Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: “బీఎస్‌హెచ్‌లో మేము మా వినియోగదారుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఆలోచనాత్మకంగా అభివృద్ధిపరిచిన నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తామని గర్విస్తాము. నాణ్యతపై దృష్టి అన్నది మా అనుబంధ ఉత్పత్తుల్లోనూ ప్రధానంగా ఉంటుంది. ఇటీవల జరిగిన ఒక సంఘటనలో హైదరాబాద్‌లోని ఒక సంస్థ కొన్ని ఈ-కామర్స్ పోర్టల్స్ ద్వారా 'డిస్కేలర్' అనే మా అనుబంధ ఉత్పత్తులలో ఒకదాని నకిలీవి ప్యాకేజింగ్, షిప్పింగ్ చేస్తూ ఐపీ ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయాన్ని మేము గుర్తించాము. స్థానిక అధికారులు, తెలంగాణ పోలీసుల సాయంతో అలాంటి ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై మేము రికార్డు సమయంలో కఠిన చర్యలు తీసుకోగలిగాము. ప్రపంచంలో ఎక్కడా కూడా మా ఉత్పత్తులు, బ్రాండ్ల (బాష్, సీమెన్స్, గాగెన్యూ) ప్రామాణికత దెబ్బతినకుండా చూసేందుకు మా బృందాలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేదికలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. మీరు కొనుగోలు చేయడానికి ముందు ఆన్‌లైన్ పోర్టల్స్, డీలర్స్ దగ్గర మా గుర్తును పరిశీలించాల్సిందిగా మా కస్టమర్లందరినీ కోరుతున్నాం. మాపై, మా ఉత్పత్తులపై విశ్వాసం చూపుతున్నందుకు మా కస్టమర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.