Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే నెల మార్చి ముగింపు నాటికి ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలను విక్రయించనున్నట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) సెక్రటరీ తూహిన్ కాంత పాండే తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 49.24 శాతం, కేంద్ర ప్రభుత్వానికి మరో 45.48 శాతం చొప్పున వాటాలుండగా.. మరో 5.29 శాతం వాటా నాన్ ప్రమోటర్లకు వాటాలున్నాయి. ఈ సంస్థలోని ప్రభుత్వ, ఎల్‌ఐసీ వాటాల విక్రయం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో సంప్రదింపులు చేస్తున్నామని పాండే తెలిపారు.