Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు షావోమీ, ఒప్పోలు ఆదాయపు పన్ను (ఐటి) చట్టాలను ఉల్లంఘించినందుకు గాను అవి భారీ జరిమానాకు గురి కానున్నాయి. ఈ రెండు కంపెనీలపై దాదాపు రూ.1000 కోట్ల మేర జరిమానా విధించే అవకాశం ఉందని ఐటి శాఖ వెల్లడించింది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఢిల్లీలోని షావోమీ, ఒప్పో, వన్ ప్లస్ కార్యాలయాలలో ఐటి శాఖ డిసెంబర్ 21న తనిఖీలు చేసింది. ఆ కంపెనీ అధికారులను ఐటి అధికారులు ప్రశ్నించగా.. అవి విదేశాల్లోని వాటి గ్రూపు కంపెనీలకు అక్రమంగా రూ.5,500 కోట్లకు పైగా ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేసినట్లు వెల్లడయ్యింది. ఐటి చట్టం, 1961 సూచించిన ఆదేశాలను ఈ కంపెనీలు పాటించకపోవడంతో వాటిపై రూ.1000 కోట్ల వరకు జరిమానా విధించడానికి వీలుందని ఐటి శాఖ పేర్కొంది.