Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గురుగ్రామ్ : గృహోపకరణాలు మరియు బిల్డింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ సోమానీ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐఎల్) డిసెంబర్ 31,2021తో ముగిసిన మూడో త్రైమాసం కోసం ఆర్ధిక ఫలితాలను నేడు విడుదల చేసింది. గత సంవత్సరం 517 కోట్ల రూపాయల కార్యకలాపాలను మూడో త్రైమాసంలో నిర్వహించగా ఈ ఆర్ధిక సంవత్సరం అదే కాలంలో 649 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించడంతో పాటుగా 26% వృద్ధిని నమోదుచేసింది. ఇయర్ ఆన్ ఇయర్ ఎబిట్డా 6% వృద్ధి చెందగా ఈ త్రైమాసంలో పీబీటీ 5% వృద్ధి చెందింది. కంపెనీ ప్రదర్శన గురించి సోమానీ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ ఛైర్మన్ సందీప్ సోమానీ మాట్లాడుతూ 2022 ఆర్ధిక సంవత్సర మూడవ త్రైమాసంలో కంపెనీ కన్సాలిడేటెడ్ పద్ధతిలో ప్రోత్సాహకరమైన వృద్ధిని నమోదుచేసిందన్నారు. తమ బిల్డింగ్ ప్రోడక్ట్స్ విభాగం పరిశ్రమలో అత్యున్నత ప్రదర్శన అందించేందుకు తోడ్పడిందంటూ ఈ త్రైమాసంలో గృహోపకరణాల వ్యాపారం ప్రభావితమైనప్పటికీ లాభదాయకతపై ఆ ప్రభావం తాత్కాలికమేనని భావిస్తున్నామన్నారు.