Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రెడ్‌మినోట్‌ సిరీస్‌లో సరికొత్త ప్రొ- రెడ్‌మి నోట్‌11ప్రో+ 5జీ, రెడ్‌మి నోట్‌ 11ప్రొ విడుదల | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 10,2022

రెడ్‌మినోట్‌ సిరీస్‌లో సరికొత్త ప్రొ- రెడ్‌మి నోట్‌11ప్రో+ 5జీ, రెడ్‌మి నోట్‌ 11ప్రొ విడుదల

హైదరాబాద్:  భారతదేశపు నెంబర్‌ స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్‌ షామికి చెందిన సబ్‌ బ్రాండ్ రెడ్‌మి ఇండియా, తన బెస్ట్‌ సెల్లింగ్‌ రెడ్‌మి నోట్‌ సిరీస్‌ను ప్రొ లెవల్‌కు తీసుకెళ్లింది. తాజాగా రెడ్‌మి నోట్‌ 11 ప్రొ+5జీ, రెడ్‌మి నోట్‌ 11 ప్రొ విడుదల చేసింది. అంతే కాకుండా తన రెండో స్మార్ట్‌ వాచ్‌ రెడ్‌మి వాచ్‌ 2 లైట్‌ కూడా విడుదల చేస్తున్నట్టు నేడు ప్రకటించింది. 2014 నుండి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్ సిరీస్‌లో సరికొత్తదైన రెడ్‌మి నోట్ 11 ప్రో సిరీస్ ఐకానిక్ రెడ్‌మి నోట్‌  డిజైన్, కెమెరా సిస్టమ్, ఛార్జింగ్ టెక్నాలజీ, పనితీరు సహా అన్ని విభాగాలను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్లింది. ఇది ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు ఆకాంక్షల మధ్య సమతుల్యత పాటిస్తూ కూడా, అత్యంత సరసమైన ధరలలో ప్రపంచ స్థాయి పనితీరు అందించాలనే రెడ్‌మి నోట్ సిరీస్ ప్రధాన విలువలకు కట్టుబడి ఉంటుంది.

4జీ, 5జీ ప్రపంచాలకు ప్రొ-లెవల్‌ పనితీరు
రెడ్‌మి నోట్‌ 11 ప్రొ+ 5G ప్రొ లెవల్‌ పనితీరు సుగుణాలు అన్నింటితో పాటు భవిష్యత్‌కు కావాల్సిన హై స్పీడ్ 5జీ కనెక్టివిటీతో మిళితమై ఉంది.  4జీ జోన్‌లో సరసమైన ధరతో గొప్ప పనితీరు కోరుకునే వారికి బెస్ట్-ఇన్-క్లాస్ స్పెక్స్‌గా నిలుస్తుంది. రెడ్‌మి నోట్‌ 11 ప్రొ.
రెడ్‌మి నోట్‌ 11 ప్రొ సిరీస్‌లో 4జీతో పాటు 5జీ రకాన్ని విడుదల చేయడాన్ని వివరిస్తూ భవిష్యత్‌లో ఉండేది 5G కనెక్టివిటీ, దాన్ని అందుకోవడానికి మేము పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. కాని, అది 4జీ స్థానాన్ని భర్తీ చేయదని, దానితో కలిసి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. వాస్తవానికి, 5జీ విడుదలైన తర్వాత కూడా రానున్న కొన్ని సంవత్సరాల వరకు 4జీ కొనసాగుతుంది. దానిని ఉపయోగించే వారికి ఉపయుక్తంగా నిలుస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి” షామి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణన్.బి అన్నారు. "సాంకేతికతను ప్రత్యేకమైనదిగా కాకుండా అందరి అందుబాటులో ఉండేలా చూడాలని రెడ్‌మిలో మేము విశ్వసిస్తాం. అందుకే పనితీరుపరంగా రెండు నోట్ ప్రొ డివైసులు అభివృద్ధి చేయాలని మేము నిర్ణయించాం. రెడ్‌మి నోట్‌ 11 ప్రొ+ 5జీ- అత్యాధునిక సాంకేతికతతో పాటు భవిష్యత్‌ టెక్నాలజీని సపోర్టు చేయగల అత్యంత ప్రజాదరణ కలిగిన 5జీ బ్రాండ్లలో ఏడింటికి అందించేలా మేము తయారు చేసిన అత్యుత్తమ నోట్‌ను చూపుతుంది. అత్యంత సరసమైన ధరకు అన్ని ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ అందించాలన్న మా నిబద్ధతను రెడ్‌మి నోట్‌ 11 ప్రొ ప్రతిబింబిస్తుంది అని ఆయన అన్నారు.
ప్రొ లెవల్‌ డిజైన్, డిస్‌ప్లే, ప్రాసెసర్లు
రెడ్‌మి నోట్‌ 11 ప్రొ+ 5జీ, రెడ్‌మి నోట్‌  11 ప్రొ-  రెండు కూడా తన సొగసైన, ప్రీమియం డిజైన్‌తో తలమానికంగా నిలుస్తాయి. అద్భుతమైన డిస్‌ప్లేలు, అందంగా రూపొందించిన గ్లాస్ బ్యాక్‌లతో ఇవి రెడ్‌మి EVOL డిజైన్ తదుపరి స్థాయి EVOL ప్రొను ప్రతిబింబిస్తాయి. ఫ్లాట్ సైడ్లు, ఫ్లాట్‌బ్యాక్‌ వీటి విశిష్ఠతలు, అంతే కాదు పరిశుభ్రమైన, సొగసైన కెమెరా ప్రదేశం మరో అద్భుతమైన ఫీచర్‌. రోజువారీ అవసరాలు తట్టుకుంటుందని చెప్పేందుకు  ఐపీ53 రేటింగ్ ఉండనే ఉంది. అందమైన కనువిందు చేసే  బ్లూ, బ్ల్యాక్‌, వైట్‌ షేడ్స్‌లో ఇవి లభిస్తున్నాయి.
రెడ్‌మి నోట్‌ 11 ప్రొ+ 5జీ, రెడ్‌మి నోట్‌  11 ప్రొ
రెడ్‌మి నోట్‌ 11 ప్రొ+ 5జీ  ఇప్పటి వరకు లేనటువంటి  అత్యంత శక్తివంతమైన రెడ్‌మి నోట్‌. ఇది వేగవంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.  ఈ  సెగ్మెంట్‌లో ఇది అత్యంత శక్తివంతమైన. సమర్థవంతమైన చిప్‌సెట్. రెడ్‌మి నోట్‌ 11 ప్రొ  అత్యంత ప్రశంసలు పొందిన వేగవంతమైన మీడియా టెక్‌ హిలియో  G96 కలిగి ఉంది,  ఈ శ్రేణిలో ఇది అత్యంత శక్తివంతమైన 4G ప్రాసెసర్‌లలో ఒకటి. చాలా వేగవంతమైన పనితీరు,  సూపర్-స్మూత్ మల్టీ-టాస్కింగ్‌ అందించేందుకు రెండు ఫోన్‌లు కనిష్టంగా 6GB ర్యామ్‌ కలిగి ఉన్నాయి.  మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు ఎక్స్‌టర్నల్‌ స్టోరేజ్‌కు అవకాశం ఉంది. గేమింగ్ కావచ్చు, ఇమేజ్‌ల ఎడిటింగ్ కావచ్చు,  లేదా రోజువారీ జీవితానికి కావాల్సింది కావచ్చు రెడ్‌మి నోట్‌ 11 సిరీస్‌ అన్నింటినీ ఏ మాత్రం శ్రమలేకుండా హ్యాండిల్ చేస్తుంది.
         రెడ్‌మి నోట్‌ 11 ప్రొ+ 5జీ, రెడ్‌మి నోట్‌  11 ప్రొ రెండు కూడా ప్రొ స్థాయి డిస్‌ప్లేలు- 120Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన 16.9సెం.మీ (6.67) పూర్తి హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేలు కలిగి ఉన్నాయి. అద్భుతమైన 1200 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో ఇవి ఎటువంటి రాజీ లేని అధిక-నాణ్యతగల డిస్‌ప్లేలని చెప్పాలి.  ఈ ధరల శ్రేణిలో లేదా ఇంత కంటే ఎక్కువ ధరలోనూ కస్టమర్లు పొందగలిగే ఉత్తమమైనవి ఇవి. డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు, సాంప్రదాయ 3.5 ఎంఎంఆడియో జాక్‌తో కూడిన రెడ్‌మి నోట్‌ 11 ప్రొ సిరీస్ వీడియోలు చూడటం, ఇష్టమైన వైర్డు హెడ్‌ఫోన్‌లలో సంగీతం వినడం లేదా సరికొత్త క్రికెట్‌ యాక్షన్ ట్యూన్‌ చేసేందుకు లేదా బాలీవుడ్‌ బ్లాక్ బస్టర్ చూసేందుకు రూపొందించబడ్డాయి.
ప్రొ-లెవల్‌ ఫొటోగ్రాఫి కోసం ఫ్లాగ్‌షిప్‌ సెన్సర్‌
రెండు ఫోన్‌లు కూడా అద్భుతమైన  ప్రొ-లెవల్ కెమెరాతో కూడిన ఉన్నాయి. రెడ్‌మి నోట్‌ 11 ప్రొ+ 5జీ, రెడ్‌మి నోట్‌ 11 ప్రొలో ప్రధాన 108-మెగాపిక్సెల్ కెమెరా ఫ్లాగ్‌షిప్‌ డివైసుల్లో మాత్రమే కనిపించే సాంసంగ్‌ HM2 సెన్సార్  కలిగి ఉంది.  దానికి అనుబందంగా 118 డిగ్రీల ఫీల్డ్ వ్యూని అందించే 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు, సెంటీమీటర్ స్థాయిలో ఉండే క్లోజ్-అప్‌ల కోసం 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 11 ప్రొ వెనుక భాగంలో అదనంగా 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కూడా ఉంది.
తక్కువ కాంతిలో మెరుగైన ఫొటోలు, నైట్ మోడ్ 2.0తో తక్కువ వెలుతురు, రాత్రిపూట  మెరుగైన ఫొటోగ్రఫీ, మెరుగైన పోర్ట్రెయిట్ మోడ్‌లో టాప్-ఆఫ్-ది-లైన్ ఎడ్జ్ డిటెక్షన్, సూపర్ వీడియో వంటివన్నీ రెడ్‌మి నోట్‌ 11 ప్రొ సిరీస్‌ను ప్రొ ఫొటోగ్రాఫర్‌కు ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి.  అద్భుతమైన సెల్ఫీలు అందించేందుకు ఇందులో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు  ఉన్నాయి,
రోజంతా ప్రొ-ఫామెన్స్ కోసం 15 నిమిషాలు
రోజంతా ప్రొ-స్థాయి పనితీరును అందించేందుకు రెడ్‌మి నోట్‌ 11 సిరీస్‌కు కేవలం 15 నిమిషాల ఛార్జింగ్ సరిపోతుంది. రెడ్‌మి నోట్‌ 11ప్రొ+ 5జీ, రెడ్‌మి నోట్‌ 11 ప్రొ, 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీలతో వస్తాయి. ఇవి 67W ఫాస్ట్ టర్బో ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తాయి. వినియోగదారులు  సరైన ఛార్జింగ్ అనుభవాన్ని పొందేందుకు వీలుగా  థర్డ్-పార్టీ ఛార్జర్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా బాక్సులో ఉండే 67W ఛార్జర్‌లు ఉంటాయి. లిక్విడ్‌కూల్ సాంకేతికతతో  వినియోగదారులు ఎటువంటి హీటింగ్ సమస్యల గురించి ఆందోళన చెందకుండా విస్తృతమైన గేమింగ్ ఆడుకోవచ్చు. ప్రొ అనుభవాన్ని పూర్తిగా అందించేందుకు వేగవంతమైన, సురక్షితమైన సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. రెడ్‌మి నోట్‌ 11ప్రొ+ 5జీ, రెడ్‌మి నోట్‌ 11 ప్రొ లోని ఐఆర్‌ బ్లాస్టర్‌ టెలివిజన్స్‌ నుంచి ఎయిర్ కండిషనర్ల వరకు అన్ని గృహోపకరణాలను నియంత్రించడానికి  ప్రొ-లెవల్‌ రిమోట్‌గా మార్చుకోవచ్చు. సాఫీగా పనిచేసేందుకు, మల్టీ టాస్కింగ్ చేసేందుకు ఈ స్మార్ట్‌ఫోన్లలో  యూఎఫ్ఎస్‌ 2.2 హై-స్పీడ్ స్టోరేజ్‌తో పాటు LPDDR4X RAM ఉంది. అంతే కాదు ర్యామ్‌ విస్తరించుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. యూజర్లు 8+3జీబీ ర్యామ్‌ వరకు పొడిగించుకోవచ్చు.
రెడ్‌మి నోట్‌లోని అన్ని సుగుణాలతో పాటు పుష్కలంగా ప్రొ
ప్రొ-లెవల్‌ డిజైన్‌, ప్రొ-లెవల్‌ డిస్‌ప్లేలు, ప్రొ-లెవల్‌ పనితీరు, ప్రొ-లెవల్‌ కెమెరా, ప్రొ-లెవల్‌ బ్యాటరీ లైఫ్‌, ఛార్జింగ్‌ – ఇవన్నీ కొత్త రెడ్‌మి నోట్ 11 ప్రొ సిరీస్‌లో ఉన్నాయి. ఇవన్నీ సాఫీగా పనిచేసేలా చూసేందుకు కొత్త MIUI 13, ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌గా అందుబాటులో ఉంది. ఆప్టిమైజ్డ్ ఫైల్‌ స్టోరేజ్‌ సిస్టమ్‌, ర్యామ్‌ ఆప్టిమైజేషన్‌ ఇంజిన్‌, ప్రాసెసర్‌ ప్రయారిటీ ఆ ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ తీసుకువస్తుంది.


రెడ్‌మి రెండో స్మార్ట్‌వాచ్‌ – రెడ్‌మి వాచ్‌ 2 లైట్‌
           గతేడాది విడుదల చేసిన రెడ్‌మి వాచ్‌ విక్రయాలు అద్భుతంగా ఉండటంతో వేరెబుల్‌ పోర్టుఫోలియోలో రెండో స్మార్ట్‌  రెడ్‌మి వాచ్‌ 2 లైట్‌ విడుదల చేస్తున్న రెడ్‌మి ప్రకటింది. పేరుకు తగట్టుగానే ఇది చాలా తక్కువ బరువుతో (35 గ్రాములు) రూపొందించబడింది.  3.94  సెం.మీ (1.55) విశాలమైన కాంతివంతమైన వైబ్రెంట్‌ ఎడ్జ్‌ డిస్‌ప్లే కలిగిన ఈ వాచ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌, నోటిఫికేషన్లను చూపేటప్పుడు చూపు తిప్పుకోని అనుభూతిని అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఇష్టానికి అనుగుణంగా మార్చుకునేందుకు  120 వాచ్‌ ఫేసెస్‌ ఉన్నాయి.
షామి ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌ మురళీకృష్ణన్‌.బి. మాట్లాడుతూ “ప్రతీ ఒక్కరికీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న మా ముఖ్యసిద్ధాంతానికి అనుగుణంగా ఫోన్‌ ప్లస్‌ స్ట్రాటజీలో భాగంగా రెడ్‌మి వాచ్‌ 2 లైట్‌ను కంపెనీ ఆవిష్కరిస్తోంది. వేగవంతమైన వారి జీవన విధానానికి అనుగుణంగా అందంగా డిజైన్ చేసిన స్మార్ట్‌ వాచీలను మా యూజర్లకు అందిస్తుండటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది వారి వ్యక్తిగత స్టైల్‌ను ఆకర్షణగా నిలవడమే కాదు వారు మరింత కోరేలా చేస్తుంది” అన్నారు
           ఈ గడియారం హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్ (SpO2) సెన్సార్లతోనే కాకుండా అంతర్నిరిత  జీపీఎస్‌తో కూడి ఉంటుంది కాబట్టి మరింత ఖచ్చితమైన లొకేషన్ డేటా కోసం వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్లకు  కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం ఉండదు. ఇది నిద్రను ట్రాక్ చేస్తుంది అలాగే 100 కంటే ఎక్కువ వర్కౌట్‌ మోడ్స్‌ ట్రాక్ చేసేలా రూపొందించబడింది. ఇందులో 17కి పైగా ప్రొఫెషనల్ మోడ్స్‌, అన్ని ఇన్‌డోర్, ఔట్‌డోర్ యాక్టివిటీల కోసం 90+ అదనపు మోడ్స్  ఉన్నాయి. వినియోగదారులు వారి రన్నింగ్ లేదా వాకింగ్ స్థితిని ఖచ్చితంగా గుర్తించేందుకు ఆటో-డిటెక్షన్ ఫంక్షన్‌ని యాక్టివేట్ చేయడానికి ఎంచుకోవచ్చు. ఈ గడియారం SpO2 డిటెక్షన్, హృదయ స్పందన ట్రాకింగ్, నిద్ర, ఒత్తిడి స్థాయి పర్యవేక్షణ, శ్వాస శిక్షణ, రుతుక్రమం ట్రాకింగ్ వంటి అనేక విస్తృతమైన ఆరోగ్య-ట్రాకింగ్ ఫీచర్స్ కలిగి ఉంది. స్మార్ట్‌ ఫోన్‌లో చేసినట్టుగానే మ్యూజిక్‌ కంట్రోల్‌ చేయవచ్చు, అంతే కాకుండా వాచ్‌ నుంచి నేరుగా మెసేజస్‌కు వేగంగా సమాదానాలు పంపించవచ్చు. రెడ్‌మి వాచ్‌ 2 లైట్‌  పది రోజుల బ్యాటరీ లైఫ్‌, ధ్రువీకరించిన 5 ఎటీఎం నీటి నిరోధకతతో బాక్స్‌లో మాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్‌తో వస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.