Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓయో ట్రావెలోపీడియా 2021 | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 29,2021

ఓయో ట్రావెలోపీడియా 2021

భారతదేశం

·        53% మంది ప్రయాణికులు తాము దేశీయ గమ్యస్థానాలను అన్వేషించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతీయులు ఇప్పటికీ రోడ్‌ట్రిప్‌ల పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు

·        సమీక్షకు స్పందించిన భారతీయుల్లో 2022లో తమ ప్రధాన తీర్మానం ప్రయాణం అని తెలిపారు

·        సమీక్షకు స్పందించిన వారిలో 65% గత 6 నెలల్లో ప్రయాణాలు చేశారు; చాలా మంది తమకు ఆప్తులను సందర్శించారు

·        సమీక్షకు స్పందించిన వారిలో 44% మంది తమ కుటుంబం మరియు స్నేహితులతో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటామని, మరో 44% మంది కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నామని పేర్కొన్నారు

·         డూమ్ స్క్రోలింగ్ ట్రావెల్ కంటెంట్‌ను 54% భారతీయులు అంగీకరించారు; వినియోగదారులలో టాప్ ఛాయిస్ ప్లాట్‌ఫారంగా ఇన్‌స్టాగ్రామ్ ఉంది

 

ప్రపంచం

·        ప్రపంచ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ప్రయాణించేందుకు అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలుగా రోడ్‌ట్రిప్‌లు అవతరించాయి.

·        ఐరోపా మరియు భారతదేశానికి చెందిన పర్యాటకులు ప్రకృతి నడుమ ఉన్న వసతిని ఇష్టపడుతున్నారు

·        అత్యధికంగా ప్రయాణించడం, ఇప్పటి వరకు ప్రయాణ పరిమితులతో కలుసుకోలేని ఆప్తులను కలుసుకోవడం మరియు కొత్త గమ్యస్థానాలను అన్వేషించడం వంటివి 2022లో సంవత్సరంలో తమ ప్రధాన తీర్మానాలు అని ఎక్కువ మంది చెప్పారు.

·        పర్యాటక సమాచారం కోసం భారతదేశం మరియు ఇండోనేషియాల్లో గో-టు ఆప్షన్‌గా సోషల్ మీడియా మొదటి జాబితాలో ఉంది; యూరోపియన్లు కుటుంబం మరియు స్నేహితుల నుంచి సిఫార్సులను తీసుకుంటున్నారు

·        ఐరోపాకు చెందిన పర్యాటకులు తమ ప్రయాణాలను 3 నెలల ముందుగానే ప్లాన్ చేసుకుంటారు, కాగా, ఇండోనేషియన్లు మరియు భారతీయులు తమ ప్రయాణాన్ని ఒక నెల ముందుగానే ప్లాన్ చేసుకుంటారు

 గత రెండేళ్లు ప్రతి ఒక్కరి పరస్థితి రంగుల రాట్నంగా మారిపోయింది. కానీ ఇది ప్రతి ఒక్కరి శక్తిని మరియు స్థిరత్వాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించింది- ఇది మొదటి వరుసలో నిలబడి పోరాటం చేయడం, వేగవంతమైన ఇనాక్యులేషన్ డ్రైవ్‌లు లేదా తల్లిలాంటి ప్రకృతిని అన్వేషించే విశ్వాసాన్ని పెంపొందించింది. కొవిడ్ అల పెరుగుతున్నప్పటికీ, ప్రజల మనస్సుల్లో నిలిచి ఉన్న ఏదో ఒక అంశం ఉంటే అది ప్రయాణమేనని స్పష్టమైంది. లాక్‌డౌన్ నుంచి ప్రపంచం తలుపులు తెరుచుకున్న వెంటనే, ప్రయాణికులు రోడ్ల పైకి వచ్చి తమ ప్రయాణాలను ప్రారంభించారు.  ఇది కేవలం మా ఆలోచనలు, అభిప్రాయాలు లేదా మన అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్స్ ఆధారంగా చెప్పడం లేదు! భారతదేశం, ఇండోనేషియా మరియు ఐరోపాతో సహా కొన్ని ప్రధాన మార్కెట్‌లలో ప్రయాణ ఉద్దేశం మరియు తన జాబితాలోని వినియోగదారులతో అంచనాలను అధ్యయనం చేసేందుకు ఓయో ప్రత్యేకంగా వినియోగదారులతో సమీక్ష నిర్వహించి; ఓయో నాల్గవ సంవత్సరాంతపు వార్షిక సూచిక - ‘ఓయో ట్రావెలోపీడియా 2021ను విడుదల చేసింది.
         2021లో ఆధిపత్యం చెలాయించిన వర్క్‌కేషన్‌ల నుంచి, దేశీయ ఆఫ్‌బీట్ గమ్యస్థానాలను అన్వేషించడం వరకు, ఇన్‌స్టాగ్రామ్‌లో డూమ్ స్క్రోలింగ్ మరియు 2022లో మరిన్ని ప్రయాణాలు చేయడం వరకు, 2021లో వినియోగదారులు ఎలా ప్రయాణించారు మరియు 2022లో వారి తీర్మానాల నివేదికను ఈ జాబితా స్పష్టంగా పేర్కొంది. కనుక మరింత ఆలోచించకుండా, మనం ఇక్కడకు వెళుతున్నాము.
భారతదేశం
           ప్రతి ఒక్కరికీ 2020 కష్టంతో కూడిన ఏడాదిగా మిగిలిపోయింది. పుట్టినరోజులు, ఇతర ప్రధాన కార్యక్రమాలు, వేడుకలు తదితరాలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. విద్యార్థులు పండుగ వేడుకల కోసం ఇంటికి తిరిగి వెళ్లలేకపోయారు, తమ స్నేహితులతో వీడియో కాల్స్ చేసుకుని విందులు చేసుకోవలసి వచ్చింది. కానీ 2021 కొంత భిన్నంగా ఉంది. ఓయో ట్రావెలోపీడియా ప్రకారం, సమీక్షకు స్పందించిన వారిలో సుమారుగా 65% మంది గత 6 నెలల్లో ప్రయాణాలు చేయగా, వారిలో ఎక్కువ మంది తమకు అత్యంత ఆప్తులు, ప్రియమైన వారిని కలుసుకున్నారు. కొందరికి తమ దినచర్యల నుంచి తప్పించుకోవడం మరియు విశ్రాంతి కోసం ప్రయాణించడం అవసరం. కొంతమంది తమ ఆర్థిక వ్యవస్థను కొనసాగించేందుకు మరియు వారు వ్యాపార అవసరాల కోసం ప్రయాణించారు.
            భారతదేశం స్థిరత్వంతో కూడిన దేశం- సామూహిక టీకా డ్రైవ్‌లతో, ప్రయాణించే ఉద్దేశం మరియు విశ్వాసం తిరిగి వచ్చింది! సమీక్షకు స్పందించిన 60% మంది శీతాకాలపు సెలవల్లో తమ ప్రయాణాలకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఏదేమైనప్పటికీ, ఎక్కువ మంది తమ పర్యటన తేదీ దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు 31% మంది తమ ప్రయాణాలను ఒక నెల ముందుగానే ప్లాన్ చేసుకుంటామని చెప్పగా, 26% మంది తమ ప్రయాణాన్ని ఒక వారం ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు ఇష్టపడతామని తెలిపారు. కొవిడ్ ముందస్తు రోజుల తీరుతో పోల్చితే ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది.

ఇంకేముంది?
·        సెన్సార్ టవర్ నుంచి వచ్చిన డేటా ప్రకారం, ప్రయాణ మొబైల్ అప్లికేషన్‌లో, భారతదేశంలోని ఓయో వినియోగదారులు తమ ఓయో యాప్‌లో 3,232 ఏళ్లకు సమానమైన విలువైన సమయాన్ని వెచ్చించారు - భారతదేశంలో ఇది 2021 ఆర్థిక సంవత్సరంలో అత్యధికం.
·        సుబహ్-షామ్. చాలా బాగుంటుంది. ఓయో యాప్‌లో బుకింగ్‌లు చేసుకునేందుకు అత్యంత ప్రజాదరణ పొందిన సమయం ఉదయం 11:00- మధ్యాహ్నం 1:00, సాయంత్రం 6:00 – రాత్రి 9:00.
·        ఫ్యాన్ అలర్ట్: భారతదేశానికి చెందిన ఒక ట్రావెల్ ఏజెంట్ 2021లో ఓయో కోసం 1193 బుకింగ్‌లు చేసారు
·        ఓయో అతి పెద్ద బుకింగ్‌లో ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారుడు 36 మంది కోసం 72 రాత్రులకు ఓయోలో బుకింగ్ చేశారు.
కొండలు > బీచ్‌లు > ఆఫ్ ది బీటెన్ ట్రాక్
కొండ ప్రాంతాలు వర్సెస్ బీచ్ ఎంపిక ఇప్పటికీ సమానంగానే ఉండగా, సమీక్షకు స్పందించిన వారిలో 35% మంది పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడగా, 24% మంది బీచ్‌లకు వెళ్లేందుకు ఇష్టపడతామని చెప్పారు. కానీ సమీక్షకు స్పందించిన వారిలో అత్యధికంగా 53% మంది తాము ఆఫ్‌బీట్ దేశీయ గమ్యస్థానాలను అన్వేషింస్తామని తెలిపారు. రోడ్‌ట్రిప్‌ల పట్ల భారతీయులు ఇప్పటికీ మక్కువ చూపిస్తున్నారు. సమీక్షకు స్పందించిన వారిలో సగానికి పైగా తాము ప్రైవేట్ లేదా అద్దె కార్లలో ప్రయాణిస్తామని చెప్పగా, 35% మంది బస్సులో లేదా రైలులో ప్రయాణించడం చాలా బాగుంటుందని పేర్కొన్నారు. కేవలం 14% మంది మాత్రమే విమానంలో ప్రయాణించడం సంతోషంగా  ఉంటుందన్నారు. వినియోగదారులలో ఎక్కువ మందికి హోటళ్లు అత్యధిక వసతి సదుపాయాల ఎంపికగా ఉన్నాయి. పర్యాటకుల్లో 60% మంది వీటిని ఎంచుకుంటుండగా, మిగిలిన వారు సరస్సు, నది లేదా బీచ్ రిసార్ట్‌లు మరియు వాటర్ ఫ్రంట్ ప్రాపర్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే, 2022లో అన్ని ప్రాంతాలు చుట్టి వచ్చేందుకు సమయం ఆసన్నమైంది! కనుక, భారతదేశం వేడుక చేయాలని ప్రణాళిక చేస్తుంది? ఈ విషయంలో భారతదేశం సరిహద్దులో ఉన్నట్లు కనిపిస్తోంది. సమీక్షకు స్పందించిన వారిలో 44% మంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త ఏడాదిని కుటుంబ సభ్యులు, స్నేహితులతో వేడుక చేసుకుంటామని చెప్పగా, మరో 44% మంది కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నామని తెలిపారు.
         భారతదేశం ఏమి చేసినా, ఒక విషయాన్ని కచ్చితంగా చెప్పవచ్చు, అది ‘కుటుంబం మరియు స్నేహితులతో’ ఉంటుంది. సరే, మనం నిజంగా మరియు సగర్వంగా సామూహిక సమాజంలో ఉంటున్నాం కదా? ఎంత కాదననున్నా అవుననే చెప్పాలి! కానీ సమీక్షకు స్పందించిన వారిలో సుమారుగా 9% భారతీయులు కూడా #ఒంటరిగా ప్రయాణించడాన్ని ఎంచుకున్నారు - ఈ కొత్త ఏడాదిలో ఒక ఆత్మ శోధిస్తోంది.

వర్క్‌కేషన్ > పని, ప్రయాణం, పునరావృతం
ప్రపంచాన్ని 2020 మార్చేసింది. మరియు 2021 అనేది రిమోట్‌గా పని చేస్తున్నప్పుడు కోల్పోయిన సెలవులను స్వీకరించడం మరియు భర్తీ చేయడంతోనే కొనసాగింది. ఓయో ట్రావెలోపీడియా 2021 ప్రకారం, దాదాపు 48% మంది భారతీయులు ఏడాది మొత్త ఇంటి నుంచి పని చేసారు, వీరిలో 85% మంది వర్క్‌కేషన్‌లను లేదా ఇంటికి దూరంగా, సుందరమైన ప్రదేశంలో పని చేసేందుకు ఇష్టపడ్డారు. అలాగే, వీరిలో 61% మంది వర్క్‌కేషన్ తీసుకున్నారు. మరింత ఆసక్తికరమైనది ఏమిటి? దాదాపు 27% మంది నెల రోజుల పాటు పనిచేశారు. ఈ వర్క్ x ట్రావెల్ ట్రిప్‌లకు సంబంధించిన ప్రదేశాల జాబితాలో హిల్ స్టేషన్‌లు అగ్రస్థానంలో ఉండగా, తదుపరి స్థానాల్లో ఎక్కువ మంది తమ స్వస్థలాలు, బీచ్ డెస్టినేషన్లను సందర్శించారు. డిజిటల్ సంచార ఏడాది 2021కు  అభినందనలు!
సరే. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పోలిక ఉంది. మనమందరం సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే దోషులమే. మహమ్మారి సమయంలో డూమ్ స్క్రోలింగ్ ట్రావెల్ కంటెంట్ మీకు బాగా నచ్చిందా?
         అభియోగాలు మోపబడిన 54% భారతీయులు దోషులుగా తేలారు. దాదాపు 50% మంది భారతీయులు తమ తదుపరి పర్యటన కోసం స్ఫూర్తిని పొందేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయించామని చెప్పగా, 52% మందికి పైగా ఇన్‌స్టాగ్రామ్‌ను తమ అగ్ర ఎంపికగా పేర్కొనగా, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. సమీక్షకు స్పందించిన వారిలో 35% మంది పాఠశాలల్లోని తమ పాత మిత్రులు మరియు తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రేరణ పొందడాన్ని కొనసాగించారు. కొత్త ఏడాదితో పాటు నూతన సంవత్సర తీర్మానాలు వస్తాయి. ఓయో నిర్వహించిన సమీక్షకు స్పందించిన వారిలో ప్రయాణానికి సంబంధించిన వారి కొత్త సంవత్సర తీర్మానాల గురించి అడిగింది. సమీక్షలో కంపెనీ గుర్తించిన అంశాలను ఇక్కడ పేర్కొంది.
                   దాదాపు 30% ఓట్లతో, 2022లో ఎక్కువ ప్రయాణం చేయాలనేది భారతదేశంలోని పర్యాటకుల ప్రధాన తీర్మానం కాగా, ఆ తర్వాత 18% మంది ప్రయాణ పరిమితుల కారణంగా కలుసుకోలేకపోయిన తమ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను కలుసుకునేందుకు ఇష్డపతామని తెలిపారు. మరో 18% మంది ప్రతి కొన్ని నెలలకొకసారి కొత్త పర్యాటక ప్రాంతాలను అన్వేషించేందుకు ఇష్టపడతామని చెప్పారు. కాగా, 15% మంది ప్రయాణ ప్రయోజనాల కోసం మాత్రమే పొదుపు ఖాతాను తెరవడం ద్వారా ప్రయాణంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. ఇతర ప్రధాన తీర్మానాల్లో ఒంటరిగా ప్రయాణించడం, అన్ని వార్షిక సెలవులను ఉపయోగించడం, అంతర్జాతీయ పర్యటనలు మరియు పర్యావరణ స్పృహతో కూడిన ప్రయాణం తదితరాలు ఉన్నాయి. సమీక్షకు స్పందించిన వారిలో 32% మంది భారతీయులు ఏడాదికి కనీసం రెండుసార్లు సెలవు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మరో 20% మంది కనీసం ఏడాదికి ఒకసారి పర్యటనలకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, మరోవైపు, 22% మంది ప్రయాణికులు (నిజంగా ఉత్సుకతతో ఉన్నవారు) కనీసం నెలకు ఒకసారి వాండర్‌లస్ట్ బస్సులో ప్రయాణించాలనుకుంటున్నారు. ఓయ్ ఆగండి. భారతీయుల్లో 6% మంది 2022లో 365 రోజులూ సెలవులో ఉండాలనుకుంటున్నారని చెప్పడం మనం మర్చిపోయామా? ఇది ఒక ప్రణాళికలా అనిపిస్తోంది!
ఐరోపా
           భారతదేశం మాదిరిగానే, నెదర్లాండ్స్‌లో 80% మంది మరియు డెన్మార్క్‌లో 51% మంది ఐరోపాలోని పర్వత ప్రాంతాలకు ప్రయాణించారు. రెండు ప్రాంతాలలో ఓయో తన వినియోగదారులతో నిర్వహించిన సమీక్ష ప్రకారం 2021లో, డచ్, డానిష్‌లు ఎక్కువగా విశ్రాంతి తీసుకునేందుకు ప్రయాణించారు, ఆ తర్వాత వ్యాపారం లేదా పనికి సంబంధించిన ప్రయాణాలు చేశారు.
             ఐరోపా ఖండంలోని దేశాల ప్రజలు తమ సెలవులను ఇంట్లో హాయిగా గడిపేందుకు ఎంచుకున్నారని డేటా మరింత హైలైట్ చేసింది. ఆసక్తికరంగా, భారతదేశంలో మాదిరిగా కాకుండా, ఐరోపాలో సమీక్షకు స్పందించిన వారిలో 70% మంది తమ పర్యటనలను కనీసం 3 నెలల ముందుగానే ప్లాన్ చేసుకుంటామని చెప్పారు. నెదర్లాండ్స్‌లో సమీక్షకు స్పందించిన వారిలో ఎక్కువ మంది వారం రోజుల ప్రయాణ విరామం తీసుకోవడాన్ని ఇష్టపడతామని పేర్కొనగా, డానిష్ పర్యాటకులు తాము 10 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ సమయం, ఎక్కువ పర్యటనలు చేయడానికి ఇష్టపడతామని పేర్కొన్నారు. ఆసక్తికరంగా, ఇతర దేశాల మాదిరిగా కాకుండా, ఐరోపా సోషల్ మీడియాలో ట్రావెల్ కంటెంట్‌ను డూమ్ స్క్రోలింగ్ చేసే అవకాశం లేదు. బదులుగా కుటుంబం, స్నేహితుల నుంచి  వారి ప్రయాణ స్ఫూర్తిని పొందుతారు.
      డెన్మార్క్‌లో, ఏకాంత గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు టాప్ డెస్టినేషన్ కేంద్రాలుగా ఉండగా, నెదర్లాండ్స్‌లో సమీక్షకు స్పందించిన వారు కొండ ప్రాంతాలను ఎంచుకున్నారు. అదనంగా, దాదాపు 77% డచ్‌లు మరియు 80% డానిష్ పర్యాటకులు తమ ప్రయాణానికి ఇష్టమైన మార్గంగా రోడ్‌ట్రిప్‌లను ఎంచుకున్నారు. స్పష్టంగా చెప్పాలంటే,  గత ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ కాలంగా, రెండు ప్రాంతాలకు చెందిన వారు రోడ్ ట్రిప్పింగ్‌తో కచ్చితంగా ప్రేమలో పడ్డారు. ఐరోపా దేశాలకు చెందిన వారు హోటళ్ల కన్నా వెకేషన్ హోమ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వే తేటతెల్లం చేసింది. పశ్చిమాన అందమైన ఉత్తర సముద్రం, తూర్పున బాల్టిక్ సముద్రం, డానిష్‌లో బోట్‌హౌస్‌లు రెండవ టాప్ వసతి ఎంపికగా నిలిచాయి.
పర్యటనకు సంబంధించి 2022లో ఐరోపాలొ అత్యంత ప్రజాదరణ పొందిన నూతన సంవత్సర తీర్మానం ఏమిటి?
డెన్మార్క్‌లో సమీక్షకు స్పందించిన వారిలో 33% మంది 2022లో మరింత ఎక్కువ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ప్రయాణ పరిమితులు జారీలో ఉన్నప్పుడు డెన్మార్క్ జాబితాలో రెండవ అత్యంత ప్రజాదరణ అంశంలో ప్రతి కొన్ని నెలలకు ఒకసారి కొత్త గమ్యస్థానాన్ని అన్వేషించడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను సందర్శించేందుకు కేటాయిస్తామని చెప్పారు. నెదర్లాండ్స్‌లో, సమీక్షకు స్పందించిన వారు రానున్న ఏడాదిలో విదేశాలకు వెళ్లాలని, సాధారణం కన్నా ఎక్కువగా ప్రయాణించాలని తీర్మానాన్ని తీసుకున్నారు.
ఇండోనేషియా
బాలి బీచ్‌ల నుంచి జకార్తాలోని ప్రత్యక్ష వీధుల వరకు, ఇండోనేషియా సంస్కృతి మరియు ప్రకృతి సౌందర్యానికి నిధి అని చెప్పవచ్చు. ఒయోయో ట్రావెలోపీడియా 2022లో దేశంలోని అత్యుత్తమ ప్రాధాన్యతల గమ్యస్థానంగా బాలి అగ్రస్థానంలో ఉందని వెల్లడించడంలో ఆశ్చర్యమే లేదు!
                సమీక్ష ఫలితాల ప్రకారం, 2021లో ఇండోనేషియన్లు ప్రయాణించడానికి లీజర్ వెకేషన్ మరియు వ్యాపార సంబంధిత ప్రయాణాలు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. సమీక్షకు స్పందించిన వారిలో ఎక్కువ మంది రానున్న సెలవు సీజన్ కోసం తమ ప్లాన్‌లను ఇప్పటికే పూర్తి చేసుకోగా, ఇది ఇది ప్రజలలో విశ్వాసం స్థిరంగా పుంజుకుందని సూచిస్తోంది. సమీక్షకు స్పందించిన వారిలో ఎక్కువ మంది కనీసం ఒక నెల ముందుగానే తమ పర్యటనల ప్రణాళిక చేసుకునేందుకు ఇష్టపడతామని చెప్పారు. అయితే, ఇతర ప్రాంతాలతో పోలిస్తే, ఇండోనేషియా ప్రజలు తక్కువ ట్రిప్‌లను ఇష్టపడుతుండగా, సమీక్షకు స్పందించిన వారిలో 75% మంది 1 నుంచి 3 రోజుల మధ్య పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. వసతి విషయానికి వస్తే, ప్రయాణికులు తమ బసకు కీలకమైన ఎంపికగా హోటళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
              అందమైన బీచ్‌లు మరియు ద్వీపాలతో చుట్టుముట్టబడిన ఇండోనేషియన్లు తమ విహారయాత్రలను బీచ్ డెస్టినేషన్లలో గడపాలని కోరుకున్నారు. ఇతర భౌగోళిక ప్రాంతాల మాదిరిగానే, ఇండోనేషియా ప్రజలూ రోడ్డు మార్గంలో ప్రయాణించడాన్ని ఇష్టపడుతున్నారు. సమీక్షకు స్పందించిన వారిలో మూడవ వంతు కన్నా ఎక్కువ మంది కార్లు లేదా మోటర్‌బైక్‌లో ప్రయాణించడాన్ని ఎంచుకున్నారు.
              ఇండోనేషియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నూతన సంవత్సర తీర్మానం ఏమిటి? సమీక్షకు స్పందించిన వారిలో సుమారుగా 25% మంది కుటుంబం మరియు ప్రియమైన వారిని కలవాలని నిర్ణయించుకోగా, ఇది ఇండోనేషియాలో 2022 ఏడాదికి అత్యంత ఎక్కువ మంది చేసిన తీర్మానంగా ఉంది. ‘ప్రయాణానికి డబ్బు ఆదా చేయడం’ అనేది రెండో స్థానంలో నిలిచింది. సమీక్షకు స్పందించిన వారిలో 15% మంది ప్రతి కొన్ని నెలలకు కొత్త గమ్యస్థానాలను అన్వేషించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.