Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వ్యాపారులకు గోదాము నిర్వహణ, పలు చెల్లింపు విధానాలు, నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో స్టోర్ ప్రారంభించడమే కాకుండా స్థానికి పంపిణీ ఇన్-బిల్ట్ సేవలను ప్రారంభించడంతో కలిపి అన్ని దశల్లోనూ డిజిటైజ్ చేసే జడింగా యాప్‌ను నౌఫ్లోట్స్ విడుదల చేసింది. భారతదేశంలోని రిటెయిల్ వ్యాపారులకు జడింగా వారి లావాదేవీలను పూర్తిగా డిజిటైజ్ చేసేందుకు శక్తియుతమైన విధానాన్ని అందిస్తుంది మరియు దీనితో వారి అవసరాలకు ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ పరికరాలతో వృద్ధి చెందేందుకు అవకాశాన్ని ఇస్తుంది. ఇది వ్యాపారి కేంద్రిత ఉత్పత్తి కాగా ఎస్‌ఎంబి రిటెయిల్ వ్యాపార విభాగంలో వాస్తవ లావాదేవీల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంది. జడింగా వ్యాపారులకు సులభంగా గోదాము నిర్వహణ మరియు ఒన్ స్టాప్ పేమెంట్ కలెక్షన్ అండ్రీకన్సిలియేషన్ అనుభవం ద్వారా వారి వ్యాపారాన్ని సరళీకృతం చేసేందుకు మద్ధతు ఇస్తుంది; వారి లావాదేవీలను తక్షణమే వాట్సప్ డిజిటల్ రసీదులను పంచుకోవడం ద్వారా విశ్వాసాన్ని సృష్టించడం మరియు వారి ఆర్డర్లకు వరుస అప్‌డేట్లను ఇవ్వడం చేస్తుంది. ఇది ఒక ఏడాది అభివృద్ధి మరియు నగరాల్లో రిటెయిల్ వ్యాపారుల్లో నాలుగు నెలల బీటా బీటా టెస్టింగ్ అనంతరం అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు వారి రియల్-టైమ్ పనితీరు ఆధారంగా ట్యాబ్ ఉంచుకోవచ్చు; ఈ యాప్ బిల్ట్-ఇన్ రిపోర్టులను ఇస్తుండగా, అది వ్యాపారం ఎలా నడుస్తుందో తెలుకునే బర్డ్ఐ వ్యూను ఇస్తుంది. అదనంగా వినియోగదారుల నుంచి వారి నత్యం, నెలవారీ మరియు వార్షిక విక్రయాలను నియంత్రించేందుకు మరియు గత సాధనలతో పోల్చి చూసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ యాప్ సరళమైన చెకౌట్ మరియు చెల్లింపులను సాధ్యం చేస్తుంది; వ్యాపారులు వారి చెల్లింపులను డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యుపిఐ, మొబైల్ వ్యాలెట్‌లు లేదా ఒన్-టైమ్ చెల్లింపు లింక్‌ల ద్వారా చెల్లింపులను సేకరించుకోవచ్చు. డిజిటల్ రసీదులు ప్రక్రియను సులభం చేస్తుండగా, అవి చెల్లింపుల ధృవీకరణను ఎస్‌ఎంఎస్ మరియు వాట్సప్ ద్వారా పొందవచ్చు. జడింగా ఎస్ఎంబి లావాదేవీలను సాంకేతిక మరియు పరికరాలతో పూర్తి చేస్తుండగా అది మిలియన్లు మరియు ఏళ్ల తరబడి శ్రమించిన అనంతరం సృష్టించారు. దీన్ని అందుబాటులోకి తీసుకు రావడం గురించినౌఫ్లోట్స్ వ్యవస్థాపకుడు నితిన్ జైన్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలోని వ్యాపారులను డిజిటైజ్ చేసేందుకు మరియు దానితో వారి మారుతున్న వారి డిజిటల్ డిమాండ్‌కు అనుగుణంగా వారి లావాదేవీలను వృద్ధి చేసేందుకు మద్ధతుగా ఉండడం మా ఉద్దేశంగా ఉంది. జడింగా గోదాముల నిర్వహణ, చెల్లింపుల సేకరణ, ఇ-కామర్స్ మరియు డెలివరీ లాజిస్టిక్స్ అన్నింటినీ ఒకే యాప్‌లో నిర్వహించేలా సరళీకృతం చేస్తుంది. అకౌంటింగ్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ రానున్న నెలల్లో సరళీకరించేలా ఇతర అత్యంత సంకీర్ణ వాణిజ్య ప్రక్రియలుగా ఉన్నాయి. జడింగా అడుగుజాడలు భారతదేశంలోని రిటెయిల్ వ్యాపారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించాము. సరళమైన మరియు ఇంటూటివ్ యుఐను ఇద కలిగి ఉంది. మేము జడింగా ద్వారా భారతదేశంలోని రిటెయిల్ వ్యాపారులు సాంకేతికత అలవర్చుకోవడం ద్వారా వారి లావాదేవీలను నిర్వహించే విధానాన్ని విప్లవాత్మకం చేసేందుకు సిద్ధమైంది’’ అని వివరించారు. Zadinga’sప్రత్యేక ఫీచర్ అంటే అది స్థానిక డెలివరీ భాగస్వాములతో లింక్ కలిగిన ఆన్‌లైన్ స్టోర్లను సృష్టిస్తుంది, దీనితో అనుకూలకరంగా ఇంటి వాకిలి వద్దే డెలివరీ అందిస్తుంది. ఇది ప్యాక్స్ ఎ920 మరియు ప్యాక్స్ డి180లో అడ్డంకులు లేకుండా పని చేస్తుంది. ప్యాక్స్ ఎ920 ఆండ్రాయిడ్ ఫోన్‌లోని పూర్తి ప్రత్యేకతలను అన్నింటినీ పల్చని మరియు చిన్న డిజైన్‌లో శక్తియుతమైన పేమెంట్ టర్మినల్‌ను సంయోజిస్తుంది. ఇది మీ రిటెయిల్ లావాదేవీలను దిననిత్యపు డిమాండ్లను పరిష్కరించేందుకు ఇంటిగ్రేటెడ్ కెమెరా, ప్రింటర్ మరియు ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీని కలిగి ఉంది. డి180 స్టైలిష్ మరియు ఖర్చును ఆదా చేసే వైర్‌లెస్ ఎంపిఓఎస్ టెర్మినల్ కాగా, అది విస్తృత శ్రేణిలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు మరియు పీసీల విస్తృత శ్రేణికి అనుసంధానం చేస్తుంది. సులభంగా వినియోగించుకునేందుకు, అనుకూలకరం మరియు దోషరహిత అనుభవాన్ని జడింగా ఇస్తుంది. ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ కేంద్రంలో ఉంటూ, స్మార్ట్ స్టాక్ ఆన్‌బోర్డింగ్‌ను ఇస్తూ, ఇది వ్యాపారులకు 10,000కుపైగా ఎక్కువ ఉత్పత్తుల నుంచి 2 నిమిషాల్లో రెడీమేడ్ కేటలాగ్ నుంచి ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇస్తుంది మరియు ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్ లావాదేవీలకు సంపూర్ణమైన స్టాక్ మేనేజ్‌మెంట్‌ను కేవలం కొన్ని క్షణాల్లో నిర్వహించుకోవచ్చు. జడింగా సరళీకృతమైన ఉత్పత్తి మోడల్ దాన్ని వినియోగదారుల కేటలాగ్‌లో గతంలో లిస్ట్ కాని కొత్త ఉత్పత్తులను చేర్చడాన్ని సులభం చేస్తుంది.