Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో రీసేల్ వాహన క్రయవిక్రయాల ఇ-కామర్స్ వేదిక కార్స్24 హైదరాబాద్‌లో తన మెగా రిఫర్బిష్‌మెంట్ (పునరుద్దరణ) ల్యాబ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో 2.1 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
ఇందులో ప్రతీ రోజు 70కు పైగా కార్లను ఆధునీకరించడంతో పాటుగా 180 మందికి పైగా ఆటోమోటివ్ నిపుణులకు ఉద్యోగాలను కల్పించనున్నట్లు పేర్కొంది. ఇలాంటి కేంద్రాలు ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సిఆర్, ముంబయి, అహ్మదాబాద్, చెన్నరులలో మాత్రమే ఉన్నాయని పేర్కొంది.