Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021లో ఒక కోటి రూపాయలకు పైగా అమ్మకాల మార్కును అధిగమించిన 625 మంది విక్రేతలు
100 మిలియన్‌లకు పైగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, 130 మిలియన్‌లకు పైగా లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు, 30 మిలియన్‌లకు పైగా జనరల్ మర్చండైజ్ ఉత్పత్తులు, 20 లక్షల టన్నుల నిత్యావసరాలను ఉడాన్ వేదికపై విక్రయించారు
నిత్యావసరాల వ్యాపారం 30 శాతానికి పైగా వృద్ధి చెందితే, ఎఫ్‌ఎంసీజీ విభాగం 77శాతం వృద్ధి చెందింది
2021లో ఐదు లక్షలకు పైగా రిటైలరు-కిరాణా షాప యజమానులు చేరారు
హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ - టు- బిజినెస్ (బీ2బీ) ఈ - కామర్స్ వేదిక ఉడాన్ నేడు తాము 20 లక్షల టన్నులకు పైగా నిత్యావసరాలు (తాజా, ఎఫ్‌ఎంసీజీ, స్టాపెల్స్ , ఫార్మా) మరియు 260 మిలియన్ టన్నుల నిత్యావసరేతర (ఎలకా్ట్రనిక్స్, జనరల్ మర్చండైజ్, లైఫ్ స్టైల్) వస్తువులను భారత్ వ్యాప్తంగా 1000 పట్టణాలు, నగరాల నుంచి వచ్చిన 50 మిలియన్ ఆర్డర్లను చేరవేయడంలో భాగంగా తరలించింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై 2021లో 5 లక్షల మంది నూతన రిటైలర్లు/కిరాణా యజమానులు చేరారు. ఇదే కాలంలో దాదాపు 625 మంది విక్రేతలు ఒక్కొక్కరూ కోటి రూపాయలకు పైగా అమ్మకాల మార్కును అధిగమించారు.
ఈ సందర్భంగా ఉడాన్ కో- ఫౌండర్ మరియు సీఈఓ వైభవ్ గుప్తా మాట్లాడుతూ' భారతదేశంతో సహా ప్రపంచమంతా కూడా మహమ్మారి రెండు, మూడవ వేవ్‌ల కారణంగా ప్రభావితమైంది. ఇలాంటి పరిస్ధితులలో కూడా ఆర్థిక చక్రం ఆగకుండా ముందుకు సాగడంలో అత్యంత కీలక పాత్రను ఈ-కామర్స్ మార్గంలో ఉడాన్ పోషించింది. గత ఐదు సంవత్సరాలుగా మేము తీర్చిదిద్దుకున్న సామర్థ్యాలు , శక్తివంతమైన పంపిణీ నెట్‌వర్క్, సమర్థవంతమైన సరఫరా చైన్, శక్తివంతమైన సోర్సింగ్, అత్యాధునిక సాంకేతిక వేదికలు వంటివి ఉడాన్‌కు కీలకమైన డిఫరెన్షియేటర్లుగా మారాయి. ఈ ప్లాట్‌ఫామ్‌కు లక్షలాది నూతన రిటైలర్లు, కిరాణా షాపులు జోడించబడటం వల్ల అత్యధిక స్థాయిలో రిపీట్ రేట్ సాధ్యమవుతుంది. తమ వ్యాపార భాగస్వాములకు ధరల పరంగా అధిక ప్రయోజనాలు, సులభంగా వ్యాపారం నిర్వహించుకునే అవకాశం అందిస్తుంది` అని అన్నారు.