీకు తీసుకువచ్చింది. తద్వారా కళలు, సంస్కృతికి ప్రతిష్టాత్మకమైలురాయిగా నిలిచిన ప్రాంతానికి మరింత మంది సందర్శకులను ఆకర్షించనుంది. దీనితో పాటుగా యూరోపియన్ క్రిస్మస్ టౌన్ అనుభవాలనూ అందించనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హాంగ్‌కాంగ్‌ను సందర్శించలేకపోవచ్చు కానీ తమ క్యాంపెయిన్ వెబ్‌సైట్ ద్వారా హెచ్‌కెటీబీ ఇప్పుడు నగరవ్యాప్తంగా పండుగ కాంతుల అలంకరణను సైతం చూపుతుంది` అని అన్నారు.
ఈ సంవత్సరం క్రిస్మస్ టౌన్‌ను ఫ్రాన్స్‌లోని కోల్మార్ ఫ్యాంటసీ టౌన్ స్ఫూర్తితో తీర్చిదిద్దారు. బహిరంగంగా ఏర్పాటుచేసిన క్రిస్మస్ ట్రీ 20 మీటర్ల ఎత్తులో ఆరు అంతస్తుల భవంతి కన్నా ఎత్తుగా ఉంటుంది. పండుగ సంగీతం మరియు లైటెనింగ్ ఎఫెక్ట్స్‌తో ఈ ట్రీ , విక్టోరియా హార్బర్ స్కైలైన్‌ను అలంకరించనుంది. ఈ క్రిస్మస్ టౌన్‌లో 8 శాంతా లాడ్జ్‌లు ఉంటాయి. వీటి చుట్టూ చిన్న చిన్న క్రిస్మస్ ట్రీలు, గోల్డెన్ రెయిన్‌డీర్స్, యాంటిక్ ల్యాంప్‌పోస్ట్స్ ఉండి యూరోపియన్ క్రిస్మస్ అనుభవాలను సందర్శకులకు అందిస్తాయి.