Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూనె: హోమ్ అప్లయెన్సెస్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ విభాగంలో అంతర్జాతీయంగా సుపరిచితం కావడంతో పాటుగా మేజర్ అప్లయెన్సెస్ లో ప్రపంచంలో నెంబర్ 1 బ్రాండ్‌గా వరుసగా 13 ఏండ్లుగా వెలుగొందుతున్న హైయర్ నేడు తమ నూతన ఫ్యాక్టరీని డీప్ ఫ్రీజర్ తయారీ కోసం రంజన్‌గావ్, పూనె వద్ద నున్న తమ తొలి పారిశ్రామిక పార్క్‌లో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ అభివృద్ధితో హైయర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి తమ నిబద్ధతను వెల్లడించడంతో పాటుగా స్థానిక తయారీ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు తమ ప్రయత్నాలను సైతం వెల్లడించింది, భారతీయ వినియోగదారుల అవసరాలకనుగుణంగా ప్రీమియం, అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయనున్నారు.
అదనంగా ఈ పెట్టుబడులు భారతదేశంలో హైయర్ యొక్క స్థానాన్ని బలోపేతం చేయడంతో పాటుగా డీప్‌ఫ్రీజర్ ఉత్పత్తుల తయారీ సామర్థ్యం అత్యున్నత నాణ్యత కలిగిన 5 లక్షల యూనిట్లకు మెరుగుపరిచేందుకు సైతం తోడ్పడనుంది. హైయర్ ఇప్పుడు తమ ప్రీమియం ఉత్పత్తులను భారతదేశంలో స్థానికంగా తయారు చేయడం ద్వారా విస్తరించనుంది. ఈ నూతన డీప్ ఫ్రీజర్ ఫ్యాక్టరీ ఇప్పుడు స్థానిక మార్కెట్‌లో మారుతున్న అవసరాలకనుగుణంగా ఉత్పత్తుల తయారీ కోసం బ్రాండ్‌కు సహాయపడుతుంది. ఈ విస్తరణ , అత్యుత్తమ వ్యాపార భాగస్వామ్యాలకు బహిరంగ అవకాశాలను తెరువడంతో పాటుగా స్థానికంగా ఉత్పత్తిని పెంచడంతో పాటుగా అతి తక్కువగా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ వృద్ధిని వేగవంతం చేయనుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, హైయర్ నాలుగు నూతన ఎస్‌కెయులను వాణిజ్య ఫ్రీజర్ విభాగంలో విడుదల చేసింది. అవి హెచ్‌ఎఫ్‌సీ–350డీఎం5, హెచ్‌ఎఫ్‌సీ–588డీఎం5– హార్డ్ టాప్ మోడల్స్, హెచ్‌ఎఫ్‌సీ–300జీఎం5, హెచ్‌ఎఫ్‌సీ–400జీఎం5–ఫ్లాట్ గ్లాస్ టాప్ మోడల్స్‌ను విడుదల చేసింది. ఇవి5 స్టార్ రేటింగ్‌తో రావడంతో పాటుగా 50% వరకూ విద్యుత్ ఆదా చేస్తాయి. ఇవి మెరుగైన కూలింగ్ సామర్థ్యం కోసం 5 సైడ్ ఫ్రీజింగ్ సైతం కలిగి ఉంటాయి. హైయర్ గ్రూప్ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఓ అవగాహన ఒప్పందం 2015లో చేసుకుంది. దీనిద్వారా భారతదేశంలో తమ తొలి పారిశ్రామిక ఏర్పాటు కోసం 600కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. దీనిని 2017లో ప్రారంభించారు. భారత ప్రభుత్వ మేక్ ఇన్‌ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా హైయర్ , ఇప్పుడు గణనీయంగా పూనె పారిశ్రామిక పార్కును ప్రపంచశ్రేణి, అత్యున్నత నాణ్యత కలిగిన గృహోపకరణాలు మరియు కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్‌ను అన్ని ప్రధానమైన విభాగాలలోనూ అందించేందుకు కేంద్రంగా నిలుపుతుంది. అంతేకాదు, ఈ కంపెనీ స్థిరంగా తమ దృష్టిని పరిశోధన మరియు అభివృద్దిపై కేంద్రీకరించడంతో పాటుగా ఆవిష్కరణలను వృద్ది చేసి ఉత్పత్తి పరంగా శ్రేష్టతను దేశంలో తీసుకువస్తుంది. తద్వారా బ్రాండ్ సిద్ధాంతమైన ఇన్‌స్పైర్డ్ లివింగ్‌ను ప్రదర్శిస్తుంది.
ఈ సందర్భంగా హైయర్ హోమ్ అప్లయెన్సెస్ లిమిటెడ్ అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ ‘‘ఇది మా అందరికీ గర్వకారణమైన క్షణం. పూనెలో మా పారిశ్రామిక పార్క్‌ను నూతన డీప్ ఫ్రీజర్ ఫ్యాక్టరీతో విస్తరించాము. ఇది స్థానిక తయారీని వేగవంతం చేయడంతో పాటుగా వాణిజ్య, హోమ్ ఫ్రీజర్ విభాగాలలో మా సామర్థ్యం వెల్లడిస్తుంది. ఈ ఫ్యాక్టరీ ప్రారంభంతో మా ఉత్పత్తి సామర్ధ్యం గణనీయంగా పెరగడం మాత్రమే కాదు భారతీయ మార్కెట్ కోసం అతి తక్కువ సమయంలో అనుకూలీకరణ పరిష్కారాలను సృష్టించడం వీలవుతుంది. ఈ అభివృద్ధి కారణంగా దిగుమతులపై ఆధారపడటం తగ్గించడంతో పాటుగా అదే సమయంలో భారతదేశం నుంచి మా ఎగుమతులు సైతం వృద్ధి చేయనున్నాం’’అని అన్నారు.
భారతదేశంలో డీప్ ఫ్రీజర్స్ కు తోడ్పాటునందించనున్న హైయర్ ఇండియా ఆధునిక గృహోపకరణాలు మరియు వినియోగదారు డ్యూరబల్స్ కోసం పెరిగిన డిమాండ్‌కు ప్రతిస్పందనగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల జీవనశైలికి అనుగుణంగా, డీప్ ఫ్రీజర్స్ విభాగంలో డీప్ ఫ్రీజర్స్ విభాగంలో హైయర్ ఇండియా విప్లవాత్మక మార్పులకు హైయర్ ఇండియా నాంది పలికింది.
డీప్ ఫ్రీజర్ ఉత్పత్తులలో హైయర్ పరిష్కారాలు:
· ఇంధన సామర్థ్యం కలిగిన గృహోపకరణాల తయారీకి కట్టుబడిన హైయర్, స్థానికంగా తయారుచేసే ఫ్రీజర్లు అన్నింటికీ 5 స్టార్ రేటింగ్‌ను అందిస్తుంది
· 5 సైడ్ ఫ్రీజింగ్ రెండు రెట్ల ఫ్రీజింగ్/చిల్లింగ్ సామర్థ్యం కారణంగా 50% వరకూ పుల్ డౌన్ టైమ్ తగ్గుతుంది
· డీఫ్రాస్టింగ్ సమయంలో కూలింగ్/ఎవాపరేటర్ కాయిల్‌కు నష్టనివారణ కోసం లోపల మెటల్ లైన్
· మూడు లేయర్డ్ డోర్, 70మిల్లీ మీటర్ల పీయుఎఫ్ ఇన్సులేషన్ కారణంగా 100 గంటల కూలింగ్ నిలుపుదల
భారతదేశ కేంద్రీకృతంగా వినూత్నమైన ఉత్పత్తులను స్థిరంగా పరిచయం చేయడానికి హైయర్ యొక్క నిబద్ధత, దాని వినియోగదారులకు నాణ్యమైన వాగ్ధానాన్ని అందించడం బ్రాండ్ యొక్క నిరంతర వృద్ధి మరియు విజయానికి అసలైన నిదర్శనం. ఇటీవలి కాలంలో, కంపెనీ తమ విస్తృతమైన పంపిణీ, అమ్మకాల తరువాత నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు గణనీయమైన పెట్టుబడులు పెట్టింది.