Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారతీయ కంపెనీల బోర్డుల్లో 2021 నాటికి 17.1 శాతం మంది మహిళలు ఉన్నట్లు కన్సల్టింగ్ అండ్ ఆడిటింగ్ కంపెనీ డెలాయిట్ ఇండియా వెల్లడించింది. 2018 ముగింపు నాటికి ఈ సంఖ్య 17.1 శాతంగా ఉంది. కంపెనీల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా 4.7 శాతం, చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్లుగా 3.9 శాతం చొప్పున ఉన్నారని తెలిపింది. కాగా.. ఇటీవలి కాలంలో సంఖ్యా పరంగా మహిళ చైర్‌పర్సన్ల సంఖ్య తగ్గినట్లు పేర్కొంది. 2018లో ఈ సంఖ్య 4.5 శాతంగా ఉండగా.. 2021 నాటికి 3.6 శాతానికి పరిమితమయ్యారని వెల్లడించింది.