Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 7న ప్రారంభం కావాల్సిన ఈ సమావేశాలు ప్రముఖ గాయనీ లతా మంగేష్కర్ మృతితో మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు దినం ప్రకటించింది. దీంతో ఒక్క రోజు వాయిదా పడింది. ఈ భేటీలో ప్రధానంగా 2022-23 బడ్జెట్, దేశంలో పెరుగుతున్న ధరలపై చర్చ జరగనుంది. ద్రవ్యోల్బణం ఆధారంగానే వడ్డీ రేట్లలో మార్పులు చేసే అవకాశం ఉంది. సమీక్షా నిర్ణయాలను ఈ నెల 10న ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించనున్నారు. కాగా.. వడ్డీ రేట్లు యథాతథంగానే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.