Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రీమియం స్మార్ట్‌ఫుడ్ కోర్ట్, కో-లివింగ్ బ్రాండ్ ఇస్తారా తమ అవుట్‌లెట్లను 40కి విస్తరించినట్టు ప్రకటించింది. తమ నూతన స్మార్ట్ ఫుడ్ కోర్ట్‌ను ఐఐటి హైదరాబాద్‌లోని టెక్నాలజీ రీసెర్చ్ పార్క్ వద్ద ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. దీనిని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) శాఖ సెక్రటరీ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ ప్రారంభించారని తెలిపింది. దీంతో తమ స్మార్ట్ ఫుడ్ కోర్ట్స్ సీట్ల సంఖ్యను దేశంలో 10000కు చేర్చుకున్నట్లయ్యిందని పేర్కొంది. రాబోయే మూడేళ్లలో ఇస్తారా తమ సీట్ల సంఖ్యను 1,50,000కు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.