Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మీరెప్పుడైనా ‘తెలియనప్పుడు అనుసరించడమే’ అనే మాటలు విన్నారా ? అంటే ఏదైనా పని లేదంటే ధోరణి పట్ల అవగాహన లేకుండా దానిలో పాల్గొనడం అని అర్ధం. కానీ పెట్టుబడుల దగ్గరకు వచ్చేసరికి ఇది చాలా వరకూ మదుపరులకు శాపం కావొచ్చు. ఎందుకంటే, వారు ట్రెండ్స్‌ను బట్టి మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ ప్రక్రియలో, వారు అవివేకంగా, చాలా ఎక్కువగా ఊహించుకుంటారు లేదా సత్యదూరమైన నిరాశావాదంతో ఉంటారు. చివరకు సరికాని రీతిలో పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ పరిస్థితులను అధిగమించడానికి మరియు తగినంతగా రాబడులను పొందడానికి అతి సరళమైన మార్గం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ (ఎస్‌ఐపీ). క్లుప్తంగా చెప్పాలంటే, మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే ఓ సేవ. దీనిలో మదుపరులు ముందుగా నిర్ధేశించుకున్న మొత్తాలకు క్రమానుగతమైన చెల్లింపులను చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్లను కొనుగోలు చేస్తారు. దీనికి గానూ వారు ఫండ్ (ఎన్‌ఏవీ ఆధారితం) హోల్డింగ్స్ నుంచి రాబడిని పొందవచ్చు. ఈ కాంపౌండింగ్ ప్రయోజనాలతో కలిపి ఎస్‌ఐపీలు దీర్ఘకాలంలో సహేతుకమైన రాబడులను అందించవచ్చు. ఈ ప్రయోజనాలను గుర్తించిన కారణంగానే నూతన ఎస్‌ఐపీ ఖాతాల నమోదు పరంగా స్ధిరంగా వృద్ధి కనిపిస్తుంది. అంతేనా, ఈ ఎస్‌ఐపీలతో పాటుగా మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు సైతం మదుపరులకు సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్‌టీపీ) ప్రయోజనాలు అందిస్తున్నాయి. దీనిద్వారా మదుపరులు తమ పెట్టుబడులను అదే ఫండ్ హౌస్‌లో ఒక పథకం నుంచి మరో పథకానికి బదిలీ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ఫలితంగా, మదుపరులు తమ పోర్ట్‌ఫోలియోలను మారుతున్న మార్కెట్ పరిస్థితులకనుగుణంగా తాము కోరుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి సజావుగా రీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎస్‌ఐపీలు మరియు ఎస్‌టీపీల శక్తిపై ఆధారపడి, మదుపరులు తమ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి బలమైన ఆర్థిక ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవచ్చు.
ముందుగా ఎస్‌ఐపీల వల్ల కలిగే కీలక ప్రయోజనాలను చూద్దాం...
1. చిన్న పెట్టుబడి మొత్తం – ఎస్‌ఐపీల ద్వారా మదుపరులు అతి చిన్న మొత్తాలు అంటే నెలకు 100/ 500/ 1000 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. అందువల్ల వారు తమ జీవిత తొలి దశలోనే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు. ఈ చిన్న మొత్తాల పొదుపు, దీర్ఘకాలంలో వారికి మెరుగైన సంపద సృష్టి అవకాశాలనూ కలిగిస్తాయి.
2. క్రమశిక్షణ కలిగిన మదుపరునిగా మిమ్మల్ని మారుస్తుంది – చాలామంది మదుపరులు పెట్టుబడులను ఉత్సాహంగానే ప్రారంభిస్తారు కానీ, ఆ పెట్టుబడి పథకానికి కట్టుబడి ఉండటంలో మాత్రం విఫలమవుతుంటారు. ఈ కారణం చేతనే వారి ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడంలోనూ విఫలమవుతుంటారు. అయితే, ఎస్‌ఐపీలను తీర్చిదిద్దిన విధానం కారణంగా క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులను దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మదుపరులు తాము చెల్లించాలనుకుని ముందుగా నిర్ధేశించుకున్న మొత్తాలను స్వయంచాలకంగా వారు తొలుత ఎంచుకున్న పథకంలో పెట్టుబడి పెడుతుంది , తద్వారా ప్రతినెలా పెట్టుబడులు పెట్టే అవసరం తప్పిస్తుంది.
3. రూపాయి ధర సగటు – మార్కెట్ ఒడిదుడుకుల వల్ల తక్కువ ప్రభావం చూపే పథకాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మార్కెట్ హెచ్చు తగ్గుల సమయంలో పెట్టుబడిదారునికి రూపాయి ధర సగటు మద్దతునందిస్తుంది. ఎన్‌ఏవీ అతి తక్కువగా ఉన్న సమయంలో, ఎస్‌ఐపీలు మదుపరులకు అధిక యూనిట్లను కేటాయిస్తాయి. ఒకవేళ ఎన్‌ఏవీ అధికంగా ఉంటే ఎస్‌ఐపీలు అతి తక్కవగా యూనిట్లను అందిస్తాయి. అంటే దీనర్థం తక్కువగా సగటు ఖర్చు ఉంటుంది.
4. కాంపౌండింగ్ శక్తి – ఎస్‌ఐపీ ప్రారంభించడానికి అత్యంత బలమైన కారణాలలో ఒకటి కాలక్రమేణా డబ్బును మిళితం చేసే శక్తి. మ్యూచువల్ ఫండ్ ద్వారా మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన నగదుతో మదుపరులు సహేతుకమైన రాబడులు పొందడానికి అనుమతిస్తుంది. ఇది ద్రవ్యోల్భణ పరిస్థితులను అధిగమించేందుకు మరియు తమ ఆర్థిక లక్ష్యాలను క్రమపద్ధతిలో సాధించేందుకు కూడా సహాయపడుతుంది.
5. భావోద్వేగ పెట్టుబడులు లేవు– పెట్టుబడి పెట్టేటప్పుడు, మదుపరులు తమ భావోద్వేగాలను దూరంగా పెట్టాలి. స్వల్పకాలంలో మార్కెట్‌లో గణనీయమైన ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. ఈ కారణంగా భావోద్వేగ పూరితంగా మదుపరులు తమ నిర్ణయాలను తీసుకునేందుకు సైతం ఇది తోడ్పడుతుంది. కానీ ఈ తరహా పెట్టుబడులు కోరుకున్న ఫలితాలను మాత్రం అందించలేవు. ఎస్‌ఐపీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మదుపరులు ఈ తరహా తప్పులు చేయకుండా కాపాడబడతారు మరియు క్రమశిక్షణతో కూడినపెట్టుబడి విధానం అనుసరించేందుకు సైతం వారికి తోడ్పడుతుంది.
మార్కెట్‌లో అందుబాటులోని విభిన్న రకాల మ్యూచువల్ ఫండ్‌లను మదుపరులు పరిశీలించడంతో పాటుగా తమ ఆర్థిక లక్ష్యాలకు తగిన రీతిలో ఉంటూనే తమ రిస్క్ స్వీకరణకు అనుగుణంగా ఉన్న పథకాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. అదే సమయంలో, మార్కెట్‌ల యొక్క స్వభావం దృష్టిలో పెట్టుకుని మ్యూచువల్ ఫండ్ సంస్థలు మదుపరులకు ఎస్‌టీపీలను ఎంచుకునే సౌలభ్యం సైతం అందిస్తాయి.
ఎస్‌టీపీ ల వల్ల కలిగే మూడు ముఖ్య ప్రయోజనాలు ఏమిటంటే...
1. సిస్టమాటిక్ పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ – ఎస్‌టీపీ యొక్క అతిపెద్ద ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే, మదుపరులు మార్కెట్ పరిస్థితులు లేదంటే తమ ఆర్థికావసరాలకనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియోను రీ బ్యాలెన్స్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు, ఈక్విటీ మార్కెట్‌లో అనిశ్చితి అధికంగా ఉంటే, మదుపరులు ఈక్విటీ పథకాల నుంచి హైబ్రిడ్ లేదా డెబ్డ్ ఓరియెంటెడ్ పథకాలకు పెట్టుబడులను బదిలీ చేయవచ్చు. ఒకసారి ఈక్విటీ మార్కెట్‌లు స్ధిరీకరించబడిన తరువాత, ఈ నగదును తిరిగి ఈక్విటీ లేదా హైబ్రిడ్ స్కీమ్‌కు బదిలీ చేయవచ్చు.
2. సౌకర్యం అందిస్తుంది – తమ అవసరాలకనుగుణంగా మదుపరులు ఎస్‌టీపీలను అనుకూలీకరించుకోవచ్చు. దీనిలో రోజు, తేదీ మరియు ఎస్‌టీపీ ఫ్రీక్వెన్సీ (రోజువారీ నుంచి వార్షికంగా), బదిలీ చేసే నగదు మొత్తం అలాగే వాయిదాల మొత్తం లేదా బదిలీ వ్యవధి వంటివి భాగంగా ఉంటాయి.
3. పిక్ టేకింగ్ –ఎస్‌టీపీలలో ముఖ్యంగా మూడు రకాలున్నాయి. అవి ఫిక్స్‌డ్, క్యాపిటల్ అప్రిసియేషన్ మరియు ఫ్లెక్సీ. ఫిక్స్‌డ్ ఎస్‌టీపీలలో ఎస్‌టీపీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి ముందుగానే నిర్ణయిస్తారు. అదే క్యాపిటల్ అప్రిసియేషన్‌లో స్కీమ్ నుంచి వచ్చే రాబడులను తిరిగి మరో స్కీమ్‌కు మళ్లిస్తారు. ఇక చివరిదైన ఫ్లెక్సీ ఎస్‌టీపీలో మదుపరులు తమ ప్రస్తుత పెట్టుబడులలో కొంత మొత్తాన్ని నూతన పథకంలో మళ్లించవచ్చు.
అందువల్ల, ఓ వైపు ఎస్‌ఐపీలు మదుపరులకు దీర్ఘకాలిక సంపద సృష్టి పట్ల క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అవలంభించడానికి అనుమతిస్తాయి. మరో వైపు, ఎస్‌టీపీలు ఈ కేటాయింపులను తెలివిగా నిర్వహించడానికి వీలు కల్పిస్తాయి. వీటిని కలిపి చూసినట్లయితే , పెట్టుబడిదారులు తమ జీవిత లక్ష్యాలకు చేరువయ్యే సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించడంలో ఇవి సహాయపడతాయి.