Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : బెడ్డింగ్ విభాగం అవసరాలను తీర్చేందుకు బిర్లా సెంచురీ హోమ్ డివిజన్ కొత్తగా 'హిల్ అండ్ గ్లేడ్'ను ఆవిష్కరించినట్లు తెలిపింది. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా రంగులు, నాణ్యతలో ఎన్నో ఎంపికలను ఇది అందించనుందని ఆ కంపెనీ సీనియర్ ప్రెసిడెంట్ ఆర్‌కె దాల్మియా పేర్కొన్నారు. వివిధ రంగుల్లో అందరినీ ఆకట్టుకునేలా 250 డిజైన్లను అందుబాటులోకి తెచ్చామన్నారు.
మహిళా రుణ గ్రహీతల్లో 19 శాతం వృద్థి
న్యూఢిల్లీ : గడిచిన ఐదేళ్లలో మహిళ రుణ గ్రహీతల సంఖ్య భారీగా పెరిగినట్లు సిబిల్ డేటా వెల్లడించింది. 2016-2021 మధ్య కాలంలో ప్రతీ ఏడాది సగటున 19 శాతం వృద్థి చోటు చేసుకుంది. ఇంతక్రితం కాలంలో ఇది 14 శాతంగా ఉందని సిబిల్ పేర్కొంది. 2021లో ఏకంగా 29 శాతం పెరుగుదల నమోదయ్యిందని తెలిపింది. దేశంలో 43.5 కోట్ల మంది మహిళల్లో కేవలం 5.4 కోట్ల మంది మాత్రమే రుణ గ్రహీతలుగా ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందని సిబిల్ పేర్కొంది.
పసిడిపై 69 శాతం ఆసక్తి..
దేశంలో 69 శాతం మంది మహిళలు బంగారం, ఈక్విటీ స్టాక్‌ల్లో పెట్టుబడులకు ఆసక్తిని కనబర్చుతున్నారని రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ నో బ్రోకర్ పేర్కొంది. అదే విధంగా లగ్జరీ ఫ్యాషన్ల వ్యయానికి ఇష్టపడుతున్నారని పేర్కొంది. దాదాపు 94 శాతం మంది సొంత గృహాలపై, 6 శాతం మంది వాణిజ్య ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడయ్యింది.