Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రీమియం కార్ల తయారీ కంపెనీ వోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లోకి సెడాన్ విభాగంలో వర్ట్చుస్‌ను విడుదల చేసింది. ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద దీన్ని తీర్చిదిద్దినట్టు తెలిపింది. 1.5 లీటర్ టీఎస్‌ఐ ఇవో ఇంజిన్‌తో అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. ఇందులో 1.0 లీటర్ టీఎస్‌ఐ ఇంజిన్ వర్షన్‌ను కూడా ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు 151 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. ఈ నూతన వర్ట్యుస్‌లో పలు సాంకేతిక, వినోద, కనెక్టివిటీ ఫీచర్లున్నాయని తెలిపింది. కాగా దీని ధరను ఆ కంపెనీ ప్రకటించలేదు.