Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడిన ఆ సంస్థ మాజీ సీఈఓ, ఎండీ చిత్రా రామకష్ణపై సీబీఐ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు సంస్థ మరో మాజీ సీఈఓ రవి నారాయణ్, మాజీ సీఓఓ ఆనంద్ సుబ్రమణ్యం దేశం విడిచి వెళ్లకుండా నోటీసులు ఇచ్చారు. 2013 నుంచి 2016 మధ్య కాలంలో ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా చిత్ర పనిచేశారు.
ఆ సమయంలో సంస్థ నియమావళి ఉల్లఘించి హిమాలయాల్లో నివసించే ఓ యోగితో స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంబంధించిన కీలకమైన ఆర్థిక సమాచారాన్ని పంచుకున్నారని సెబీ దర్యాప్తులో తేలింది. పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై గురువారం ఐటి అధికారులు దాడులు చేశారు. ఎన్‌ఎస్‌ఈ చీఫ్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణ్యం నియామకం, ఆ వెంటనే పదోన్నతులు తదితర అంశాలపై చిత్రా రామకష్ణను సీబీఐ ప్రశ్నించిందని సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి కుట్రకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మరి కొందరినీ సీబీఐ ప్రశ్నించనుందని తెలుస్తోంది.