Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : రష్యా, ఉక్రెయిన్ యద్ధ భయాలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లు జరిగాయి. సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 389 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 56,247.28కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 136 పాయింట్లు లాభపడి 16,793.90 వద్ద ముగిసింది. నిఫ్టీలో హిందాల్కో ఇండిస్టీస్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, బిపిసిఎల్ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.8 శాతం చొప్పున రాణించాయి.