Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గార్నియర్ వన్ గ్రీన్ స్టెప్ సర్వే లో వెల్లడి
వన్ గ్రీన్ స్టెప్ రెండో వార్షిక నివేదిక ఫలితాలను వెల్లడించిన బ్రాండ్
హైదరాబాద్ : మాస్ బ్యూటీ బ్రాండ్ గార్నియర్ ఇటీవల తన వన్ గ్రీన్ స్టెప్ రెండో వార్షిక నివేదిక ఫలితా లను వెల్లడించింది. భారతదేశం, మరో ఎనిమిది దేశాల్లో 29 వేలమందికి పైగా ప్రజల పర్యావరణ సంబంధిత భావాల్లో వచ్చిన భౌగోళిక, తరాల సంబంధిత మార్పులను తెలియజేసింది. ఈ సర్వేలో భారతదేశం నుంచి 2,115 మంది పాల్గొన్నారు. 2022లో మరింతగా పర్యావరణం దిశగా మారిపోవాలన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. భారతదేశంలో స్పందించిన వారిలో 91శాతం మంది మరింత పర్యావరణహితంగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ అదెలానో వారికి తెలియడం లేదు. 93శాతం మంది శీతోష్ణ స్థితి మార్పుల గురించి, అది భవిష్యత్ లో భూమిపై కలిగించే ప్రభావం గురించి కలత చెందుతున్నారు.
ఈ క్యాంపెయిన్ లో భాగంగా గార్నియర్ ఒక వీడియోను విడుదల చేసింది. తమ ప్రవర్తనలో పర్యావరణ సంబంధిత మార్పుల గురించి తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరింది. అంతేగాకుండా ఈ బ్రాండ్ తో దీర్ఘకాలిక అనుబంధం కలిగిన ఎన్జీఓ ప్లాస్టిక్స్ ఫర్ ఛేంజ్ కు విరాళాలు అందించడాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. ఈ వీడియోను తమ సోషల్ మీడియా కమ్యూనిటీతో #ONEGREENSTEP గా షేర్ చేసుకోవాల్సిందిగా కూడా ఈ క్యాంపెయిన్ ప్రజలను కోరింది. ప్రతీ వీడియో షేర్ కు గార్నియర్ 5 ప్లాస్టిక్ బాటిల్స్ ను రీసైకిల్ చేస్తుంది. 20 లక్షల బాటిళ్లను చేరుకోవాలన్నది లక్ష్యం. అంతేగాకుండా ప్రజలు #ONEGREEN STEP ఉపయోగించడం ద్వారా, పర్యావరణం కోసం తాము తీసుకున్న ఓ చర్యను షేర్ చేస్తే, అలా చేసే ప్రతీ ఒక్కదానికి గార్నియర్ 10 ప్లాస్టిక్ బాటిల్స్ ను సేకరించి రీసైకిల్ చేస్తుంది. పర్యావరణహితం కోసం మరిన్ని చర్యలు ఎలా తీసుకోవచ్చు అనే విషయంలో ప్రజలకు తోడ్పడేలా ఓ మార్గదర్శిని కూడా గార్నియర్ వెబ్ సైట్ లో చూడవచ్చు.
ఈ సందర్భంగా ఈ క్యాంపెయిన్ గురించి లోరియల్ ఇండియా జనరల్ మేనేజర్ - మార్కెటింగ్ (గార్నియర్) జీనియా బస్తాని మాట్లాడుతూ, 'ప్రపంచ అగ్రగామి నేచురల్ బ్యూటీ బ్రాండ్ గా గార్నియర్, అందరికీ అందుబాటులో ఉండే పర్యావరణ హిత అందం దిశగా జీవనం గడపడం ద్వారా ఈ భూగ్రహంపై సానుకూల ప్రభావం కలిగించేందుకు ఒక చక్కటి అవకాశా న్ని అందిస్తోంది. గ్రీన్ బ్యూటీతో మేం సౌందర్య సాధనాల పరిశ్రమ నడిచే తీరును మార్చివేయాలనుకుంటున్నాం. మీకు, ఈ భూగ్రహానికి మే లు చేకూర్చే అందాన్ని సృష్టించాలని అనుకుంటున్నాం. భారతదేశంలోని వినియోగదారులు మరింత పర్యావరణ హితంగా ఉండాలని కోరుకుంటన్నప్పటికీ, అదెలానో వారికి తెలియడం లేదని మా అంతర్జాతీయ సర్వేలో వెల్లడై న దృక్పథాలు సూచిస్తున్నాయి. జీవించడంలో హరితబాట దిశగా అడుగులు వేయాలని చాలా మంది కోరుకుంటున్నా రు. మా తాజా క్యాంపెయిన్ #OneGreenStep ద్వారా, గార్నియర్ తో తమ పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రారంభిం చడంలో సులభమైన, ప్రభావశీలక మైన మొదటి అడుగు వేసే అవకాశాన్ని మేం వినియోగదారులకు అందిస్తున్నాం` అని అన్నారు.
గత ఏడాది భారతదేశంలో ప్రారంభమైన గార్నియర్ గ్రీన్ బ్యూటీ కార్యక్రమం పర్యావరహితం దిశగా ఎండ్ టు ఎండ్ ధోరణితో కూ డుకున్నది. గార్నియర్ వాల్యూ చెయిన్లో ప్రతీ దశను పరివర్తింపజేయడం, సోర్సింగ్ లోని కీలక విభాగాల్లో పర్యావరణ ప్రభావా న్ని తగ్గించడం లేదా పూర్తిగా నిర్మూలించడం, పర్యావరణహిత, పరిశుభ్రదాయక ఫార్ములాలు, మరింతగా రీసైకిల్డ్, రీసైకి లబుల్ ప్లాస్టిక్ వినియోగం, పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం, ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా మరింతగా పోరాటం లక్ష్యం. 1989 నుంచి కూడా గార్నియర్ జంతు పరీక్షలు లేని ప్రపంచం కోసం కట్టుబడి ఉంది. లీపింగ్ బన్నీ కార్యక్రమం కింద క్రూయల్టీ ఫ్రీ ఇంటర్నేషనల్ ఆమోదం పొందడం ఆ దిశలో మరో ముందడుగు.
2025 లక్ష్యాలతో మార్గనిర్దేశనం పొందుతున్న సంస్థ బ్రాండ్ వాల్యూ చెయిన్ లో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించాలనుకుం టోంది. అందుకు అనుగుణంగానే గార్నియర్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పర్యావరణహితం దిశగా ఎండ్ టు ఎండ్ ధోరణులను కొనసాగిస్తోంది. స్థానికంగా:
గార్నియర్ గ్రీన్ వీక్ ఆన్ నైకా: పర్యావరణహిత ప్రయాణంలో భాగం కావడంలో కొనుగోలుదారులకు తోడ్పడే లక్ష్యంతో, ప్రతీ టచ్ పాయింట్ వద్ద కూడా #OneGreenStep ను మరింత ముందుకు తీసుకువెళ్లేలా, గార్నియర్ గ్రీన్ వీక్ ను క్రియేట్ చేసేందుకు నైకా తో గార్నియర్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇ-టేలర్ ప్లాట్ ఫామ్ పై ఎక్స్ క్లూజివ్ గా ఒక వేడుక చే సింది. ఈ సమయంలో గార్నియర్ కొనుగోలుదారులు తాము కొనే ప్రతీ ఉత్పాదనపై 2 ప్లాస్టిక్ బాటిల్స్ ను రీసైకిల్ చేసేం దుకు కట్టుబడి ఉండడం ద్వారా పర్యావరణ రక్షణను తిరిగి ఇచ్చే అవకాశాన్ని వారికి కల్పించింది.
గార్నియర్ ఫ్రుక్టిస్ హెయిర్ ఫుడ్: 98శాతం సహజ మూలాలు కలిగిన పదార్థాలు కలిగిన, సిలికాన్ రహిత షాంపూలు, త్రీ ఇన్ వన్ హెయిర్ మాస్క్ లు, మా పేటెంట్ సూపర్ ఫ్రూట్స్ తో శక్తివంతమై, శిరోజాలకు పోషణను, బాగుచేయడాన్ని, మృదు త్వాన్ని లేదా హైడ్రేడ్ ను అందించేందుకు పోషకాలతో శక్తివంతమైంది.
గార్నియర్ మిసెల్లర్ రీయూజబుల్ ఎకో ప్యాడ్స్: అల్ట్రా సాఫ్ట్, డ్రై మేకప్ రిమూవల్ ప్యాడ్స్. ఒక ‘ఎకోప్యాడ్’ 1000 ఉతుకుల దాకా నిలుస్తుంది, తద్వారా కాటన్ ప్యాడ్స్ వృథాను ఆదా చేస్తుంది.