Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రన్నర్-అప్ గా నిలిచిన ఐఎస్ బీ హైదరాబాద్ ఎఫ్ఎంఎస్ ఢిల్లీలు
హైదరాబాద్ : భారతదేశపు అతి పెద్ద మరియు అత్యంత నమ్మకమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్ సంగ్ పాన్-ఇండియా క్యాంపస్ కార్యక్రమంలో 20 ప్రముఖ సంస్థలు నుండి 5,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న శామ్ సంగ్ E.D.G.E. ఆరో ఎడిషన్ ని సంస్థ ముగించింది.
ఐఐటీ మద్రాస్ నుంచి టీమ్ ఏకేఆర్ మెండర్స్ కి చెందిన తల్వార్, అభినవ్ నహాట మరియు కుష్ గనత్ర మొదటి బహుమతి సాధించారు. ఏఐ సిఫారసు, ఏఆర్/వీఆర్, ఐఓటీ ఏకేఆర్ మెండర్స్ కి చెందిన రాఘవ్ అండ్ క్యూఆర్ కోడ్ సమీకృతాన్ని వినియోగించి డైరక్ట్ కంజ్యూమర్ (డీ2సీ) బిజినెస్ సందర్భంలో యూజర్ ప్రయాణం ప్రతి స్టెప్ ని వారి కొత్త పరిష్కారం అనుకూలం చేసింది. వారి పరిష్కారం జ్యూరీ సభ్యుల్ని ఎంతగానో ప్రభావితం చేసింది మరియు ఐఎన్ఆర్ 400,000 నగదు బహుమతి మరియు శామ్ సంగ్ వారి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లని గెలుచుకోవడానికి సహాయపడింది.
ఐఎస్ బీ హైదరాబాద్ వారి టీమ్ పర్పుల్, డీ2సీ వ్యాపారానికి వారి పరిష్కారం కస్టమర్ ప్రయాణాన్ని ఆఫ్ లైన్ స్టోర్ నుండి ఆన్ లైన్ తో సమీకృతం చేస్తుంది. వీరు రెండవ బహుమతిగా ఐఎన్ఆర్ 200,000 నగదు బహుమతి మరియు శామ్ సంగ్ తో ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలు గెలుచుకున్నారు.
ఎఫ్ఎంఎస్ ఢిల్లీ వారి టీమ్ ట్రైఫెక్టా వినియోగదారు యాత్రని సాఫీ చేయడానికి పరిష్కారాన్ని సమర్పించి మూడవ బహుమతి గెలుచుకున్నారు. అలాగే ఆరంభం నుండి చివరి వరకు ఒక పరిష్కారాన్ని పూర్తి చేసే అనుభవాన్ని అందించారు. ఈ బృందానికి ఐఎన్ఆర్ 100,000 నగదు బహుమతి అందజేశారు.
ఈ ఏడాది కూడా పాల్గొనేవారి భద్రతని నిర్థారించడానికి, శామ్ సంగ్ వారి E.D.G.E. క్యాంపస్ కార్యక్రమం వర్ట్యువల్ గా నిర్వహించింది. వర్ట్యువల్ అంతిమ కార్యక్రమానికి శ్రీ కెన్ కాంగ్, ప్రెసిడెంట్ డ సీఈఓ, శామ్ సంగ్ ఎస్ డబ్ల్యూఏ మరియు శామ్ సంగ్ ఇండియా నుండి ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.
శామ్ సంగ్ ఇండియా మానవ వనరుల ప్రధాన అధికారి సమీర్ వాధ్వాన్ మాట్లాడుతూ.. 'శామ్ సంగ్ లో, మెరుగుదల కోసం ప్రపంచాన్ని మార్చడానికి ఆవిష్కరణ శక్తిని మేము ఎల్లప్పుడూ విశ్వసిస్తాం మరియు మా కాంపస్ కార్యక్రమం శామ్ సంగ్ ఈ.డీ.జీ. మరొక విజయవంతమైన సంవత్సరాన్ని ముగించడానికి మేము గర్విస్తున్నాం. ఒక వేదికగా, శామ్ సంగ్ ఈడీజీఈ రేపటి నాయకుల్ని గుర్తించడానికి మరియు పోషించడానికి ప్రయత్నించింది మరియు ప్రతి ఏడాది భారీగా పాల్గొంటున్న వారి పెరుగుదల రేట్ కి మరియు ఈ సీజన్ లో సమర్పించబడిన ప్రభావితం చేసే ఆవిష్కరణ పరిష్కారాలకి మేము ఎంతో ఆనందిస్తున్నాం` అని అన్నారు.
శామ్ సంగ్ ఈడీజీఈ దేశవ్యాప్త క్యాంపస్ వేదిక. ఇది ప్రతి ఏడాది తమ వ్యాపార చాతుర్యం, వ్యూహాత్మక ఆలోచన మరియు నాయకత్వం నైపుణ్యాలు ప్రదర్శించడానికి వేలాదిమంది తెలివైన మేధస్తులకు అవకాశం ఇస్తుంది. 2016లో ఆరంభమైన ఈ కార్యక్రమం ప్రసిద్ధి చెందిన సంస్థలు నుండి ప్రముఖ బీ-స్కూల్స్, ఇంజనీరింగ్, డిజైన్ సంస్థలకు చెందిన తెలివైన మేధోవంతుల్ని ఒక చోట చేర్చింది మరియు వాస్తవిక సమయం సవాళ్లకి విలక్షణమైన పరిష్కారాల్ని కేటాయించింది. తమ ప్రతిభలు ప్రదర్శించడానికి, అర్థవంతమైన అభిప్రాయాల్ని వినిమయం చేసుకోవడానికి మరియు తమ కెరీర్లని ఆరంభించడానికి కార్యక్రమం దేశంలోని తెలివైన విద్యార్థులకు ఒక అవకాశం కలిగిస్తుంది.
2 నెలల కార్యక్రమం విస్త్రతమైన మూల్యాంకనం దశలలో నిర్వహించబడింది. ఈ ఏడాది, 20 కళాశాలలు నుండి 1,700కి పైగా బృందాలు పాల్గొన్నాయి. బాగా పరిశోధన మరియు ఆదర్శ భావన తరువాత పాల్గొనే ప్రతి బృందానికి మొదటి దశ ఒక కార్యనిర్వహాక సంగ్రహాన్ని సమర్పిస్తుంది. మూల్యాంకనం తరువాత, ప్రతి క్యాంపస్ నుండి ఒక బృందం ఎంపిక చేయబడుతుంది. వారు కేస్ అధ్యయనం పై పని చేస్తారు, ప్రాంతీయ దశలో తమ వివరణాత్మకమైన పరిష్కారాల్ని సమర్పిస్తారు మరియు ప్రదర్శిస్తారు. ఈ ఏడాది తొమ్మిది బృందాలు ఎంపిక చేశారు. మరియు జాతీయ దశలో ప్రముఖ 3 స్థానాలలో పోరాడటానికి శామ్ సంగ్ నాయకులుచే శిక్షణ పొందారు.