Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది జనవరిలో భారత ఎగుమతులు 25.28 శాతం పెరిగి 34.50 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, పెట్రోలియం, రత్నాలు, అభరణాల రంగాలు ఎగుమతులకు ప్రధాన మద్దతును అందించాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. మరోవైపు దిగుమతులు 23.54 శాతం పెరిగి 51.93 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. ఎగుమతులు తక్కువగా ఉండి.. దిగుమతులు ఎక్కువగా ఉండటంతో జనవరి మాసంలో భారత వాణిజ్య లోటు 17.43 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2021 ఇదే మాసంలో 14.49 బిలియన్ డాలర్ల లోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి కాలంలో ఎగుమతులు 46.73 శాతం పెరిగి 335.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో 228.92 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. గడిచిన పది మాసాల కాలంలో 62.65 శాతం ఎగిసి 495.75 బిలియన్లకు చేరాయి. దీంతో ఈ కాలంలో వాణిజ్య లోటు 159.87 బిలియన్లుగా నమోదయ్యింది.