Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రో, డీజిల్‌పై వ్యయాన్ని తగ్గించుకున్నాం : లోకల్ సర్కిల్స్ సర్వేలో 42 శాతం కుటుంబాల వెల్లడి
న్యూఢిల్లీ : ఇంధన ధరల పెంపును భరించలేకపోతున్నామని అనేక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తాము పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకున్నట్లు 42 శాతం కుటుంబాలు లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడించాయి. మరోమారు ప్రభుత్వాలు ఎక్కడ పెంచుతారనే భయాల్లో ఉన్నట్లు తెలిపాయి. దేశ వ్యాప్తంగా 361 జిల్లాలోని 27,000 మంది ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేలో సేకరించింది. ఇందులో 66 శాతం మంది పురుషులు, 34 శాతం శాతం మంది మహిళలు ఉన్నారు. ఆ వివరాలు.. 2022లో ప్రతీ ఇద్దరిలో ఒక్కరు తమ పొదుపు సామర్థ్యం తగ్గిందన్నారు. కరోనా సంక్షోభానికి తోడు చమురు, కమోడిటీ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం ఎగిసిపడటమే కారణమని తెలిపారు.స్వల్ప కాలంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధరలను తాము భరించలేకపోతున్నామని.. వీటి వాడకం, వ్యయాన్ని తగ్గించుకోనున్నామన్నారు. పెట్రో, డీజిల్ ఉత్పత్తులపై ప్రభుత్వం వేస్తున్న పన్నులను తగ్గించుకోవాలని కోరారు. దేశంలో 2021 ముగింపు నాటికి ఇంధన ధరలు రికార్డ్ స్థాయిలను ఎగిశాయి. అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.100-110కి చేరింది. డీజిల్ ధర కూడా రూ.90-100 మధ్య పలికింది.