Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) డిజిటల్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా కొత్తగా ఎల్‌ఐసీ డీజీ జోన్‌ను ఆవిష్కరించింది. ముంబయిలో దీన్ని ఎల్‌ఐసీ చైర్‌పర్సన్ ఎంఆర్ కుమార్ లాంచనంగా ప్రారంభించారు. వినియోగదారులకు సంస్థ సేవలను మరింత చేరువ చేసేందుకు డీజీ జోన్ తోడ్పాటునందించనుందని కుమార్ అన్నారు. దీంతో వినియోగదారులు ఆన్‌లైన్‌లో పాలసీల కొనుగోలు, ప్రీమియం చెల్లింపులు, ఇతర సేవలను పొందవచ్చని ఎల్‌ఐసీ వెల్లడించింది. ఎల్‌ఐసీ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారంతో పాటు అన్ని రకాలైన సమాచారాన్ని అందించనుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసీ ఎండీలు రాజ్ కుమార్, సిద్ధార్థ మొహంతి, బిసి పట్నాయక్, వెస్ట్రన్ జోన్ జోనల్ మేనేజర్ వికాస్ రావు తదితరులు పాల్గొన్నారు.