Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో సుప్రసిద్ధ సువాసన (ఫ్రాగ్రాన్స్) బ్రాండ్‌లలో ఒకటైన ఐటీసీ ఎంగేజ్ తమ తాజా ట్రెండ్ సెట్టింగ్ ఆవిష్కరణ – ఎంగేజ్ లామాంటే క్లిక్ అండ్ బ్రష్ పెర్‌ఫ్యూమ్ పెన్‌ను మహిళల కోసం విడుదల చేసింది. మనందరికీ తెలిసిన పెర్‌ఫ్యూమ్‌లాగా కనిపించనటువంటి రీతిలో రూపొందించబడిన సరికొత్త పెర్‌ఫ్యూమ్ పెయింట్ బ్రష్ ఇది. ఉల్లాసభరితమైన బంధం మరియు రొమాన్స్‌కు సుప్రసిద్ధమైన బ్రాండ్, ఈ విభాగాపు సున్నితత్త్వం మరియు వినియోగం యొక్క ఆచరణాత్మకతను మిళితం చేసే వినూత్నమైన డిజైన్ నేపథ్యాన్ని సజీవంగా తీసుకువస్తుంది. క్లిక్ అండ్ బ్రష్ విధానం ఏ సమయంలో అయినా, ఎక్కడైనా పెర్‌ఫ్యూమింగ్‌ను సులభతరం చేస్తుంది మరియు దీని మృదువైన, ఖచ్చితత్త్వంతో కూడిన బ్రష్ అప్లికేటర్ , పెర్‌ఫ్యూమ్ స్ర్పే చేయడంలో మీకు తెలిసిన విధానాన్ని పునరాలోలించేలా చేస్తుంది. ఇంటికి వెలుపల వినియోగించేటప్పుడు ఆభరణాలు మరియు వస్త్రాలపై చిందడం అనివార్యం అనే నేపథ్యం నుంచి విభిన్నంగా ఈ డిజైన్ ఆకృతి రూపుదిద్దుకుంది. క్లిక్ అండ్ బ్రష్ పెర్‌ఫ్యూమ్ పెనిన్ క్లాసీ గోల్డ్, అతి సన్నగా ఉండటంతో పాటుగా ఆకర్షణీయంగా మరియు అతి సులభంగా తీసుకువెళ్లతగిన యాక్ససరీగా ఉంటుంది. రోజంతా కూడా సువాసనల స్పర్శకు ఇది అత్యంత అనుకూలమైనది. సౌకర్యవంతమైనప్పటికీ ఆకర్షణీయంగా ఉండే ఈ జెల్ ఆధారిత పెర్‌ఫ్యూమ్ పెన్, మహిళలు నేరుగా తమకు కావాల్సిన ప్రాంతాలలో మాత్రమే వినియోగించే అవకాశం అందిస్తుంది. అదే సమయంలో వస్త్రాలు లేదంటే ఆభరణాలపై ఈ సువాసనలు వెదజల్లుతాయనే ఇబ్బందినీ కలిగించదు. ఇది ప్రయాణ సమయాలలో కూడా అనుకూలమైన నూతన పెర్‌ఫ్యూమింగ్ భాషను పరిచయం చేస్తుంది. ఈ సువాసనలు తాజాగా, ఆహ్లాదకరమైన రీతిలో ఉంటాయి. తహితి స్ఫూర్తితో ఇది రూపొందించబడింది. ప్రేమ యొక్క సంతోషకరమైన భావనలను వెలికితీయడానికి తీరం వెంబడి కొట్టుకువచ్చిన తెల్లటి మానులను గుర్తుకుతెస్తుంది. ప్రతి మహిళా విభిన్నమైన స్టైల్ స్ట్రోక్స్‌ను రూపొందించే స్వేచ్ఛ కలిగిన ఓ కళాకారిణి అనే ఆలోచన స్ఫూర్తితో తీర్చిదిద్దబడిన ఈ వినూత్నమైన, కళాత్మక పెర్‌ఫ్యూమ్, మిల్లీనియల్ మహిళల యొక్క విభిన్నమైన శైలి మరియు వస్త్రధారణ అవసరాలను తీర్చే రీతిలో ఉంటుంది. దీనిని వినియోగించడం అత్యంత సులభం మరియు సౌకర్యం. దీనిని మణికట్టు, మెడ లేదా చెవుల వెనుక వినియోగించవచ్చు. దీనిలో బెర్గామోట్, ఫ్రాంగిపాణిలు టాప్ నోట్స్‌గా ఉండటంతో పాటుగా బెర్రీలు మరియు నల్లద్రాక్ష యొక్క ఆహ్లాదకరమైన సువాసనలను ఈ ఫ్రాగ్నాన్స్‌లో కలిగి ఉంది. అసలు వదలలేనట్టి యింగ్–యాంగ్ నోట్స్‌కు చందనపు సువాసనలు సైతం జోడించడం వల్ల ఈ ఫ్రాగ్నాన్స్ ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఆవిష్కరణ గురించి ఐటీసీ లిమిటెడ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్, డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమీర్ సంపతి మాట్లాడుతూ ‘‘ప్రారంభించిన నాటి నుంచి ఎంగేజ్ స్థిరంగా హద్దులను అధిగమిస్తూనే ఉండటంతో పాటుగా ఫ్రాగ్నాన్స్ విభాగాన్ని సృజనాత్మక ఫార్మాట్, కమ్యూనికేషన్, ఫ్రాగ్నాన్స్‌లతో పునరావిష్కరిస్తుంది. విషయ పరిజ్ఞాన ఆధారిత డిజైన్ ఆలోచనలు ఈ ఆహ్లాదకరమైన క్లిక్ అండ్ బ్రష్ ఫార్మాట్‌లో అత్యంత కీలకంగా ఉండటంతో పాటుగా కేవలం నూతన ధోరణులు రూపొందించే స్టైల్ స్టేట్‌మెంట్‌గా మాత్రమే కాదు వినియోగించడానికి అనుకూలంగా మరియు తీసుకువెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. ఈ వినూత్నమైన పెర్‌ఫ్యూమ్ పెన్ ఈ విభాగాన్ని నిర్వచించే రీతిలో ప్రయాణ సమయంలో సైతం వినియోగం మరియు వాంఛనీయత కోరుకునే వినియోగదారుల అవసరాలను తీర్చే రీతిలో ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు ఫ్రాగ్నాన్స్‌లను మహిళలు వినియోగించే తీరు మార్చడంతో పాటుగా వినోదాత్మకంగా మరియు ఆకర్షణీయంగా ఉండే రీతిలో ఈ ఆవిష్కరణ ఉంటుంది’’ అని అన్నారు. ఎంగేజ్ బ్రాండ్ అంబాసిడర్ తారా సుతారియా మాట్లాడుతూ ‘‘ నాకు ఫ్రాగ్రాన్స్‌లంటే చాలా ఇష్టం. కానీ నా అభిమాన పెర్‌ఫ్యూమ్‌ను ప్రతి సారీ వెంట తీసుకుని వెళ్లడం వీలుకాదు. ఎంగేజ్ లామాంటే క్లిక్ అండ్ బ్రష్ పెర్‌ఫ్యూమ్ పెన్‌ను ప్రయత్నించండి ! మీ అభిమాన సెంట్‌ను ఎక్కడైనా, ఎప్పుడైనా వినియోగించడానికి మీ హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకోండి !’’అని అన్నారు.
ఎంగేజ్ లామాంటే క్లిక్ అండ్ బ్రష్ పెన్స్ ప్రత్యేకంగా నైకా మరియు ఐటీసీ ఈ–స్టోర్‌ల వద్ద 1299రూపాయల ధరలో లభ్యమవుతాయి.