Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీ ఎక్సేంజీలు కోట్ల రూపాయల్లో పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని తెలుస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) అధికారులు ఆరు క్రిప్టోకరెన్సీ ఎక్సేంజీల్లో సోదాలు నిర్వహించారని సమాచారం. కాయిన్‌స్విచ్ కుబేర్, కాయిన్‌డిసిఎక్స్, బైయూకాయిన్, యూనోకాయిన్ లావాదేవీలను నిర్వహించే సంస్థల్లో ఈ సోదాలు జరిగినట్లు తెలిపింది. వీటిల్లో పెద్ద ఎత్తున వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఎగవేతను గుర్తించినట్లు వెల్లడించింది. దాదాపు రూ.70 కోట్ల వరకు పన్ను ఎగవేసినట్లు సమాచారం. క్రిప్టో కాయిన్స్ కొనుగోలు, అమ్మకాల్లో ఈ సంస్థలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయని, ఈ సేవలకు 18 శాతం చెల్లించవలసి ఉండగా ఆ పన్ను ఎగ్గొడుతున్నాయి. క్రిప్టో కరెన్సీలను అనుమతించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ కరెన్సీ అనుమతుల విషయంలో ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడం గమనార్హం.