Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్‌లో ఆవిష్కరించిన నాలుగేండ్లలోనే దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు అమెజాన్ అలెక్సా వాయిస్ సేవలను పొందుతున్నారని ఆ సంస్థ తెలిపింది. మెట్రోయేతర నగరాలైన వైజాగ్, కష్ణా, గుంటూరు నుంచి దాదాపు 50 శాతానికి పైగా వినియోగదారులు అలెక్సాకు చేసిన అభ్యర్థనలు 2020తో పోలిస్తే 2021లో ఏకంగా 68 శాతం పెరిగాయని తెలిపింది. దేశంలోని వినియోగదారులకు అలెక్సాను మరింత ఉపయుక్తంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు మేము నిరంతరం శ్రమిస్తూనే ఉన్నామని అమెజాన్ ఇండియా అలెక్సా కంట్రీ లీడర్ పునీష్ కుమార్ తెలిపారు.