Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ప్రయివేటు విద్యా సంస్థ శ్రీచైతన్య తన బ్రాండ్ అంబాసీడర్‌గా అల్లు అర్జున్‌ను నియమించుకున్నట్టు ప్రకటించింది. తమ బలమైన స్థావరం, ఉనికిని మరింత పెంచుకోవడానికి ఈ నిర్ణయం దోహదం చేయనుందని ఆ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. పుష్ప సినిమాలోని 'తగ్గేదే లే' ప్రేరణతో ప్రచారాన్ని నిర్వహించనున్నట్టు శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్‌ట్యూట్ అకాడమిక్ డైరెక్టర్ సుష్మా బొప్పిన పేర్కొన్నారు. తమ సంస్థను కొత్త మైలురాళ్లకు తీసుకెళ్లడంలో అల్లు అర్జున్ సమగ్ర పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నామన్నారు.