Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భూగర్భ జలాలు: వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా నిర్లక్ష్యం చేసిన ప్రపంచ రక్షణ. | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 21,2022

భూగర్భ జలాలు: వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా నిర్లక్ష్యం చేసిన ప్రపంచ రక్షణ.

ప్రపంచ జనాభాలో భారతదేశం 17.6% జనాభా ని కలిగి ఉంది కానీ ప్రపంచంలోని మంచినీటి వనరులలో కేవలం 4% మాత్రమే కలిగి ఉంది 
దశాబ్దాలుగా భూగర్భ జలాల వెలికితీత ప్రక్రియ పెరుగుతోంది.. సుమారు 17% భూగర్భజలాలు ఎక్కువగా వినియోగిస్తున్నారు.
కొన్ని దేశాలలో , ముఖ్యంగా దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాలలో, భూగర్భజలాలు కలుషితమయ్యాయి. ముఖ్యంగా ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్‌ ను కలిగి వున్నాయి. 
16వ 'బీహార్ ఆర్థిక సర్వే నివేదిక 2021-22` ప్రకారం బీహార్‌లోని 38 జిల్లాలకు 31 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని భూగర్భ జలాలు గణనీయంగా కలుషితమవుతున్నాయని పేర్కొంది.
న్యూఢిల్లీ: భూగర్భజలం - దాదాపు అన్నిచోట్లా భూగర్భంలోనే ఉంటుంది. ఈ భూగర్భ జలాలు వందల వేల జనాభా యొక్క ప్రాణాలను కాపాడే సామర్ధ్యం కలిగి మరియు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రపంచ బీమా పాలసీగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచ నీటి దినోత్సవం-2022 సందర్భంగా, 'గ్రౌండ్ వాటర్: వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా నిర్లక్ష్యం చేసిన ప్రపంచ రక్షణ` అనే పేరుతో  WaterAid  ఒక నివేదికను విడుదల చేస్తోంది, ఇది ప్రపంచంలోని వివి ధ ప్రాంతాలలోని భూగర్భ జల వనరుల పరిస్థితిపై తీవ్ర దృష్టి సారిస్తుంది. బ్రిటీష్ జియోలాజికల్ సర్వే మరియు వాటర్ ఎయిడ్ యొక్క కొత్త విశ్లేషణ ప్రకారం ఆఫ్రికాలోని అనేక దేశాల్లో - మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి మరియు చాలా కాలం పాటు ఉపయోగించుకోవడానికి తగినంత భూగర్భ జలాలు కలిగి ఉన్నాయని వెల్లడించింది. కానీ ముఖ్యంగా ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, భూగర్భజలాల నిర్వహణ లేమి మరియు నీటి కాలుష్యం భూగర్భజల వనరుల కొరతకు దారి తీస్తోంది. ఈ ప్రక్రియ రాబోయే సంవత్సరాల్లో మిలియన్ల జనాభా పై ప్రభావితం చూపిస్తుంది ప్రభావితం చేస్తుంది.
   ఉదాహరణకు సబ్-సహారా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో భూగర్భజలాలు ఎక్కువగా ఉపయోగించబడలేదు, అయితే దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాల్లో మితిమీరిన వినియోగం ఎక్కువగా ఉంది. తగినంత నైపుణ్యం మరియు పెట్టుబడి లేకపోవటంతో పాటుగా, పేలవమైన నియంత్రణ - నిర్వహణ లోపం, నీటి వనరుల కాలుష్యం మరియు నీటి కాలుష్యం - ఇవి వినాశకరమైన పరిణామాలకు దారితీస్తాయి.
 WaterAid  యొక్క పరిశోధనా బృందం యొక్క పరిశోధనలు ప్రకారం ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లో చాలా వరకు భూగర్భజలాల వెలికితీత, సాధారణంగా వర్షపాతం నుండి జరిగే భూగర్భజలాల పునరుద్ధరణ కంటే ఎక్కువగా ఉందని వెల్లడిస్తున్నాయి. ఈ కారణం గా కరువు కాలంలో నీటి సరఫరా నిలకడగా ఉండకపోవచ్చు మరియు ప్రజలకు చాలా అవసరమైన సమయంలో నీటి వనరులు అయిపోవచ్చు. కొన్ని దక్షిణాసియా దేశాలలో భూగర్భ జలాల్లో సేకరించిన 90% వరకు నీటిని వ్యవసాయం కొరకు ఉపయోగిస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లోని బావులు ఎండిపోవచ్చు మరియు కమ్యూనిటీలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు మరియు పాఠశాలలు వారి రోజువారీ అవసరాలకు తగినంత నీరు లేక పోవచ్చు. దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో , అధికమైన వ్యవసాయం కొరకు తీవ్రమైన ఎరువులు మరియు పురుగుమందుల ఉపయోగంబీ పేలవంగా నియంత్రించబడిన పరిశ్రమల నుండి విష రసాయనాల వ్యర్ధాలు, పేలవంగా నిర్వహిస్తున్న పారిశుధ్యం నుండి మురుగునీరు భూగర్బజలాల ను కలుషితం చేస్తున్నాయి .
యూకేలోని వాటర్‌ఎయిడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ వైన్‌రైట్ ఇలా అన్నారు 'మా పరిశోధనలు ద్వారా ఆఫ్రికాలో నీటి కొరత ఏర్పడుతుందనే అపోహ ను తొలగించాయి. కానీ ఆ ఖండంలోని లక్షలాది మందికి ఇప్పటికీ తాగడానికి సరిపడా స్వచ్ఛమైన నీరు లేకపోవడం చాల విచారకరం . ఆ ప్రజల పాదాల క్రింద చాలా నీటి నిల్వలు లేదా భూగర్భజలాలు ఉన్నాయి, వాటిలో చాలా వరకు వర్షపాతం ద్వారా లేదా ఇతర ఉపరితల నీటి ద్వారా ప్రతి సంవత్సరం భూగర్భజలాలు భర్తీ చేయబడుతున్నాయి , అయితే దీర్ఘకాలికంగా తక్కువగా నిధులు ఉన్నందున వారు ఆ భూగర్భజలాల వెలికితీత సేవలను ఉపయోగించ లేరు.వాతావరణ సంక్షోభం ఎదురైనా భూగర్భ జలాలను ఉపయోగించడం వల్ల మిలియన్ల మందికి సురక్షితమైన, స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుంది.
      భారతదేశం, పాకిస్తాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్‌లలో వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందిం చేందుకు కావలసిన భూగర్భ జలాలు , ఇండో-గంగా బేసిన్ సరిహద్దుల నుండి భూగర్భ జలాల సంగ్రహణ మొత్తం ప్రపంచ భూగర్భ జలాల ఉపసంహరణలో 25% కలిగి ఉంది. NASA గ్రావిటీ రికవరీ మరియు క్లైమేట్ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్‌ల నుండి సేకరించిన డేటా నుండి రీడింగ్‌లు భూగర్భజలాల క్షీణతను చూపుతున్నాయి [4.0 ± 1.0 cm yr-1 సమానమైన నీటి ఎత్తు (17.7 ± 4.5 ykm కంటే భారతీయ రాష్ట్రాలు) పంజాబ్ మరియు హర్యానా (ఢిల్లీతో సహా). [1]  డేటా ప్రకారం గా సింధు, బ్రహ్మపుత్ర మరియు గంగానది ఉమ్మడి వార్షిక ప్రవాహం ,200 ఎ లోతు వరకు గల భూగర్భజలాల పరిమాణం కంటే 20 రెట్లు ఎక్కువగా ఉందని అంచనా వేసింది. 2000 నుండి 2012 మధ్య కాలం లో జలాశయంలోని నీటి మట్టం 70% స్థిరంగా లేదా పెరుగుతున్నట్లు డేటా చూపిస్తుంది. [2]
       ప్రపంచంలోని మంచినీటి వనరులలో భారతదేశం కేవలం 4% మాత్రమే కలిగి ఉంది. దశాబ్దాలుగా భూగర్భ జలాల వెలికితీత ఉద్ధృతి పెరుగుతూ వస్తోంది. గడచిన 50 సంవత్సరాలలో, బోర్‌వెల్‌ల సంఖ్య 1 మిలియన్ నుండి 20 మిలియన్లకు పెరిగింది, అదే ప్రపంచంలోనే భూగర్భ జలాల ఉపయోగించే అతిపెద్ద వినియోగదారునిగా భారతదేశాన్నిమార్చింది.సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం సుమారు 17% భూగర్భ జలాల బ్లాక్‌లు సాధారణం కంటే ఎక్కువగా వినియోగించబడుతున్నాయి (అంటే నీటిని వెలికితీసే రేటు జలాశయం పునరుద్ధరణ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది) అయితే 5% మరియు 14% వరుసగా క్లిష్టమైన మరియు కొంచెం క్లిష్టమైన దశలను సూచిస్తున్నాయి . ముఖ్యంగా వాయువ్య, పశ్చిమ మరియు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని మూడు ప్రధాన ప్రాంతాలలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. [3]
భారతదేశంలోని భూగర్భజలాల పరిస్థితిపై తన ఆలోచనలను తెలుపుతూ , వాటర్ ఎయిడ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ VK  మాధవన్ ఇలా అన్నారు: 'భూగర్భజలాలు అదృశ్యంగా ఉన్నా కూడా , అది తరిగిపోగలదని మనం గుర్తించాలి. భూగర్భ జలాల వెలికితీతను నియంత్రించడం మరియు దానిపై అవసరాన్ని తగ్గించడం మన తక్షణ కర్తవ్యం. అదే సమయంలో, మన జలాశయాలను ఒక క్రమపద్ధతిలో పునరుద్ధరించడం పై దృష్టి పెట్టాలి, ప్రత్యేకించి ఉపరితల నీటి వనరులను ఉపయోగించి మన పరిరక్షణ ప్రయత్నాలను పెంచడం ద్వారా మరియు రీఛార్జ్ జోన్‌లను పెంచడం ద్వారా భూగర్భజలాలను కాపాడుకోవచ్చు. కలుషితమవుతు పెరుగుతున్న భూగర్భజలాలే సాక్ష్యం గా, అవసరమైన దానికంటే తీసుకున్న అతి తక్కువ శ్రద్ధ సమస్యను సూచిస్తుంది.కనీసం ఇప్పుడైనా మనం తగిన చర్యలు తీసుకోవాలి.
     'వాటర్ ఎయిడ్ భారతదేశం అంతటా అనేక జిల్లాల్లో కమ్యూనిటీ-ఆధారిత నీటి నాణ్యత పరీక్షల కోసం మరియు పర్యవేక్షణను రూపొందించడానికి ఇంకా నివాస ప్రాంతాలకు దగ్గరగా స్థిరమైన నీటి వనరుల ఆవశ్యక్తత ను నిర్ధారించడానికి, నీటి సంరక్షణ కోసం వాటర్ ఎయిడ్ పని చేస్తోంది.`
     కొన్ని దేశాల్లో,ముఖ్యంగా దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాలలో, భూగర్భజలాలు సహజంగానే ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్‌తో కలుషితమవుతున్నాయి. అక్కడి వారికీ చికిత్స అందించకపోతే అనారోగ్యం లేదా చివరకు మరణానికి కూడా దారితీస్తుంది. ఉదాహరణకు, భారతదేశంలోని , ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు తూర్పున పశ్చిమ బెంగాల్‌ల పై ఆర్సెనిక్ కాలుష్యం తన ప్రభావం చూపిస్తుంది.. ఒడిశాలోని అనేక జిల్లాలు అధిక ఫ్లోరైడ్, ఇనుము మరియు లవణీయతతో కూడి తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మధ్య మరియు ఆగ్నేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నైట్రేట్ మరియు ఇనుము యొక్క అధిక స్థాయిలు కాలుష్యం చూపుతున్నాయి.
        ఇటీవల ప్రచురించిన 16వ బీహార్ ఆర్థిక సర్వే నివేదిక 2021-22 ప్రకారం గా బీహార్‌లోని 38 జిల్లాల్లోని 31 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు భారీగా కలుషితమవుతున్నాయని పేర్కొంది. అక్కడి నీటిలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, అలాగే ఇనుము ద్వారా కాలుష్యం పెరుగుతుంది.38 జిల్లాల్లో 31 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, ఐరన్ అధికంగా ఉన్నాయని, ఇది ఆరోగ్యానికిపెను ప్రమాదాన్నీ సూచిస్తుందని నివేదిక పేర్కొంది. 30,272 గ్రామీణ వార్డుల్లో భూగర్భ జలాల్లో రసాయన కాలుష్యం ఉంది. గంగా తీరాన ఉన్న 14 జిల్లాల్లోని మొత్తం 4,742 గ్రామీణ వార్డులు ముఖ్యంగా ఆర్సెనిక్ కాలుష్యంతో ప్రభావితమయ్యాయి. [4]
  నివేదిక ప్రకారం నిర్ణీత శాతం గా వార్షిక ప్రభుత్వ బడ్జెట్‌లు మరియు అంతర్జాతీయ దాతల నిధులు , ప్రయివేటు రంగ పెట్టుబడులను పెంచడం ద్వారా అట్టడుగు వర్గాలకు అవసరమైన నీరు మరియు పారిశుధ్యం అందించాల్సిన అవసరాన్ని మరింత నొక్కి చెప్తుంది.
     బాధ్యతాయుతమైన భూగర్భజలాల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం మరియు దీనికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యం, ఆర్థిక మరియు సంస్థాగత మద్దతు, వాతావరణ సంక్షోభం ,ముందు వరుసలో నివసించే కమ్యూనిటీలకు ప్రాణాలను కాపాడే స్థిరమైన మరియు సురక్షితమైన నీరు , మరియు పారిశుధ్యాన్ని అందించడం కీలకమని COP 27 లో అంగీకరించడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఇది నొక్కి చెప్పింది.

వాటర్‌ఎయిడ్ మరియు BGS  ప్రకారం,మంచి నాణ్యత గల భూగర్భజలాలను అందుబాటులోకి తేవడమే కాకుండా స్థిరమైన మరియు పొదుపు మార్గంలో భూగర్భ జలాలను వెలికితీసి దాని పూర్తి సామర్థ్యాన్నిఉపయోగించడం , భూమి యొక్క భూగర్భ జలాలను బయల్పరచడానికి అవసరమైన దిశానిర్దేశం మరియు పర్యవేక్షణలో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం దీనిని సాధించడానికి గల ఒక మార్గం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.